నివేదా థామస్, నాని, శివా నిర్వాణ, హరినాథ్, ఆది పినిశెట్టి, రితిక, కోన వెంకట్
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.
అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు.
‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్‌పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది.
ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్‌ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర.
Comments
Please login to add a commentAdd a comment