తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షిచౌదరి. ఇటీవల ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో విజయ్‌ఆంటోనీకి జంటగా 'కొలై' చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటుడు ఆర్జే బాలాజి సరసన నటించిన 'సెలూన్' చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్‌కు జంటగా 'గోట్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో మీనాక్షిచౌదరికి పెద్దగా నటించే అవకాశం లేకపోయినా భారీ చిత్రం కావడంతో మంచి గుర్తింపు లభించింది.
ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా, ఒక బిడ్డకు అమ్మగా ఆమె నటించి షాకిచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని కూడా అందుకుంది. దీంతో ఆమె కూడా బాగా సంతోషించింది. అయితే, ఈ సినిమాలో భార్యగా, తల్లిగా నటించడం రుచించలేదట. దీంతో ఇకపై భార్య, అమ్మ పాత్రల్లో నటించరాదని నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు తనకు ప్రశంసలు లభించినా కొందరు స్నేహితులు తనను భయపెడుతున్నారని చెప్పారు.
కెరీర్ ప్రారంభ దశలోనే ఇలా భార్యగా, తల్లికి బిడ్డగా నటించకపోవడం చాలా మంచిదనే అభిప్రాయాన్ని తన స్నేహితులు సలహా ఇచ్చినట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు ఇంకా చాలా కాలం ఉందని సూచించినట్లు పేర్కొన్నారు. అలా కాకుంటే త్వరలోనే అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారని గట్టిగానే భయపెట్టారని తెలిపింది. దీంతో ఇకపై తాను హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రలను అంగీకరించరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాక్షన్‌తో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాట్లు మీనాక్షిచౌదరి చెప్పారు.
లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఒక భార్యగా మాత్రమే కాకుండా తల్లిగా నటించడంలో తనదైన మార్క్ చూపింది. ఈ సినిమా తన కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా ఉండనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్లకు పైగానే రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment