Drishyam 3 Movie
-
గతం నిశ్శబ్దంగా ఉండదు!
మలయాళంలో హీరో మోహన్‌లాల్(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్. ఈ మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. ‘దృశ్యం’ సినిమాకు ఇంతటి క్రేజ్ ఉంది. కాగా కొన్ని రోజులుగా ‘దృశ్యం 3’ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ మాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది.ఫైనల్‌గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్‌లాల్. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్‌లాల్ పేర్కొన్న పోస్ట్‌లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు.త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. మరోవైపు అనూప్ మీనన్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు మోహన్‌లాల్. ఆయన సోలో హీరోగా అనూప్ మీనన్ మూవీని పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ల కాంబినేషన్లో ఓ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మోహన్‌లాల్ సోలో హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ..
-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవుతున్న వెంకటేష్
-
బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అవుతున్న వెంకటేష్
-
'దృశ్యం 3' ఆ రెండు భాషల్లో ఒకేసారి.. నిజమెంత?
ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్) -
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
ఓ కంక్లూజన్‌తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022