
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్‌కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.
దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.
దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్‌తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్‌ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment