Neevevaro
-
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
‘నీవెవరో’ థాంక్స్ మీట్
-
‘నీవెవరో’ మూవీ రివ్యూ
టైటిల్ : నీవెవరో జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : అచ్చు రాజమణి, ప్రసన్ దర్శకత్వం : హరినాథ్ నిర్మాత : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్ సరైనోడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నీవెవరో. తమిళ సినిమా అదే కంగల్ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా కనిపించనున్నాడు. చాలా కాలంగా టాలీవుడ్లో సోలో హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఆది, ఈ సినిమాతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాలీవుడ్లో నటిగా ప్రూవ్ చేసుకున్న తాప్సీ నీవెవరో సినిమాతో సక్సెస్ మీద కన్నేశారు. మరి ఆది, తాప్సీల కలను నీవెవరో నెరవేర్చిందా..? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.? కథ ; పదిహేనేళ్ల వయసులో కళ్లు పొగొట్టుకున్న కల్యాణ్ (ఆది పినిశెట్టి) తన వైకల్యాన్ని జయించి ఓ పాపులర్ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు. అంతేకాదు ఆ రెస్టారెంట్లో తానే మాస్టర్ చెఫ్ కూడా. తనకు రెస్టారెంట్ లో కలిసి వెన్నెల (తాప్సీ) అనే అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు కల్యాణ్. తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో ఆమె ఓ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెన్నెల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పటంతో కల్యాణ్ తను దాచుకున్న డబ్బును వెన్నెలకు ఇచ్చేదామని నిర్ణయించుకుంటాడు. కానీ అదే రాత్రి యాక్సిడెంట్ అయి కల్యాణ్ మూడు వారాల పాటు హాస్పిటల్లో ఉండిపోవాల్సి వస్తుంది. (సాక్షి రివ్యూస్) అదే సమయంలో కల్యాణ్‌కు చూపు కూడా వస్తుంది. హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన కల్యాణ్, వెన్నెల ఎక్కడుందో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ కనిపెట్టలేకపోతాడు. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయటంతో తన బెస్ట్ ఫ్రెండ్ అను (రితికా సింగ్)ను పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకుంటాడు. అనుతో ఎంగేజ్మెంట్కు సిద్ధమైన కల్యాణ్‌కు వెన్నెలను కొంత మంది కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఆమె కాపాడేందుకు వెళ్లిన కల్యాణ్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? అసలు వెన్నెల ఏమైంది..? కల్యాణ్, వెన్నెలను కలుసుకున్నాడా. లేదా.? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి సోలో హీరోగా మరింత బాధ్యతగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాకు తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్తో మరింత హైప్ తీసుకువచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో అంధుడిగా ఆకట్టుకున్న ఆది, సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. నటిగా బాలీవుడ్ లో మంచి మార్కులు సాధించిన తాప్సీ టాలీవుడ్‌లోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. గురు ఫేం రితికా సింగ్‌కు మంచి పాత్ర దక్కింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో రితికా పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ మరోసారి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోకు సహాయం చేసే కానిస్టేబుల్ పాత్రలో అక్కడక్కడ కామెడీ పండించినా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్, దీక్షిత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; తమిళ సినిమాను దాదాపుగా అదే కథా కథనాలతో టాలీవుడ్లో రీమేక్ చేశాడు దర్శకుడు హరినాథ్. అయితే టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి, ఆది ఇమేజ్‌కు తగ్గట్టుగా కాస్త హీరోయిజం, యాక్షన్ యాడ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో దర్శకుడు తడబడ్డాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సి వేగం ఎక్కడా కనిపించదు. కథనం కూడా ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగా సాదాసీదాగా సాగటం నిరాశ కలిగిస్తుంది. ప్రసన్, అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన వెన్నెలా.. పాట విజువల్‌గా కూడా సూపర్బ్. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన కథ మైనస్ పాయింట్స్ ; థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది
‘‘ఒక క్యారెక్టర్ని నేను కంప్లీట్‌గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్ చేసుకోను. మంచి పెర్ఫార్మర్ అని ఆడియన్స్ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్ గోల్’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు... ► ఇందులో కల్యాణ్ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయా? ‘లవ్ ఈజ్ బ్లైండ్.. నాట్ ది లవర్’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్‌లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్గళ్’ తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం. ► బ్లైండ్ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హోమ్‌వర్క్ చేశాను. బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్ రియాక్షన్స్, ఎమోషన్స్ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే కన్విన్స్ చేయగలగడం కష్టం. రిఫరెన్స్ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను. ► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్గా, ‘రంగస్థలం’లో కుమార్‌బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్ అయినా కూడా మంచి క్యారెక్టర్ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్‌గా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయితే మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్ తర్వాత విలన్ క్యారెక్టర్స్ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ► ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్ ఉంటాయి. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ► నా యాక్టింగ్ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్ చేశావ్? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్) డైరెక్షన్లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్100’ రీమేక్ చేయబోతున్నాం. డైరెక్టర్ని, హీరోయిన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అలాగే బైక్ రేసింగ్ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్ నిర్మిస్తారు. -
తాప్సీ లేకుంటే ఈ సినిమా లేదు
‘‘నీవెవరో’ సినిమాకు 24 క్రాఫ్ట్స్ వారు 100 శాతం డెడికేషన్‌తో పనిచేశారు. మా చిత్రం ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాప్సీ ఓకే చెప్పకపోతే ఈ చిత్రం చేసేవాణ్ణి కాదు. తన సినిమాల చాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. 20ఏళ్ల నీ ప్రయాణంలో ఏం సంపాదించుకున్నావని ఎవరైనా అడిగితే ఓ బాబీని, హరీష్ శంకర్‌ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నా.. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఇదే నా ఆస్తి. నా బలం, నా అండ ఎంవీవీగారు. దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్‌కి ‘నీవెవరో’ తొలి షో వేశాం. బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఆది, తాప్సీ, రితికా పోటీ పడి నటించారు. ‘సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి’ చిత్రాల కన్నా ‘నీవెవరో’ చిత్రంలో ఆది ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఆది మాట్లాడుతూ– ‘‘నీవెవరో’ సినిమా చూసిన తర్వాత తొలుత తాప్సీ, తర్వాత తులసిగారి గురించే మాట్లాడతారు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తాప్సీ, రితికా సింగ్ డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. 2006లో ‘ఒక విచిత్రం’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చా. ఆ తర్వాత తమిళ్లోకి వెళ్లా. అది అనుకుని వెళ్లలేదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాని ఆమెకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హరినాథ్. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించండి’’ అన్నారు రితికా. ‘‘మా సినిమా బావుందో, లేదో శుక్రవారం ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు తాప్సీ. -
‘నీవెవరో’ ప్రెస్‌మీట్
-
కుమార్ బాబు కోసం చిట్టిబాబు
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా నీవెవరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా కామెడీ ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది
‘‘వైజాగ్ వాతావరణం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా నేటివ్ ప్లేస్‌కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ‘నీవెవరో’ సినిమా వంద శాతం సక్సెస్ అవుతుంది’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘కోన వెంకట్‌గారు చెబితేనే ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. ఈ సినిమా ఆయన వల్లే స్టార్ట్ అయ్యింది. మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌తో 2003లో విడుదలైన ‘వెంకీ’ చిత్రం రైటర్‌గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుంచి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. 50 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాను. ఎంత గొప్ప కథ రాసినా ఆ కథను తెరపై పండించేది నటీనటులే. ‘నీవెవరో’ సినిమాకు ఆది ప్రాణం పోశారు. తన కెరీర్లో ఇదో మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ. సప్తగిరి, వైజాగ్ మేయర్ మళ్ల విజయ ప్రసాద్, వైజాగ్ సత్యానంద్ పాల్గొన్నారు. -
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
‘నీవెవరో’ ఆడియో రిలీజ్
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ‘సరైనోడు’లో విలన్ పాత్రలో, ‘రంగస్థలం’లో హీరో అన్న పాత్రలో నటించి మెప్పించాడు . అలాంటి ఆది అంధుడి పాత్రను పోషిస్తున్నాడంటే అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆది అంధుడి పాత్రను పోషిస్తూ.. హీరోగా చేసిన సినిమా ‘నీవెవరో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రయాంగిల్ లప్స్టోరీని కూడా సింపుల్‌గా చూపారు. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలానే ఎడిట్ చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో తాప్సీ, ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆది సినిమాకు మాధవన్ సపోర్ట్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఆగస్టు 24న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని ఓ చెలియా అనే పాటను ప్రముఖ నటుడు మాధవన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. -
ఇంట్రస్టింగ్‌గా ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు (ఆదివారం) చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. -
ఇప్పుడు రితిక
అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్గా అదితీ రావ్ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రితికాసింగ్. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్. వెంకటేశ్ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ‘నీవెవరో’ ఫస్ట్‌లుక్
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా అలరించనున్నాడు. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న నీవెవరో సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.