
శోభితా ధూళిపాళ్ల
‘‘కొన్ని సినిమాల చిత్రీకరణ పూర్తవగానే ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో జ్ఞాపకాల్ని సంపాదించుకున్నాం అనే అనుభూతి మిగులుతుంది. ‘కురుప్’ చిత్రం ఓ మంచి జ్ఞాపకం’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కురుప్’. శోభితకి ఇది రెండో మలయాళ చిత్రం. కేరళ ప్రాంతంలో నివసించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ – ‘‘కురుప్’ నా తొలి పూర్తి స్థాయి మలయాళ (గతంలో ‘మూతాన్’లో గెస్ట్ రోల్ చేశారు) చిత్రం. ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. దానికి కారణం ఈ ప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్‌గా, క్రియేటివ్‌గా నాలో వచ్చిన మార్పు. నా పర్సనల్ క్యారెక్టర్‌ని ప్రభావితం చేసిన ప్రయాణమిది. ఇది మర్చిపోలేని ప్రయాణం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment