Drishyam 3 Movie Update: Director Jeethu Joseph Comments - Sakshi
Sakshi News home page

Drishyam 3 Movie: 'దృశ్యం 3' అప్డేట్.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Wed, Jun 14 2023 4:02 PM | Last Updated on Wed, Jun 14 2023 4:37 PM

Drishyam 3 Movie Update Director Jeethu Joseph Comments - Sakshi

ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ‍్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్‌ పెళ్లి.. పోస్ట్‌ వైరల్‌)

తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స‍్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట‍్లు ఓ వార్త బయటకొచ్చింది. 

ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. 

(ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement