
లాక్‌డౌన్ కాలాన్ని నటుడు దుల్కర్ సల్మాన్ తన భార్య అమల్ సుఫియా, కూతురు మరియం అమీరా సల్మాన్‌తో ఉల్లాసంగా గడుపుతున్నారు. మంగళవారం ఈ మలయాళ నటుడు కూతురు మూడవ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలో దుల్కర్ తన కూతురుకి బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. (అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు)
‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే డార్లింగ్ మేరీ.. ‘నేను ఇప్పుడు పెద్ద అమ్మాయిని’ అని నువ్వు చెప్పింది నిజమే. నువ్వు త్వరగా పెరుగుతూ, మాటలు పూర్తిగా నేర్చుకుంటున్నావు. నీకు మూడు సంవత్సరాలు నిండాయి. పెద్దదానివి అయిపోయావు. నీ యువరాణి దుస్తుల్లో చకాచకా తిరుగుతున్నావు. మాకు కథలు చెబుతున్నావు. అవును నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి. సొంతంగా నడవడం నేర్చుకున్నావు. ఇప్పుడే పరుగెత్తుతున్నావు. అవును నువ్విప్పుడు పెద్ద అమ్మాయివి. కానీ మాకు నువ్వింకా చిన్నపిల్లలాగే ఉన్నావు. ఎప్పుడైతే మేము నిన్ను మొదటిసారి చూశామో ఆ రోజులా. ఆ రోజు మేము తొలిసారి ఓ దేవతను చూశాము. నువ్వు ఎదుగుతున్నా.. మాకు చిన్నపాపలాగే మాకు కనిపిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మా చిన్నారివే. నువ్వు పెద్దదానివి అయ్యావని ప్రపంచమంతా చెప్పినా.. మాకు నువ్వు చిన్న పిల్లవే డార్లింగ్ మేరీ’’. అంటూ కూతురిపై తన ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్)
చదవండి: (కత్రినాపై రణ్‌బీర్‌కు ఎంత ప్రేమో!’)