
మలయాళంలో హీరో మోహన్‌లాల్(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కాంబినేషన్‌లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్. ఈ మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. ‘దృశ్యం’ సినిమాకు ఇంతటి క్రేజ్ ఉంది. కాగా కొన్ని రోజులుగా ‘దృశ్యం 3’ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ మాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది.
ఫైనల్‌గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్‌లాల్. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్‌లాల్ పేర్కొన్న పోస్ట్‌లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు.
త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. మరోవైపు అనూప్ మీనన్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు మోహన్‌లాల్. ఆయన సోలో హీరోగా అనూప్ మీనన్ మూవీని పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ల కాంబినేషన్‌లో ఓ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మోహన్‌లాల్ సోలో హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment