Rithika Singh
-
ఆయనకు ఎన్నటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను: రితికా సింగ్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం వస్తే చాలని కోరుకునే వారెందరో. అలాంటి లక్కీఛాన్స్‌ను నటి రితికా సింగ్ పొందారు. జైలర్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టైయాన్. జైభీమ్ చిత్రం ఫమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రాణా దగ్గుపాటి, నటి మంజువారియర్, రితికాసింగ్, తుషారా విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పుటికే దక్షిణ తమిళనాడులోని నెల్లై, కుమరి ప్రాంతాల్లో కొంత భాగాన్ని జరుపుకుని, ఆ తరువాత ఆంధ్రాలోని కడపలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి అవుతుందని సమాచారం. కాగా వేట్టైయాన్ చిత్రంలో నటి రితికాసింగ్ ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి ఆమె పేర్కొంటూ ‘ఈ చిత్రంలో లె జెండ్రీ తలైవర్ రజనీకాంత్ ఆశీస్సులు నిజంగానే నాకు అందాయి. ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఈ అవకాశం కోసం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను.’ అని నటి రితికాసింగ్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీనితో పాటు తను రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ అవుతోంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మొన్న ఐటం సాంగ్.. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్
హీరోయిన్ రితికా సింగ్‌ను లక్కీ ఛాన్స్ వరించింది. రియల్ బాక్సర్ అయిన ఈ ఉత్తరాది చిన్నది ఇరుదుచుట్రు చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అదే చిత్రం తెలుగు రీమేక్ 'గురు'లోనూ రితికాసింగ్ హీరోయిన్గా నటించింది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టలై, రాఘవా లారెన్స్ సరసన శివలింగా, అశోక్ సెల్వన్‌తో ఓ మై కడవులే తదితర సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. కాగా ఈ మధ్య అవకాశాలు ముఖం చాటేయడంతో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికీ వెనుకాడలేదు. ఇకపోతే ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వర్కౌట్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. మొత్తం మీద తాజాగా మరో భారీ అవకాశాన్ని పొందింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఙానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, తెలుగు నటుడు రానా, నటి దుషారా విజయన్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన నటి రితికాసింగ్ చేరారు. ఇది ఈమెకు నిజంగా లక్కీఛాన్స్నే అవుతుంది. View this post on Instagram A post shared by Shruthi Ravichandran | Pro Makeup Artist (@makeupwithshruthi) చదవండి: ప్రియుడితో జబర్దస్త్ పవిత్ర నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్‌కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు! తర్వాతే నటిగా పరిచయం. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొన్ని మాటలు. ► మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ► ఒకరోజు ఆమెను చూసిన దర్శకురాలు సుధా కొంగర తన దర్శకత్వంలోని ‘ఇరుది సుట్రు’లో అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘గురు’, హిందీలో ‘సాలా ఖడూస్’గా రీమేక్ చేశారు. ► తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా బాక్సర్ పాత్రను పోషించింది. ఆమె నటనకు మూడు భాషల్లోనూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు వరించాయి. ► తర్వాత రాఘవ లారెన్స్ ‘శివలింగ’, ‘నీవెవరో’, ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్’ సినిమాల్లో నటించింది. ► ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ వెబ్ సిరీస్‌తో వెబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ► మళ్లీ చాలారోజుల తర్వాత ‘కింగ్ ఆఫ్ కొత్త’తో వెండితెర మీదా మెరిసింది. ఒకప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలి! – రితికా సింగ్ View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) చదవండి: విక్రమ్- ప్రశాంత్ విభేదాలు ఈనాటివి కావు.. వారిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి? -
'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి కాబట్టే ఆయన సినిమాలపై తెలుగు వారు కూడా ఆ వైపు ఓ కన్నేస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్ ఆఫ్ కొత్త (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం) సినిమా విడుదలైంది. ఇదీ చదవండి నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 22 విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో రేపు సెప్టెంబర్ 22 విడుదల కావడం లేదు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న ప్రకారం సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన ఈ మూవీ ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదులో యాక్షన్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింగా. గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. -
చిరిగిన జీన్స్‌లో ఐటం బ్యూటీ, పెంపుడు కుక్క బర్త్‌డేకు పార్టీ ఇచ్చిన ఊర్వశి
► చిరిగిన జీన్స్‌లో ఐటం బ్యూటీ ► డ్యాన్స్‌తో ఇరగదీసిన శ్వేతానాయుడు ► సిడ్నీ నగరాన్ని చుట్టేస్తోన్న అరియానా గ్లోరీ ► ఆమ్స్టర్డామ్ యాత్రలో యాంకర్ నేహా చౌదరి ► కుక్కకు నెక్లెస్ వేసి బర్త్‌డే పార్టీ చేసిన ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. రియల్ బాక్సర్ అయిన రితికా.. గురు మూవీతో హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి.. తొలి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ సినిమా చేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఇన్ కార్ అనే మూవీలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రితికాకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆమెపై తమిళ మీడియా ప్రతినిధులు ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చెప్పిన టైం కంటే ఆలస్యంగా వచ్చినందువల్లే రితికాపై మీడియా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రిసెంట్‌గా చెన్నైలో ఇన్ కార్ ప్రమోషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి రితికా మూడు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆమె కార్యక్రమానికి రాగానే మీడియా ప్రతినిథులు రితికాపై గుర్రుమన్నారు. చెప్పిన టైం కంటే మూడు గంటలు లేటు వచ్చారని, ఇలా వేయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో రితికా మీడియాను క్షమాపణలు కోరారు. చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నేను కావాలని చేయలేదు. మిస్ కమ్యునికేషన్ వల్ల ఆలస్యమైంది. ప్రొగ్రామ్ టైం రాత్రి 9 గంటలకు అని నాకు మెసేజ్ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్ కూడా చూపిస్తా. నేను చెప్పిన టైంకే వచ్చాను. అయినప్పటికీ నన్ను క్షమించండి’ అని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఈ ప్రొగ్రామ్ సాయంత్రం 6, 7 గంటల మధ్యలో జరగాల్సి ఉండగా మిస్ కమ్యుకేషన్ వల్ల ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా రితికా తమిళంలో చివరగా ఓ మై కడువలే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పిచ్చకారై 2(బిచ్చగాడు 2), వనంగ ముడి, కొలై వంటి చిత్రాలు ఉన్నాయి. -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్‌లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
సోషల్ హల్చల్: పూల్‌లో నిఖిత, ఆడుకుంటున్న రితికా
► అడవులను కాపాడేందుకు కలిసి పని చేద్దామంటున్న దియా మీర్జా ► భుజాన బ్యాగుతో ఎక్కడికో బయల్దేరినట్లు పోజిచ్చిన నిధి అగర్వాల్ ► పారిపోతున్నట్లు పోజిస్తూ కొంటెగా లుక్కిచ్చిన దీపికా పదుకొణె ► బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీనిధి శెట్టి ► అరేబియా సముద్ర తీరాన పూల్‌లో ఈత కొడుతున్న నికిత శర్మ ► ప్రకృతికి దగ్గరగా వెళ్లండి అని పిలుపునిస్తోన్న మల్లికా షెరావత్ ► నన్ను ఒంటరిగా వదిలేస్తే ఇంతే సంగతులు అంటూ సెల్ఫీ దిగిన పరిణీతి చోప్రా ► ఉంగరాల జుట్టుతో ఆడుకుంటున్న రితికా సింగ్ ► మండేకి రెడీగా లేనంటున్న అదితి రావు హైదరీ View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
సోషల్ హల్చల్: వీళ్లు సూపర్ క్యూట్, వాళ్లు పిచ్చ హాట్
► లాంగ్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తోన్న 'సాఫ్ట్వేర్ డెవలపర్' నటి వైష్ణవ చైతన్య ► క్యాప్షన్ ఎర్రర్ అంటూ ఫొటోతో బుర్ర బద్దలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ► చూపులతో చంపేస్తోన్న కీర్తి సురేశ్ ► నీలి రంగు డ్రెస్సులోన చందమామ నీవే జాన.. అనిపిస్తోన్న తమన్నా భాటియా ► క్షణక్షణం సినిమా షూటింగ్ ఫొటో పంచుకున్న జియా శర్మ ► నల్ల కోటు వేసుకున్న తెల్ల పాప హన్సిక ► లెహంగాలో అందాలను దాచేస్తున్న శ్రద్దా కపూర్ ► బ్లూ డ్రెస్‌లో సూపర్ హిట్‌గా కనిపిస్తోన్న రితికా సింగ్ ► సోఫాలోనే కాదు కుర్రకారు గుండెల్లోనూ వాలిపోయిన అను ఇమ్మాన్యుయేల్ ► కళ్లజోడు పెట్టుకున్న సన్నీలియోన్ ► సఫారీ టైమ్‌లో సేద తీరుతున్న మాళవిక మోహనన్ ► లాలీపాప్ తింటున్న పాపతో నివేతా థామస్ View this post on Instagram A post shared by 𝑽𝒂𝒊𝒔𝒉𝒏𝒂𝒗𝒊 𝑪𝒉𝒂𝒊𝒕𝒂𝒏𝒚𝒂 ❤️ (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by 🎀Jia Sharma🎀 (@jia_sharma) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
‘గంటలోపే మిలియన్ వ్యూస్’
ప్రేమ, పెళ్లి, విడాకులు అంశాలను చర్చించే విభిన్న కథా చిత్రంగా ఓ మై కడవులే చిత్రం ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు చెప్పారు. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన తన యాక్సెస్ ఫిలిం ఫ్యాకర్టీ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే. అశోక్ సెల్వన్, అభినయ సెల్వన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్ సీజన్ 3 నుంచి వచ్చారన్నది గమనార్హం. ఇంతకు ముందు కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు. ఓ మై కడవులే చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించగా, అశోక్‌సెల్వన్, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో నటి వాణీబోజన్ నటించింది. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమవుతోంది. దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఓ మై కడవులే చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర దర్శక, నిర్మాతలు శనివారం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ రాక్షసన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత తమ సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే అని తెలిపారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ నచ్చడంతో ఒకే ఒక్క గంటలోనే ఓకే చేశానని చెప్పారు. ప్రేమ, వినోదం వంటి యూనిక్ కథతో రూపొందించిన చిత్రం ఇదని తెలిపారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు విజయ్‌సేతుపతి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పారు. తాను మంచి కంటెంట్ లేకపోతే చిత్రాలను చేయనన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య చేతుల మీదగా శుక్రవారం విడుదల చేశామని, ఒక్క గంటలోనే మిలియన్ ప్రేక్షకులు ట్రైలర్‌ను వీక్షించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథపై 2013లోనే తనకు ఐడియా వచ్చిందన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారని, అలాంటిది ఎన్నో పెళ్లిళ్లు విడాకులకు ఎందుకు దారి తీస్తున్నాయన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఓ మై కడవులే అని చెప్పారు. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి రియల్‌లైఫ్, రీల్ లైప్ హీరో అవసరం అయ్యారని, నటుడు విజయ్‌సేతుపతిని ఆ పాత్రకు సంప్రదించగా, కథ విన్న ఆయన ఈ పాత్రనే తానే చేయాలని అన్నారని చెప్పారు. ఇవాళ సినిమాల్లో ఎక్స్ట్రార్డనరీ ఎలిమెంట్స్ ఉంటేనే గానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. ఈ చిత్రాన్ని అందరూ రిలేట్ చేసుకుంటారని చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ తన రియల్ పాత్రనే పోషిస్తున్నారని చెప్పారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను శక్తిఫిలిం ఫ్యాక్టరీ శక్తివేల్ పొందారని, ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. -
పంచ్ పడుద్ది
ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగానూ కొనసాగుతున్నారు అరుణ్ విజయ్. గతేడాది ‘తడం’ అనే తమిళ థ్రిల్లర్ చిత్రంతో సూపర్ హిట్ సాధించిన ఆయన తాజాగా ‘బాక్సర్’ అనే సినిమా అంగీకరించారు. ఇందులో బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు అరుణ్ విజయ్. ఈ పాత్ర కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారట. ఆల్రెడీ వియత్నాంలో ట్రైనింగ్ కూడా మొదలెట్టారు. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రితికా సింగ్ హీరోయిన్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘సాహో’ సినిమాలో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
‘నీవెవరో’ మూవీ రివ్యూ
టైటిల్ : నీవెవరో జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : అచ్చు రాజమణి, ప్రసన్ దర్శకత్వం : హరినాథ్ నిర్మాత : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్ సరైనోడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నీవెవరో. తమిళ సినిమా అదే కంగల్ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా కనిపించనున్నాడు. చాలా కాలంగా టాలీవుడ్లో సోలో హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఆది, ఈ సినిమాతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాలీవుడ్లో నటిగా ప్రూవ్ చేసుకున్న తాప్సీ నీవెవరో సినిమాతో సక్సెస్ మీద కన్నేశారు. మరి ఆది, తాప్సీల కలను నీవెవరో నెరవేర్చిందా..? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? కథ ; పదిహేనేళ్ల వయసులో కళ్లు పొగొట్టుకున్న కల్యాణ్ (ఆది పినిశెట్టి) తన వైకల్యాన్ని జయించి ఓ పాపులర్ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు. అంతేకాదు ఆ రెస్టారెంట్లో తానే మాస్టర్ చెఫ్ కూడా. తనకు రెస్టారెంట్ లో కలిసి వెన్నెల (తాప్సీ) అనే అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు కల్యాణ్. తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో ఆమె ఓ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెన్నెల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పటంతో కల్యాణ్ తను దాచుకున్న డబ్బును వెన్నెలకు ఇచ్చేదామని నిర్ణయించుకుంటాడు. కానీ అదే రాత్రి యాక్సిడెంట్ అయి కల్యాణ్ మూడు వారాల పాటు హాస్పిటల్లో ఉండిపోవాల్సి వస్తుంది. (సాక్షి రివ్యూస్) అదే సమయంలో కల్యాణ్‌కు చూపు కూడా వస్తుంది. హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన కల్యాణ్, వెన్నెల ఎక్కడుందో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ కనిపెట్టలేకపోతాడు. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయటంతో తన బెస్ట్ ఫ్రెండ్ అను (రితికా సింగ్)ను పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకుంటాడు. అనుతో ఎంగేజ్మెంట్కు సిద్ధమైన కల్యాణ్‌కు వెన్నెలను కొంత మంది కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఆమె కాపాడేందుకు వెళ్లిన కల్యాణ్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? అసలు వెన్నెల ఏమైంది..? కల్యాణ్, వెన్నెలను కలుసుకున్నాడా. లేదా.? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి సోలో హీరోగా మరింత బాధ్యతగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాకు తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్తో మరింత హైప్ తీసుకువచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో అంధుడిగా ఆకట్టుకున్న ఆది, సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. నటిగా బాలీవుడ్ లో మంచి మార్కులు సాధించిన తాప్సీ టాలీవుడ్‌లోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. గురు ఫేం రితికా సింగ్‌కు మంచి పాత్ర దక్కింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో రితికా పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ మరోసారి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోకు సహాయం చేసే కానిస్టేబుల్ పాత్రలో అక్కడక్కడ కామెడీ పండించినా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్, దీక్షిత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; తమిళ సినిమాను దాదాపుగా అదే కథా కథనాలతో టాలీవుడ్లో రీమేక్ చేశాడు దర్శకుడు హరినాథ్. అయితే టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి, ఆది ఇమేజ్‌కు తగ్గట్టుగా కాస్త హీరోయిజం, యాక్షన్ యాడ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో దర్శకుడు తడబడ్డాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సి వేగం ఎక్కడా కనిపించదు. కథనం కూడా ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగా సాదాసీదాగా సాగటం నిరాశ కలిగిస్తుంది. ప్రసన్, అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన వెన్నెలా.. పాట విజువల్‌గా కూడా సూపర్బ్. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన కథ మైనస్ పాయింట్స్ ; థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్‌గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్‌లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హోమ్‌వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్‌బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్‌గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్‌తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్‌ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్‌కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది
‘‘వైజాగ్ వాతావరణం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా నేటివ్ ప్లేస్‌కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ‘నీవెవరో’ సినిమా వంద శాతం సక్సెస్ అవుతుంది’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘కోన వెంకట్‌గారు చెబితేనే ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. ఈ సినిమా ఆయన వల్లే స్టార్ట్ అయ్యింది. మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌తో 2003లో విడుదలైన ‘వెంకీ’ చిత్రం రైటర్‌గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుంచి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. 50 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాను. ఎంత గొప్ప కథ రాసినా ఆ కథను తెరపై పండించేది నటీనటులే. ‘నీవెవరో’ సినిమాకు ఆది ప్రాణం పోశారు. తన కెరీర్లో ఇదో మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ. సప్తగిరి, వైజాగ్ మేయర్ మళ్ల విజయ ప్రసాద్, వైజాగ్ సత్యానంద్ పాల్గొన్నారు. -
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
ఇంట్రస్టింగ్‌గా ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు (ఆదివారం) చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘నీవెవరో’ ఫస్ట్‌లుక్
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
మళ్లీ గీతాంజలి
దాదాపు నాలుగేళ్ల క్రితం అంజలి ముఖ్య తారగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి బ్యానర్‌పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ ప్రేక్షకులను మెప్పించింది. కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన ఫిలిమ్ కార్పొరేషన్ పతాకం (కేఎఫ్‌సీ)పై వచ్చిన ‘అభినేత్రి, నిన్నుకోరి’ చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా కేఎఫ్‌సీ సంస్థ ముందుకు వెళ్తోంది. ఎం.వి.వి, కేఎఫ్‌సీ సంస్థల కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘నీవెవరో’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మళ్లీ ఈ రెండు నిర్మాణ సంస్థల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ‘గీతాంజలి 2’. కథానాయిక అంజలి ముఖ్య తారగా నటించనున్నారు. నటుడు ప్రభుదేవా ఈ సినిమా టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో మొదలుకానున్న ఈ సినిమాకు భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘థ్రిల్లర్ కామెడీ జానర్లో ఈ సినిమా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు కోన వెంకట్. -
హలో గురు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన ఈ ముంబై బ్యూటీ రీల్ లైఫ్‌లోనూ బాక్సర్‌గా అలరించారు. లారెన్స్ హీరోగా వచ్చిన ‘శివలింగా’ చిత్రంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న రితికా తాజాగా ఓ తమిళ చిత్రంతో పాటు తెలుగు సినిమా చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా హరినా«ద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నీవెవరో’ చిత్రంలో రితికా ఓ కథానాయిక. తాజాగా ఆమె సాయిధరమ్ తేజ్ సరసన నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌ని ఓ హీరోయిన్గా ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఆ అవకాశం రితికా సింగ్‌కి దక్కినట్లు భోగట్టా. ఆ పాత్రకు రితికా అయితే సరిగ్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట మరి.. ఈ ముంబై బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
నీవెవరో?
‘రంగస్థలం’ మంచి సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో ఆది పినిశెట్టి. అదే స్పీడ్‌తో తన నెక్ట్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా ‘లవర్స్’ ఫేమ్ హరినా«ద్ దర్శకుడిగా కోనా వెంకట్ సమర్పణలో ఎమ్వీవీ సత్యనారాయణ ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను గురువారం ట్వీటర్లో అనౌన్స్ చేశారు హీరో నానీ. ‘‘నీవెవరో’ నా నెక్ట్స్ మూవీ. అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి’’ అన్నారు హీరో ఆది పినిశెట్టి. ఈ సినిమాకు కెమెరా:సాయి శ్రీరామ్. -
నాని చేతుల మీదుగా ‘నీవెవరో’..!
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా ఆకట్టుకోనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ టైటిల్ లోగోనూ యంగ్ హీరో నాని రివీల్ చేశాడు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్ననీ సినిమాకు నీవెవరో అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్, లోగో చూస్తుంటే ఈ సినిమా కూడా నిన్నుకోరి తరహాలోనే ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా తెరకెక్కనుందనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ఆది సోలో హీరోగానూ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. #Neevevaroo it is 😊 Happy to be launching the title of our dearest Arun @AadhiOfficial next and wishing you all the very best @konavenkat99 gaaru @taapsee @ritika_offl 👍👍👍 pic.twitter.com/yRmcq5JSqW — Nani (@NameisNani) 24 May 2018 -
నువ్వా.. నేనా!
ఓ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలు నటించినప్పుడు ‘నువ్వా.. నేనా?’ అని పోటీ పడి నటిస్తారు. అలా గట్టి పోటీ ఇచ్చే పాత్రలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. పాతిక సినిమాలకు పైగా నటించిన తాప్సీ, పట్టుమని పది సినిమాలు కూడా చేయని రితికా సింగ్ ఓ సినిమాకి పచ్చ జెండా ఊపారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఏమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కూడా నటించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సై అంటారు ఆది. ఈ చిత్రంలో ‘అంధుడి’గా నటించడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 27న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
'గురు' మూవీ రివ్యూ
టైటిల్ : గురు జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తారాగణం : వెంకటేష్, రితికా సింగ్, నాజర్, జకీర్ హుస్సేన్ సంగీతం : సంతోష్ నారాయణ దర్శకత్వం : సుధ కొంగర నిర్మాత : వై నాట్ స్టూడియోస్ తమిళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్ది సుత్రు, సాలాఖద్దూస్ సినిమాలకు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన సినిమా గురు. ఒరిజినల్ వర్షన్‌ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల తరువాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుంది..? కథ : ఆదిత్య రావు ( వెంకటేష్) దేశం కోసం మెడల్ సాధించాలన్న కసి ఉన్న బాక్సర్. 1996లో వరల్డ్ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది, సెలక్షన్ కమిటీ రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ సెలెక్టర్ దేవ్ ఖత్రీ (జకీర్ హుస్సేన్) కావాలనే ఆదిని గేమ్‌కు దూరం చేస్తాడు. దీంతో చాలా కాలం పాటు బాక్సింగ్ రింగ్‌కు దూరంగా ఉండిపోయిన ఆదిని కొంత కాలం తరువాత ఉమెన్స్ బాక్సింగ్ కోచ్‌గా నియమిస్తారు. అయితే అక్కడ కూడా స్టూడెంట్స్‌తో కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న సాకుతో ఢిల్లీ నుంచి వైజాగ్‌కు ట్రాన్స్ఫర్ చేస్తారు. వైజాగ్ చేరుకున్న ఆది, మార్కెట్లో కూరగాయలు అమ్మే రామేశ్వరి అలియాస్ రాముడు (రితికా సింగ్) గొడవ పడటం చూసి ఆమెను బాక్సర్‌గా తయారు చేయాలనుకుంటాడు. ఆమె అక్క లక్స్ అలియాస్ లక్ష్మీ (ముంతాజ్ సర్కార్) అప్పటికే స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సాధించాలన్న ఆశతో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ ఇద్దరినీ తనతో పాటు తీసుకెళ్లిన ఆది, రాముడిపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపించటం లక్స్కి నచ్చదు. ఎలాగైన రాముడ్ని తిప్పి పంపేయాలన్న ఆలోచనతో కీలక మ్యాచ్‌కు ముందు రాముడి చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. రాముడు కావాలనే ఇలా చేసిందన్న కోపంతో ఆది ఆమెను పంపేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన రాముడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. బాక్సింగ్ ట్రైనింగ్ ఎలా కొనసాగించింది. ఆది అనుకున్నట్టుగా రాముడు ఉమెన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ సాధించిందా..? లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే చేసే విక్టరీ వెంకటేష్, తొలిసారిగా ఓ కొత్త మేకవర్, కొత్త బాడీలాంగ్వేజ్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన వెంకీ, బాక్సింగ్ కోచ్‌గా మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్తో అలరించాడు. సినిమా అంతా సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషన్స్‌ను పండించాడు. ఒరిజినల్ వర్షన్లో తనదైన నటనతో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న రితికా సింగ్ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకునే నటన కనబరిచింది. బాధ్యత లేని అల్లరి అమ్మాయిగా, మెడల్ సాధించడానికి ఎంత కష్టాన్నైనా బరించే సీన్సియర్ ప్లేయర్‌గా మంచి వేరియేషన్స్ చూపించింది. విలన్ పాత్రలో జకీర్ హుస్సెన్ ఆకట్టుకోగా, నాజర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రఘుబాబు, అనితాచౌదరి, ముంతాజ్ సర్కార్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సౌత్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాల వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. గతంలో ఒకటి రెండు సినిమాలు వచ్చిన ఓ స్టార్ హీరో ఈ తరహా సినిమా చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి ఓ సీరియస్ స్పోర్ట్స్ సినిమాకు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోను ఎంచుకున్న దర్శకురాలు సుధ కొంగర మంచి విజయం సాధించింది. వెంకీ పర్ఫామెన్స్తో పాటు ఎక్కడా అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా ఒకే ఎమోషన్‌ను క్యారీ చేస్తూ కథ నడిపించారు. సంతోష్ నారాయణ అందించిన నేపథ్యం సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. హర్షవర్థన్ అందించిన మాటలు, కె ఎ శక్తివేల్ సినిమాటోగ్రఫి, సతీస్ సూర్య ఎడిటింగ్, వై నాట్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : వెంకటేష్, రితికా సింగ్ నటన సంగీతం క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సెకండ హాఫ్ లో కొన్ని సీన్స్ గురు.. ఆలోచింప చేసే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్