
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment