ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ‘సరైనోడు’లో విలన్ పాత్రలో, ‘రంగస్థలం’లో హీరో అన్న పాత్రలో నటించి మెప్పించాడు . అలాంటి ఆది అంధుడి పాత్రను పోషిస్తున్నాడంటే అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఆది అంధుడి పాత్రను పోషిస్తూ.. హీరోగా చేసిన సినిమా ‘నీవెవరో’.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రయాంగిల్ లప్‌స్టోరీని కూడా సింపుల్‌గా చూపారు. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలానే ఎడిట్ చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో తాప్సీ, ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment