
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఆయన కుమారుడు రిషీ మనోజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో తన కుమారుడికి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పజెప్పారు. ఇప్పటికే రిషీ ట్రైన్ అయి ఉన్నాడు. అయితే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడు.

జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. విజయ్- గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' సినిమాకు అసిస్టెంట్‌గా త్రివిక్రమ్ కుమారుడు పనిచేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషీ వెళ్లనున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుడిని అసిస్టెంట్‌గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు..? అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషీ అసిస్టెంట్‌గా పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషీ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

మరో రెండేళ్లలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అకీరా, రిషీ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌తో పరిచయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్-త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కనుందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment