సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్ ‘ఒరే తలైవర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి.
రజనీకాంత్ గౌరవం తగ్గించి ఒరే తలైవర్ అంటూ పోస్ట్ చేయడాన్ని తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్’ (సూపర్‌స్టార్ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ఇక ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్ (వేట్టయాన్), ధనుశ్ (రాయన్), విక్రమ్ (వీర ధీర శూరన్ 2) వంటి స్టార్ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment