'కింగ్‌ ఆఫ్‌ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు | 'King Of Kotha' New OTT Release Date | Sakshi
Sakshi News home page

King of Kotha: 'కింగ్‌ ఆఫ్‌ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు

Published Thu, Sep 21 2023 3:34 PM | Last Updated on Thu, Sep 21 2023 3:44 PM

King of Kotha OTT New Release Date - Sakshi

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి కాబట్టే ఆయన సినిమాలపై తెలుగు వారు కూడా ఆ వైపు ఓ కన్నేస్తుంటారు.  పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్‌ ఆఫ్‌ కొత్త (కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్థం) సినిమా విడుదలైంది.

ఇదీ చదవండి నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌

ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌లో సెప్టెంబర్‌ 22 విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి.  కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌లో రేపు సెప్టెంబర్‌ 22 విడుదల కావడం లేదు.  అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న ప్రకారం  సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్‌ నటించిన ఈ మూవీ ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదులో యాక్షన్‌ సీన్స్‌ అందరినీ కట్టిపడేస్తాయి. గ్యాంగస్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింగా. గురు సినిమా ఫేమ్ రితికా సింగ్‌ ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement