ఆయనకు ఎన్నటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను: రితికా సింగ్‌ | Ritika Singh Comments On Rajinikanth | Sakshi
Sakshi News home page

ఆయనకు ఎన్నటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను: రితికా సింగ్‌

Published Fri, Mar 15 2024 11:38 AM | Last Updated on Fri, Mar 15 2024 11:53 AM

Ritika Singh Comments On Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం వస్తే చాలని కోరుకునే వారెందరో. అలాంటి లక్కీఛాన్స్‌ను నటి రితికా సింగ్‌ పొందారు. జైలర్‌ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం వేట్టైయాన్‌. జైభీమ్‌ చిత్రం ఫమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఫాహత్‌ ఫాజిల్‌, రాణా దగ్గుపాటి, నటి మంజువారియర్‌, రితికాసింగ్‌, తుషారా విజయన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పుటికే దక్షిణ తమిళనాడులోని నెల్‌లై, కుమరి ప్రాంతాల్లో కొంత భాగాన్ని జరుపుకుని, ఆ తరువాత ఆంధ్రాలోని కడపలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న జైలర్‌ చిత్ర షూటింగ్‌ ఈ నెలాఖరుకు పూర్తి అవుతుందని సమాచారం. కాగా వేట్టైయాన్‌ చిత్రంలో నటి రితికాసింగ్‌ ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నారు.

ఇందులో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి ఆమె పేర్కొంటూ ‘ఈ చిత్రంలో లె జెండ్రీ తలైవర్‌ రజనీకాంత్‌ ఆశీస్సులు నిజంగానే నాకు అందాయి. ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఈ అవకాశం కోసం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను.’ అని నటి రితికాసింగ్‌ తన ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. దీనితో పాటు తను రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈమె చేసిన ఈ పోస్ట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర ల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement