ritika Singh
-
ప్రొఫెషనల్ బాక్సర్.. అనుకోకుండా స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దని చెప్పారు : హీరోయిన్ రితికా సింగ్
తనను తాను రక్షించుకోవాడానికే బాక్సింగ్, కరాటే నేర్చుకున్నానని చెబుతోంది హీరోయిన్ రితికా సింగ్. ‘గురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాక్సింగ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు,తమిళ, మలయాళ సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘వేట్టయాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రితికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఎందుకు కరాటే, బాక్సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పింది. ‘మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వాటిని తట్టుకొని నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలు బయటకు వెళ్తే దురదృష్టవశాత్తు ఏమైనా జరగొచ్చు. నన్ను నేను రక్షించుకోవడానికే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే..కొంతమంది వద్దని చెప్పారు. ‘నీ కరాటే వీడియోలు చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వాటిని షేర్ చేయకండి’ అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం షేర్ చేయడం ఆపలేదు. కరాటే వీడియోలే కాదు.. శారీ ఫోటో షూట్, డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను. ఒక నటిగా నేను ఏం చేయగలనో అన్ని చేశాను. అయినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాటని పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారనని నా ట్రైనింగ్ మానుకోలేదు. ఇప్పటికే కరాటే, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది నాకు ఇష్టమైన పని. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? నేను బయటకు వెళ్లినప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రక్షిస్తారు? నన్ను నేను రక్షించుకోవడానికే మార్షల్ ఆర్ట్స్‌లో బేసిక్స్ నేర్చుకున్నాను. అలా అని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగితే ధైర్యంగా మన గళాన్ని వినిపించాలి. మన వాయిసే ఒక ఆయుధం కావాలి’ అని రితికా చెప్పుకొచ్చింది. -
Ritika Singh: కుర్రకారుకు దడ పుట్టిస్తున్న రితికా సింగ్
-
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్‌లా కూల్ లుక్‌తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
తెలుగులో సినిమా ఛాన్సులు రావట్లేదా? హీరోయిన్ ఆన్సరిదే!
'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ రితికా సింగ్. స్వతాహాగా కిక్ బాక్సర్ అయిన ఆమె ఈ చిత్రంలో కూడా బాక్సింగ్ చేస్తూ కనిపించింది. తర్వాత నీవెవరో అనే సినిమా చేసింది కానీ అంతగా క్లిక్ అవలేదు. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం సినిమాలు చేసింది. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త మూవీలో ఐటం సాంగ్ కూడా చేసింది. ఆఫర్స్ రావడం లేదా? ప్రస్తుతం రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వేటయ్య అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే వళరి అనే హారర్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో రితికాకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. 'టాలీవుడ్లో పరభాషా నటీమణులే ఎక్కువగా ఉన్నారు. మీరు మాత్రం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. మీకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదా?' అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. మనసుకు నచ్చితేనే.. ఇందుకు రితికా స్పందిస్తూ.. 'నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సినిమా చేస్తాను. లేదంటే ఎట్టిపరిస్థితుల్లో చేయను. మలయాళం, మరాఠి, హిందీ.. ఏ భాష అయినా సరే కథ, పాత్ర నచ్చితేనే చేశాను. కాంబినేషన్ కరెక్ట్‌గా కుదిరితేనే సినిమా ఒప్పుకుంటాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: అదే రాళ్లపల్లి వీక్నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే! -
మల్లెపూలతో రొమాంటిక్‌గా శ్రీముఖి.. 'యానిమల్' బ్యూటీ తృప్తి ఏకంగా అలా!
మల్లెపూలతో నా సామి రంగ అనిపిస్తున్న శ్రీముఖి చీరలో వయ్యారాలు పోతున్న హీరోయిన్ రష్మిక బ్లర్ ఫొటోలే కానీ తృప్తి దెబ్బకు జిగేలుమంటున్నాయ్ అందాల గేట్లు ఎత్తేసిన 'హాయ్ నాన్న' మృణాల్ ఠాకుర్ మత్తెక్కించే సోయగాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రితికా సింగ్ మెడలో నెక్లెస్‌తో హీరోయిన్ రకుల్ ప్రీత్ క్యూట్ పోజులు చుడీదార్‌తో చూడచక్కగా కనిపిస్తున్న యాంకర్ వర్షిణి చీరలో సంప్రదాయబద్ధంగా తమిళ యంగ్ హీరోయిన్ భవానిశ్రీ కురచ దుస్తులతో టాప్ లేపేస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
తలైవా సినిమా షూటింగ్లో హీరోయిన్‌కు గాయాలు!
గురు సినిమాతో తెలుగువారికి దగ్గరైంది రితికా సింగ్. సౌత్‌లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసినా తనకు పెద్ద క్రేజ్ అయితే రాలేదు. దీంతో ఐటం సాంగ్ చేయడానికి కూడా వెనుకాడల్లేదు. కింగ్ ఆఫ్ కొత్త మూవీలో ఐటం సాంగ్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో రితికా సింగ్ గాయపడినట్లు తెలుస్తోంది. చేతులపై అక్కడక్కడా గీసుకుపోయి రక్తం వస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటికే అందరూ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా తను గాయాలపాలైనట్లు వెల్లడించింది. అక్కడ ఉన్న ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్, ఇట్స్ ఓకే.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు క్షణాల్లో జరిగిపోయేవాటిని మనం ఆపలేము. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది అని వీడియో రిలీజ్ చేసింది. ఈ గాయం వల్ల షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలిపింది. దీన్నుంచి కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో పాల్గొంటానని పేర్కొంది. కాగా రితికా కిక్ బాక్సర్ అన్న విషయం తెలిసిందే! ఇరుది చుట్రు అనే సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఈ మూవీ హిందీలో సాలా ఖాదూస్గా డబ్ అయింది. తెలుగులో గురుగా రీమేక్ అయింది. ఇటీవల ఆమె ఇన్ కార్, కోలై సినిమాల్లో నటించింది. An unfortunate incident took place on the set of #Thalaivar170 during the shooting of a high-octane fight scene, resulting in an injury to Ritika Singh. Sending our thoughts and support to her for a quick and complete healing! 🤕🌟 #Thalaivar171 #RitikaSingh pic.twitter.com/dcPiJF15s6 — ShadowWit (@wit_shadow) December 4, 2023 చదవండి: ఓ వ్యక్తి చేసినదానికి ఇండస్ట్రీని తిట్టొద్దు.. సంతోషం అవార్డుల వివాదంపై నిర్మాత సీరియస్ -
శ్రీలీల నడుము సోయగాలు.. రితికని ఇలా చూస్తే మాత్రం!
బ్లాక్ డ్రస్ లో మెరిసిపోతున్న శ్రుతిహాసన్ నడుము అందాలతో టెంప్ట్ చేస్తున్న శ్రీలీల ట్రాన్స్ఫరెంట్ ఔట్ఫిట్లో పూనమ్ బజ్వా క్యూట్‌నెస్ బీచ్ ఒడ్డున అందాల విందు చేస్తున్న మౌనీరాయ్ జిమ్‌లో టైట్ డ్రస్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధాదాస్ గోల్డ్ కలర్ చీరలో ధగధగా మెరిసిపోతున్న హన్సిక కళ్లు చెదిరిపోయే అందాలు రితికా సూపర్ అంతే! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ తెలుగు హీరోయినే.. గుర్తుపట్టారా మరి?
హీరోయిన్ అనగానే వయ్యారం, సుకుమారం, అందం, నాజుకుతనం.. ఇలా చాలా చెబుతారు. కానీ హీరోయిన్లకు సిక్స్ ప్యాక్ దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. సమంత లాంటి వాళ్లు జిమ్‌కి వెళ్తుంటారు. ఫిట్నెస్తో కేక పుట్టిస్తుంటారు తప్ప బాడీ ప్యాక్ లాంటిది తక్కువ. కానీ ఓ తెలుగు హీరోయిన్ సిక్స్ ప్యాక్‌తో కనిపించి షాకిచ్చింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రితికా సింగ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. విక్టరీ వెంకటేశ్ 'గురు' సినిమా చేశాడు. అందులో లేడీ బాక్సర్‌గా నటించింది ఈ అమ్మాయే. నటి కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రొఫెషనల్ బాక్సర్‌గా పేరు తెచ్చుకుంది. 20 మ్యాచులాడితే 17 గెలిచింది కూడా. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) అయితే డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా 'సాలా ఖాదుస్' అనే బాక్సింగ్ స్టోరీ కోసం హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు రితికా కనిపించింది. లేటు చేయకుండానే రియల్ బాక్సర్ అయిన ఆమెతోనే సినిమా తీసేసింది. ఇక ఇది హిట్ అయి, అవార్డులొచ్చేసరికి బాక్సర్ రితిక కాస్త హీరోయిన్ రితిక అయిపోయింది. 'సాలా ఖాదుస్' మూవీని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేస్తే ఇందులోనూ రితిక లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత తెలుగులో 'నీవెవరో' అనే మూవీ చేసింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే తమిళంలోనే రితిక.. పలు హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్, ఓ సినిమాలో ఐటమ్ సాంగ్, మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. అలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముంబయి బ్యూటీ.. తాజాగా సిక్స్ ప్యాక్‌తో కనిపించేసరికి అందరూ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మొన్న ఐటం సాంగ్.. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్
హీరోయిన్ రితికా సింగ్‌ను లక్కీ ఛాన్స్ వరించింది. రియల్ బాక్సర్ అయిన ఈ ఉత్తరాది చిన్నది ఇరుదుచుట్రు చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అదే చిత్రం తెలుగు రీమేక్ 'గురు'లోనూ రితికాసింగ్ హీరోయిన్గా నటించింది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టలై, రాఘవా లారెన్స్ సరసన శివలింగా, అశోక్ సెల్వన్‌తో ఓ మై కడవులే తదితర సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. కాగా ఈ మధ్య అవకాశాలు ముఖం చాటేయడంతో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికీ వెనుకాడలేదు. ఇకపోతే ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వర్కౌట్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. మొత్తం మీద తాజాగా మరో భారీ అవకాశాన్ని పొందింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఙానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, తెలుగు నటుడు రానా, నటి దుషారా విజయన్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన నటి రితికాసింగ్ చేరారు. ఇది ఈమెకు నిజంగా లక్కీఛాన్స్నే అవుతుంది. View this post on Instagram A post shared by Shruthi Ravichandran | Pro Makeup Artist (@makeupwithshruthi) చదవండి: ప్రియుడితో జబర్దస్త్ పవిత్ర నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. -
ఆ వార్తలు చదువుతుంటే రక్తం మరుగుతోంది: హీరోయిన్
తమిళ సినిమా: మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి చదువుతుంటే ఒంట్లో రక్తం మరుగుతోందని నటి రిత్విక సింగ్ పేర్కొంది. రియల్ బాక్సర్ అయిన ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళం భాషల్లో రూపొందిన ఇరుది చుట్రు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అదే చిత్రం రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అదేవిధంగా తమిళంలో ఆండవన్ కట్టలై, శివలింగ, ఓమై కడవలే, కొలై తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్రంగా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది. ‘స్త్రీలు, యువతులు, బాలికలను వేధింపులకు గురి చేయడం, అత్యాచారాలకు పాల్పడడం, హత్యలు చేయడం వంటి వార్తలు చదువుతుంటే రక్తం మరుగుతోందని పేర్కొంది. ప్రతి రెండు గంటలకు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే భయం వేస్తోందని తెలిపింది. ఇలాంటివి చాలా మంది ఎదుర్కొంటున్నాని చెప్పింది. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంది. వ్యాయామం, ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పుగా ప్రవర్తించే వారికి మీరు కొడతారనే భయం కలగాలని.. పిల్లలు చురుగ్గా ఉండడానికి తల్లిదండ్రులు వారికి ఆత్మరక్షణ విద్య నేరి్పంచాలని సూచించారు. మహిళలను ఆట వస్తువులా చూడరాదని మగ మృగాలకు తెలియజేయాలని నటి రిత్విక సింగ్ పేర్కొంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
ఇవన్నీ చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: కింగ్ ఆఫ్ కోత హీరోయిన్
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు. ఆ తర్వాతే ఆమె నటిగా పరిచయమైంది. సుధా కొంగర తన దర్శకత్వంలోని ఇరుది సుట్రులో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో గురు, హిందీలో సాలా ఖడూస్‌గా రీమేక్ చేశారు. దీంతో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాల్లో నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్‌తో వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ చాలారోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ జతగా కింగ్ ఆఫ్ కొత్త అంటూ వెండితెరపై సందడి చేసింది. (ఇది చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రితికా సింగ్.. మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళల కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలాసార్లు ప్రస్తావించింది. అదే తరహాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయని ఆరోపించింది. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయంటూ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. ఇలాంటి మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలని రితికా సింగ్ రాసుకొచ్చారు. ఇలాంటి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ.. వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందేనని సూచించారు. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు! తర్వాతే నటిగా పరిచయం. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొన్ని మాటలు. ► మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ► ఒకరోజు ఆమెను చూసిన దర్శకురాలు సుధా కొంగర తన దర్శకత్వంలోని ‘ఇరుది సుట్రు’లో అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘గురు’, హిందీలో ‘సాలా ఖడూస్’గా రీమేక్ చేశారు. ► తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా బాక్సర్ పాత్రను పోషించింది. ఆమె నటనకు మూడు భాషల్లోనూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు వరించాయి. ► తర్వాత రాఘవ లారెన్స్ ‘శివలింగ’, ‘నీవెవరో’, ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్’ సినిమాల్లో నటించింది. ► ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ వెబ్ సిరీస్‌తో వెబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ► మళ్లీ చాలారోజుల తర్వాత ‘కింగ్ ఆఫ్ కొత్త’తో వెండితెర మీదా మెరిసింది. ఒకప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలి! – రితికా సింగ్ View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) చదవండి: విక్రమ్- ప్రశాంత్ విభేదాలు ఈనాటివి కావు.. వారిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి? -
మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గురు మూవీతో టాలీవుడ్లో సినీరంగ ప్రవేశం చేసిన భామ.. తొలి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ అనే సినిమా చేశారు. ఇటీవలే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!) రితికా జిమ్‌లో సాధన చేసిన తర్వాత ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ మరీ ఇంత బోల్డ్‌గా ఉన్న ఫోటోలు షేర్ చేయడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే దారుణంగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇటీవలే ఆమె మరీ లావుగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసమే తాను బరువు తగ్గి మళ్లీ స్లిమ్ అయ్యానంటూ రితికా పిక్స్ షేర్ చేశారు. అంతే కాకుండా బొద్దుగా ఉన్న శరీరానికి వీడ్కోలు పలుకుతున్నట్లు రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా.. రితికా సింగ్ తమిళ చిత్రం 'ఇరుధి సూత్ర'తో ఫేమస్ అయింది. 'ఆండవన్ కోమండి', 'శివలింగ', 'ఓ మై గాడ్' 'కోలా', బిచ్చగాడు-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా రితికా మార్షల్ ఆర్టిస్ట్ కూడా. అయితే నెటిజన్స్ మాత్రం హాట్ ఫోటో షూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
నిషా కళ్లతో రితిక.. కేతిక అందాల విందు!
హీరోయిన్ రితికా సింగ్ నిషా పోజులు బొడ్డు చూపిస్తూ రెచ్చగొడుతున్న భూమి బ్లాక్ ఔట్ ఫిట్‌లో రెచ్చిపోయేలా తాప్సీ రెడ్ కలర్ పొట్టి డ్రస్‌లో ప్రగ్యా పరువాల విందు కేతిక శర్మ ఎద అందాల ప్రదర్శన 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ సోయగాలు నవ్వుతో మెరుపులు మాయ చేస్తున్న దివ్యభారతి మెగా డాటర్ నిహారిక క్యూట్ ర్యాండమ్ స్టిల్స్ పింక్ చీరలో ఆలియా భట్ హోయగాలు నీలగిరి కొండల్లో నందితా శ్వేతా పోజులు కేజీఎఫ్ నటి జోష్ ఆర్చీ సూపర్ డ్యాన్స్ చీరలో హీరోయిన్ హనీరోజ్ వయ్యారాలు నోరు తడారిపోయేలా నోరా ఫతేహా పోజులు View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం'
‘‘హత్య’ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలు గుర్తొస్తాయి. గిరీష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ‘హత్య’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు విజయ్ ఆంటోని. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, రితికా సింగ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హత్య’. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేశ్ ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరై, ‘హత్య’ హిట్టవ్వాలన్నారు. ‘‘1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాను’’ అన్నారు బాలాజీ కుమార్. -
హత్య చేసిందెవరు?
విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్‌పై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ .బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మించిన ‘హత్య’ ఈ నెల 21న రిలీజవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ ΄ాత్ర చేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన సరికొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. రియల్ బాక్సర్ అయిన రితికా.. గురు మూవీతో హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి.. తొలి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ సినిమా చేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఇన్ కార్ అనే మూవీలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రితికాకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆమెపై తమిళ మీడియా ప్రతినిధులు ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చెప్పిన టైం కంటే ఆలస్యంగా వచ్చినందువల్లే రితికాపై మీడియా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రిసెంట్‌గా చెన్నైలో ఇన్ కార్ ప్రమోషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి రితికా మూడు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆమె కార్యక్రమానికి రాగానే మీడియా ప్రతినిథులు రితికాపై గుర్రుమన్నారు. చెప్పిన టైం కంటే మూడు గంటలు లేటు వచ్చారని, ఇలా వేయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో రితికా మీడియాను క్షమాపణలు కోరారు. చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నేను కావాలని చేయలేదు. మిస్ కమ్యునికేషన్ వల్ల ఆలస్యమైంది. ప్రొగ్రామ్ టైం రాత్రి 9 గంటలకు అని నాకు మెసేజ్ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్ కూడా చూపిస్తా. నేను చెప్పిన టైంకే వచ్చాను. అయినప్పటికీ నన్ను క్షమించండి’ అని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఈ ప్రొగ్రామ్ సాయంత్రం 6, 7 గంటల మధ్యలో జరగాల్సి ఉండగా మిస్ కమ్యుకేషన్ వల్ల ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా రితికా తమిళంలో చివరగా ఓ మై కడువలే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పిచ్చకారై 2(బిచ్చగాడు 2), వనంగ ముడి, కొలై వంటి చిత్రాలు ఉన్నాయి. -
ఆ పాత్రలో నటించడం సవాలే: రితికా సింగ్
రియల్ బాక్సర్ రితికా సింగ్ ఇరుది చుట్రు చిత్రం ద్వారా కథానాయకిగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఆ చిత్రం జాతీయ ఉత్తమ నటి అవార్డులు తెచ్చిపెట్టింది. కాగా అదే చిత్రంతో తెలుగులోనూ పరిచయమైన రితికా సింగ్ తమిళ్లో శివలింగ, ఓ మై కడవులే తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాజాగా ఇన్ కార్ అనే పాన్ ఇండియా చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రను పోషించింది. ఇన్ బాక్స్ పిక్చర్స్ పతాకంపై అంజుమ్ ఖురేషి, సాజిత్ ఖీరేషీ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 3వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం మొదలగు ఐదు భాషల్లో సిద్దమైన ఈ చిత్రాన్ని తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థ ద్వారా కేఈ జ్ఞానవేల్ రాజా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. తన బంధువుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం ఇన్ కార్ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత తాను కొన్ని రోజులపాటు ఆ పాత్ర నుంచి బయటపడలేక పోయానని చెప్పారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని నటి రితికా సింగ్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రితిక సింగ్ బ్యూటీఫుల్ ఫొటోలు
-
క్రైమ్ థ్రిల్లర్
రితికా సింగ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఇన్ కార్’. హర్ష వర్ధన్ దర్శకత్వంలో అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. రితికా సింగ్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీలోని నా పాత్ర కోసం షూటింగ్ పూర్తయ్యే వరకు నేను తల స్నానం చేయలేదు’’ అన్నారు. ‘‘సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’’ అన్నారు హర్ష వర్ధన్. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ. -
నాపై దారుణమైన ట్రోల్స్ చేశారు: స్టార్ హీరోయిన్
నటీనటులకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్లపై దారుణమైన ట్రోల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. అలాగే తాజాగా తనకు అలాంటి అనుభవాలు ఎదురైనట్లు నటి వెల్లడించింది. ఆమె పేరే రితిక సింగ్. తెలుగు పెద్దగా పరిచయం లేని పేరు. 2017 సంవత్సరంలో వెంకటేశ్ సరసన గురు సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోల్స్ తనను ఎంతో బాధించాయని తెలిపింది. వాటితో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయింది నటి. ముంబయిలో జన్మించిన రితిక సింగ్ క్రీడాకారిణి కూడా. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 2009లో భారత్ తరపున ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2012 లో ఇరుదు చుట్రు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ 2016లో మాధవన్‌తో సాల కడూస్ సినిమాకు మంచి పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. నా ఫోటోలు దారుణంగా ఎడిట్ చేశారు రితిక సింగ్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటితో నా గుండె పగిలినంత పనైంది. నాకు కుటుంబం ఉంది. ఇవి చూస్తే వాళ్లు చాలా బాధపడతారు. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. స్కూల్స్‌లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ క్లాసులు నిర్వహించాలి. నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తర్వాత జనరేషన్ పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహన కల్పించాలి.' అంటూ తన బాధను వెల్లడించింది. -
ఇన్ కార్: కాలేజీ యువతిని కిడ్నాప్ చేసి..
‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఇన్ కార్’. హర్షవర్థన్ దర్శకత్వం వహించారు. ఇన్ బాక్స్ పిక్చర్స్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆయా భాషల ట్రైలర్స్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కాలేజీకి వెళ్లే ఓ అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయాలనుకుంటారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆమెను వారు తీవ్రంగా గాయపరుస్తారు. ఆ తర్వాత ఆమె పోరాటం చేసి, వారి నుంచి ఎలా తప్పించుకుంది? అనేది చిత్రకథ’’ అని యూనిట్ పేర్కొంది. సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ. -
ఫాన్స్ మతి పోగొడుతున్న రితికా సింగ్ లేటెస్ట్ స్టన్నింగ్ (ఫొటోలు)
-
నీళ్లలో పడిపోయిన హీరోయిన్, చిట్కా చెప్పిన తమన్నా
♦ అలిసిపోయా, కానీ మీకోసం నవ్వేస్తున్నానంటోన్న అనుపమ పరమేశ్వరన్ ♦ బ్యాలెన్స్ అంటే ఇదీ అంటోన్న కీర్తి సురేశ్ ♦ ఎవరైనా నా దగ్గరికొస్తే ఆరా భరించదంటోన్న రష్మిక మందన్నా ♦ హ్యాపీ బర్త్‌డే బంగారూ అంటూ వీడియోలు షేర్ చేసిన నిహారిక కొణిదెల ♦ ఇన్‌స్టాగ్రామ్‌లో 39 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఊర్వశి రౌతేలా ♦ చిట్కాలు చెప్తోన్న తమన్నా ♦ నీళ్లలో పడిపోయిన రితికా సింగ్ View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
అలాంటి చిత్రాలు ఇష్టమే కానీ..
సినిమా: యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం ఇష్టమే కానీ అంటోంది నటి రితికాసింగ్. రియల్ బాక్సర్ అయిన ఈ ఉత్తరాది బ్యూటీ రీల్ హీరోయిన్గా మారి ఇరుదు చుట్రు చిత్రంతో దక్షిణాదికి పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు రితికాసింగ్‌కు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇరుదుచుట్రు తెలుగు రీమేక్ గురు చిత్రంలోనూ ఈ అమ్మడే నటించింది. ఆ తరువాత లారెన్స్‌తో శివలింగ, విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో ఆ తరువాత కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి ఓ మై కడవులే. అశోక్‌సెల్వన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి రితికాసింగ్‌ను ఇటీవల సాక్షి పలకరించింది ఓ మై కడవులే చిత్రంలో నటించిన అనుభవం గురించి చెప్పమనగా దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. వెంటనే నటించడానికి అంగీకరించాను, నటుడు అశోక్‌సెల్వన్ చిత్ర యూనిట్ ఎంతగానో సహకరించారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆయన చాలా స్వీట్ పర్సన్, ఇది చాలా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం. కోలీవుడ్‌లో కనిపించి చాలా కాలమైంది. ఈ గ్యాప్‌నకు కారణం ఏమిటన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే అన్నీ అంగీకరించడం లేదని చెప్పింది. మంచి కథ అనిపిస్తేనే నటించడానికి ఒప్పుకుంటున్నానని చెప్పింది. తనకు కథ నచ్చాలని చెప్పింది. ఇరుదుచుట్రు లాంటి యాక్షన్ కథా చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పట్లో అలాంటి చిత్రాలు చేయనని అంది. ప్రస్తుతానికి ప్రేమ కథా చిత్రాల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. మళ్లీ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు తాను బాక్సింగ్ ప్రాక్టీస్‌ను చేస్తూనే ఉన్నానని, అయితే ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు రితికాసింగ్ చెప్పింది. ఈ అమ్మడు ఇప్పుడు చాలా గ్లామరస్‌గా మారిపోయింది. గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అరుణ్ విజయ్‌తో బాక్సర్ చిత్రంలో నటిస్తోంది. -
‘నా ఏంజిల్, రక్షకురాలు తనే’
దేశ వ్యాప్తంగా ప్రజలు నిన్న సంతోషంగా రక్షా బంధన్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు తమ అన్నదమ్ములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలతో పాటు ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో హీరో రణ్వీర్ సింగ్ షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నా బెస్ట్‌ఫ్రెండ్, నా రక్షకురాలు, నా ఏంజిల్’ అంటూ సోదరితో కలిసి చిన్నతనంలో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రణ్వీర్ సింగ్. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలల్లో లైక్‌లు, కామెంట్లు అందుకుంది. ఇకపోతే రక్షా బంధన్ సందర్భంగా హీరోయిన్ అలియా భట్.. కరణ్‌జోహర్ కుమారుడు యష్‌కు రాఖీ కట్టారు. ఈ ఫోటోలు కూడా అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణ్వీర్ సింగ్ 83తో బిజీగా ఉండగా.. అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’తో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Just too much love.. ❤️ A post shared by Alia 🌸 (@aliaabhatt) on Aug 15, 2019 at 7:45am PDT -
రూటు మార్చిన రితికాసింగ్
తమిళసినిమా: నటి రితికాసింగ్ రూటు మార్చేసింది. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లో బాక్సర్. అయితే ఆ క్రీడారంగంలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలిసిన రితికాసింగ్‌ను మరింత మందికి పరిచయం చేసింది ఇరుదుచుట్రు చిత్రం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే బాక్సర్ కంటే ముందే యాక్టర్స్ అయ్యింది. అవును ఈ ముంబయి భామ 2002లోనే బాలనటిగా టార్జాన్ భేటీ అనే చిత్రంతో నటించింది. కథానాయకిగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ఇరుదుచుట్రు చిత్రంతో కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అదే చిత్రంతో బాలీవుడ్‌కు, ఆ తరువాత రీమేక్ చిత్రం గురుతో తెలుగుకు ఎంట్రీ ఇచ్చేసింది. ఆ చిత్రంలో చాలా సహజంగా చక్కని నటనను ప్రదర్శించిన ఈ బ్యూటీపై దక్షిణాది దృష్టి పడింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. వాటితోనూ కుటుంబ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు పొందింది. అయితే అదే రితికాసింగ్‌కు మైనస్ అయ్యిందేమో. అవకాశాలు కొరవడ్డాయి. దీంతో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌కు మారక తప్పలేదు. మడి కట్టుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోరనుకుందో ఏమో. ఇటీవల అందాలను ఆరబోసే విధంగా ఫొటోసెషన్ చేయించుకున్న రితిక వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ ప్రయత్నం ఫలించినట్లుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక అవకాశం తలుపు తట్టింది. నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించనుంది. పాత్ర నచ్చితే హీరో, విలన్ అని చూడకుండా నటించడానికి రెడీ అంటున్న అరుణ్‌విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తడం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా అగ్నిసిరగుగళ్ చిత్రంలోనూ,తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న అరుణ్ విజయ్ తాజాగా బాక్సర్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రితికాసింగ్ ఆయనకు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఇతి వృత్తంతో తెర కెక్కుతోందట. ఈ చిత్రంతోనైనా రితిక హీరోయిన్గా బిజీ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడు నటించిన వడంగాముడి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
బాక్సరమ్మా ఏమిటీ వాలకం!
సినిమా: బాక్సరమ్మా ఏమిటీ వాలకమమ్మా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతగా విమర్శంచడానికి ఆమె ఏం చేసిందనేగా మీ ప్రశ్న. ఆ కథేంటో చూద్దాం రండి. రియల్ బాక్సర్ అయిన రితికాసింగ్ ఇరుదిచుట్రు చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అందులో నిజ జీవిత వృత్తి అయిన బాక్సర్‌గానే నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు అదే చిత్ర తెలుగు రీమేక్‌లోనూ నటించి అక్కడ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తరువాత కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లోనూ నటించే అవకాశాలను అందుకుంది. ఆ చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. అయినా రితికకు ఎందుకనే పెద్దగా క్రేజ్ రాలేదు. అలా 2017 తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అసలు అవకాశాలు కూడా లేవు. దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్న రితికాసింగ్‌కు ఇటీవలే వణంగాముడి అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదీ నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించే పాత్ర. కాగా ఇప్పటి వరకూ తన నటించిన చిత్రాల్లో దాదాపు గ్లామర్‌కు దూరంగా నటించి మెప్పించింది. అయితే అదే తనకు మైనస్ అనుకుందో ఏమోగానీ, ఆ ఇమేజ్ను పోగొట్టడానికన్నట్టుగా చిన్న చిన్న పీసులను ఒంటికి చుట్టుకున్నట్లు దిగిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. చాలా గ్లామరస్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా బాక్సరమ్మా ఈ దుస్తులేమిటి? ఈ వాలకం ఏమిటి? అంటూ నెటిజన్ల విమర్శల దాడి చేస్తున్నారు. అయితే రితికాసింగ్ కోరుకుంది ఇదేనేమో..ఈ అమ్మడు ఏం స్పందించలేదు. -
రితికాసింగ్‌కు ఓ అవకాశం
రితికాసింగ్‌కు ఓ అవకాశం వచ్చింది. ఇరుదుచుట్రు చిత్రంతో అనూహ్యంగా కోలీవుడ్‌లో హీరోయిన్ అవతారమెత్తిన రియల్ బాక్సింగ్ బ్యూటీ రితికాసింగ్. ఈ చిత్రం సక్సెస్‌తో కోలీవుడ్ దృష్టి ఈ అమ్మడిపై పడింది. అంతే వరుసగా అవకాశాలు చుట్టుముట్టాయి. అలా లారెన్స్‌తో శివలింగ చిత్రం చేసింది. అదీ ఓకే అనిపించుకుంది. ఆ తరువాత నటించిన ఆడవన్ కట్టలై చిత్రం హిట్ అయ్యింది. అంతే రితికాసింగ్‌కు అవకాశాలు ముఖం చాటేశాయి. మధ్యలో తెలుగులోకి గురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రం ఇరుదుచుట్టుకు రీమేక్ అయిన ఆ చిత్రం హిట్ అయినా, అక్కడ మరో అవకాశం రాలేదు. అలాంటిది కాస్త ఆలస్యంగా కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని దక్కించుకుంది. నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తడం చిత్రాన్ని పూర్తి చేసిన అరుణ్ విజయ్ ప్రస్తుతం విజయ్ఆంటోనీతో కలిసి అగ్నిసిరగుగళ్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి చిత్రానికీ రెడీ అవుతున్నారు. దీనికి బాక్సర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు బాలా శిష్యుడు వివేక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాక్సర్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం అరుణ్‌విజయ్ మలేషియా, వియత్నాం దేశాలలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారట. అంతేకాదు స్టంట్‌మాస్టర్ పీటర్ హెయిన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారట. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి రితికాసింగ్ క్రీడా వార్తల విలేకరిగా నటించనుందని, చిత్ర షూటింగ్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దీనికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించనున్నారు. -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు. -
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
-
అసలు విషయం ఆగస్టు 24న చెబుతాను : ఆది
ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని నిరూపించుకున్నాడు. ‘సరైనోడు’లో విలన్ పాత్రలో, ‘రంగస్థలం’లో హీరో అన్న పాత్రలో నటించి మెప్పించాడు . అలాంటి ఆది అంధుడి పాత్రను పోషిస్తున్నాడంటే అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆది అంధుడి పాత్రను పోషిస్తూ.. హీరోగా చేసిన సినిమా ‘నీవెవరో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పాత్ర హైలెట్ కానుంది. అంధుడిగా తనకు ఎదురైన సవాళ్లను ఎలా అదిగమించాడు? అతనికి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా చెప్పకుండా ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రయాంగిల్ లప్స్టోరీని కూడా సింపుల్‌గా చూపారు. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి కలిగేలానే ఎడిట్ చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో తాప్సీ, ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇప్పుడు రితిక
అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్గా అదితీ రావ్ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్ ఈజ్ బ్లైండ్ నాట్ ది లవర్’ అనేది ట్యాగ్‌లైన్. రీసెంట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రితికాసింగ్. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్. వెంకటేశ్ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది. -
‘నీవెవరో’ రీమేకా..?
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ప్రధాన పాత్రల్లో నీవెవరో పేరుతో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది.. అంధుడిగా కనిపించనున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మళయాల సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. రొమాంటిక్ యాక్షన్థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ధృవీకరించలేదు. -
సుప్రీం హీరోతో రితికా?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదనే చెప్పాలి. చేసిన ప్రతీ సినిమా బెడిసికొడుతోంది. మాస్ జపం చేస్తూ... మూస ధోరణిలో సినిమాలు చేయడమే దానికి కారణం అని తెలిసినట్టుంది ఈ హీరోకి. అందుకే గేర్ మార్చి ప్రేమకథలపై పడినట్టు కనిపిస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్ డైరెక్షన్లో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమాను చేస్తున్నాడు. తదుపరి చిత్రంగా నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కిశోర్ గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. అందుకే సాయిధరమ్ సినిమాతో తిరిగి ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్‌ను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అనుపమా స్థానంలో గురు ఫేం రితికా సింగ్ పేరు వినిపిస్తోంది. ఫైనల్ గా ఎవరు సాయిధరమ్ తో జోడి కడతారో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
నాని చేతుల మీదుగా టైటిల్ అనౌన్స్మెంట్!
కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు చిత్రయూనిట్. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్ నటించనున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం. -
సుధీర్‌కు జోడిగా బాక్సింగ్ బ్యూటీ
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్, తొలి సినిమా సాలా ఖద్దూస్ తోనే ఆకట్టుకున్నారు. తరువాత అదే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నారు. గురు తరువాత ఎక్కువగా తమిళ చిత్రాలు మాత్రమే చేస్తు వచ్చిన రితికా డబ్బింగ్ సినిమాగా తెలుగు లో రిలీజ్ అయిన శివలింగాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఈ బాక్సింగ్ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించనుందట. యంగ్ హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమాకు రితికా ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
నేనెందుకు సిగ్గుపడాలి?
నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఎదురుప్రశ్న వేస్తోంది ఉత్తరాది భామ రితికాసింగ్. ఈ కుస్తీ రాణి నటిగా పరిచయమై తొలి చిత్రం ఇరుదుచుట్రు చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకున్న లక్కీ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నీ సక్సెసే. తాజాగా రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ కూడా విజయబాట పట్టడంతో యమ ఖుషీగా ఉన్న రితికాసింగ్‌తో చిట్‌చాట్. ప్ర: శివలింగ చిత్రంలో నటించిన అనుభవం? జ: పి.వాసు దర్శకత్వంలో రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన చిత్రం శివలింగ. మొదట కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక నాయకిగా నటించారు. ఆమె చాలా బాగా నటించారు. అదే పాత్రలో నటించే అవకాశం రావడం చాలా సంతోషం. నా నటనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభవం. శివలింగ చిత్రంలో వేరే రితికాసింగ్‌ను చూస్తారు. ప్ర: శివలింగ చిత్రంలో అందాలారబోశారట? జ: పాటల్లో గ్లామర్ అవసరం అవడంతో అలా నటించాల్సి వచ్చింది. అయితే చిత్రం చూసేవారికి గ్లామరస్ అనిపించదు. అయితే రాఘవ లారెన్స్‌తో కలిసి డాన్స్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా చీర ధరించి డాన్స్ చేయడానికి నేను పడ్డ అవస్థలు చెప్పనలవికాదు. చీరలో డాన్స్ చేసేటప్పుడు ఎన్ని సార్లు కింద పడ్డానో నాకే తెలియదు. అంతకు ముందు నేనెప్పుడూ చీర ధరించలేదు. అందులో కష్టమున్నా, అదో సరికొత్త అనుభవం అనే చెప్పాలి. ప్ర: బాక్సింగ్ కష్టమా, నటన కష్టమా? జ: నేను మూడేళ్ల వయసు నుంచే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. అందువల్ల నాకు బాక్సింగ్ కష్టం కాదు. సినిమాల్లో నటించడమే కష్టం. నటన, డాన్స్‌ను నేనింకా నేర్చుకోవాలి. ప్ర: మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పారా? జ: ఎందుకో తెలియదు గానీ చాలా మంది నా దగ్గరకు రావడానికే భయపడుతుంటారు. ఇక సినిమా రంగంలో నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి ఐ లవ్యూ చెబితే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పి పంపేస్తాను. ఇక నాకూ ప్రేమించడానికి టైమ్ లేదు. ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ఫుడ్? జ: విడియాప్పం, రసం, అప్పళం ఇష్టంగా తింటాను. కొంచెం నాన్ వెజ్ కూడా లాగించేస్తాను. ప్ర: మీకు సిగ్గు పడడం తెలుసా? జ: నిజంగా తెలియదు. అయినా నేనెందుకు సిగ్గుపడాలి. వివాహసమయంలో కల్యాణ వేదికపై కూడా నేను సిగ్గు పడను. ఒక వేళ సిగ్గు పడాలన్నా అది నాకు రాదని అంటోంది కుస్తీరాణి. -
కాంచనకు మించి...
‘కాంచన, గంగ’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించు కున్నారు లారెన్స్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘శివ లింగ’. రితికా సింగ్ కథానాయిక. పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్ళై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో రిలీజ్ చేస్తున్న మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా వాసుగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివలింగ’ ఘనవిజయం సాధించింది. దీంతో తమిళ్, తెలుగు భాషల్లో రమేష్ పిళ్ళై రీమేక్ చేశారు. హారర్ సినిమాల్లో మరో లెవెల్లో ఉండే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ఐదు పాటలూ బాగున్నాయి. లారెన్స్‌కు ‘కాంచన’ చిత్రానికి మించి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు రమేష్ పిళ్ళై. -
శివలింగలో రితికానే హీరో!
శివలింగ చిత్రంలో తన పాత్ర చంద్రముఖి చిత్రంలోని జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని నటి రితికాసింగ్ పేర్కొన్నారు. కన్నడంలో విజయం సాధించిన శివలింగ చిత్రం అదే పేరుతో తమిళంలో పునర్నిర్మాణం అయిన విషయం తెలిసిందే. కన్నడంలో దర్శకత్వం వహించిన పి.వాసు తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి రితికాసింగ్ నటించగా, ప్రధాన పాత్రల్లో శక్తివేల్‌వాసు, రాధారవి,వడివేలు, వీటీవీ.గణేశ్, జయప్రకాశ్, భానుప్రియ, ఊర్వశి, మధువంతి, సాయిప్రియ నటించారు. సురేశ్మురారి ఛాయాగ్రహణం, ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివలింగ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో పి.వాసు దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అన్నారు. అయితే విభిన్న హారర్, కామెడీ కథా చిత్రంగా రూపొందిన ఇందులో తాను కథానాయకుడిని కాదని, నటి రితికాసింగ్నే హీరో అని పేర్కొన్నారు. తాను ఎక్కువగా పాటలకే పరిమితం అవుతానని అన్నారు. నటి రితికాసింగ్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించే అవకాశాన్ని దర్శకుడు పి.వాసు కల్పించారని, ఇది చంద్రముఖి చిత్రంలో జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని అన్నారు. ఇందులో ముందుగా రజనీకాంత్‌ను నటింపజేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. ఆయన ఇతర చిత్రాలను కమిట్ అవడంతో నటించలేకపోయారనే ప్రచారం జరిగింది. -
అనుష్కకు చెల్లెలవుతున్న రితికా
కథానాయకి ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న కథాచిత్రాలు ఇటీవల కాస్త పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇద్దరు కథానాయికల సెంట్రిక్ కథా చిత్రాలు రావడం అరుదైన విషయమే. త్వరలో అలాంటి యాక్షన్ కథా చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఇందులో స్వీటీ అనుష్క, బ్యూటీ రితికాసింగ్ కలిసి నటించనున్నట్లు తెలిసింది. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు పేరుగాంచినది నటి అనుష్క అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరుంధతి, రుద్రమదేవి చిత్రాలు తన నటనాచాతుర్యానికి నిదర్శనం. బాహుబలి చిత్రంలో దేవసేనగా పరిమిత పాత్రలో అయినా తన ఉనికిని చాటుకున్న అనుష్క దానికి సీక్కెల్ బాహుబలి–2లో మరో సారి కత్తిపట్టి విజృంభించనున్నారు. అదే విధంగా భాగమతి అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న అనుష్క తాజాగా మరో నూతన చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఒక ఇరుదుచుట్రు చిత్రంతో ఒకేసారి హిందీ, తమిళ భాషల్లో పరిచయమైన రియల్ బాక్సర్ రితికాసింగ్ తొలి చిత్రంలోనే జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత నటించిన ఆండవన్ కట్టళై చిత్రం ఇటీవల ఇరుదుచుట్రుకు రీమేక్‌గా తెరకెక్కిన తెలుగు చిత్రం గురు చిత్రాలు తన ఖాతాలో సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. ఇక లారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో రితికాసింగ్ కూడా తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అనుష్కకు చెల్లెలిగా నటించడానికి రెడీ అవుతున్నారట. ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. -
డైరెక్టర్స్ హీరో
పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి నైజం ఏదైనా నిజం బయట పడకుండా పబ్లిక్ లైఫ్‌లో యాక్ట్ చేసేస్తుంటారు. వెంకటేశ్ అలా కాదు. సత్యాన్ని అన్వేషించాలనుకుంటాడు. అందుకే... సత్యానికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. అందుకే ఆయన డైరెక్టర్స్ హీరో అయ్యాడు. పాత్రల్లో ఎలాగూ మంచి నటన ఉంటుంది. జీవితంలో మంచి పాత్ర చాలు. నటన అక్కర్లేదు. వెంకీ పాలసీ, ఫిలాసఫీ కూడా ఇదే. ⇒ వెంకీగారు... మెయి న్స్ట్రీమ్ హీరోల్లో ఇద్దరు లేడీ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసింది మీరే. ఫీమేల్ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేయాలనా? వెంకీ: (నవ్వుతూ) నేను మంచి సినిమాలను ప్రోత్సహిస్తాను. క్రమశిక్షణ, అంకితభావానికి ప్రాధాన్యం ఇస్తాను. అది ఎవరిలో ఉన్నా ఎంకరేజ్ చేస్తా. సుధలో నేను ఆ లక్షణాలు చూశా. 24 గంటలూ ఆమె సినిమా గురించే ఆలోచిస్తుంది. ప్లస్ తను తీసుకొచ్చిన కథ బాగుంది. ⇒ ఫీమేల్ డైరెక్టర్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్... సుధ హ్యాండిల్ చేయగలుగుతుందా? అని చిన్న సందేహం కూడా కలగలేదా? వెంకీ: ఇప్పుడు మీరు అడుగుతుంటే ఆలోచిస్తున్నాను. యాక్చువల్‌గా సుధ వచ్చినప్పుడు నాకేమీ అనిపించలేదు. ఫీమేల్ డైరెక్టర్ అని ఆలోచించలేదు. స్టోరీ నచ్చింది. ముందు సినిమాల్లో చేసినట్టు కాకుండా కొత్తగా, నేను టోటల్ డిఫరెంట్‌గా కనిపించాలని, నటించాలని అను కుంది సుధ. ఆ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ⇒ ‘అమ్మాయిలు అవకాశాలు రాలేదు... అంటుంటారు. వస్తే ఉపయోగించుకోరు’ అని ‘గురు’ సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. ఇన్ జనరల్ విమెన్ గురించి చెప్పండి? వెంకీ: సహజంగా మహిళలు మగవాళ్ల కన్నా స్ట్రాంగ్. అందులో సందేహం లేదు. 20– 30 ఏళ్లుగా మహిళలు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఓ ఛాన్స్ ఇచ్చి చూడండి... అద్భుతాలు సృష్టిస్తారు. సమాజం మహిళల పాత్రను గుర్తించి అంగీకరించాలి. నేనెప్పుడూ మహిళలను ఎంకరేజ్ చేస్తాను. వాళ్లు ఏం చేసినా బాగా చేస్తారు. లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నారనే ఛాయిస్ వాళ్లకే ఇవ్వాలి. ⇒ మరి... ఈ సినిమాలో రితికా సింగ్‌ను కాలితో తన్నే సీన్ చేయడానికి ఇబ్బంది పడలేదా? వెంకీ: ఆ సీన్ కుదరదంటే కుదరదని సుధతో అన్నాను. కానీ, చేయకపోతే సీన్ పేలవంగా ఉంటుందని చెప్పింది. (మధ్యలో సుధ కల్పించుకుంటూ)... మామూలుగా వెంకీ ఏ సీన్ అయినా సింగిల్ టేక్‌లో చేసేస్తారు. కానీ, ఈ సీన్‌కి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారు. రితిక ఏమో ‘కమాన్ హిట్ మి’ అన్నప్పటికీ వెంకీ చేయడానికి ఇష్టపడలేదు. చివరికి ఎలాగో ఒప్పించాం. ఇష్టం లేకుండా చేసిన సీన్ కాబట్టి, ఎక్కువ టేక్స్ తీసుకున్నారు. ⇒ ‘గురు’ పాత్రకు వెంకీయే కరెక్ట్ అని ఎలా ఊహించారు? సుధ: నిజం చెప్పాలంటే... నేను గుడ్ యాక్టర్స్తోనే పని చేయడానికి ఇష్టపడతాను. అలాంటివాళ్లు పక్కన ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది. బ్యాడ్ యాక్టర్స్‌ను భరించలేను. వెంకీ జీనియస్ యాక్టర్. ‘క్షణ క్షణం’లో వెంకీ యాక్టింగ్ ఇష్టం. ఆయనకు ఓ క్యారెక్టర్ ఇస్తే అందులోంచి అటూ ఇటూ వెళ్లరు. ఆ పాత్రకు ఏం చేయాలో అదే చేస్తారు. ఆయన సినిమాలు చూసి, నేను తెలుసుకున్న విషయం అది. అందుకే ‘గురు’గా ఆయనే కరెక్ట్ అనుకున్నా. ఒకవేళ వెంకీ చేయకపోతే ‘గురు’ వచ్చేది కాదు. ⇒ తమిళంలో ఈ సినిమాని మాధవన్‌తో తీశారు. తెలుగులో వెంకీ పెద్ద స్టార్ కాబట్టి, మీకేమైనా భయం అనిపించిందా? సుధ: మొదట ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే... సగం యుద్ధం గెలిచినట్టే అనుకున్నా. కథకు తగ్గట్టు ఎలా నటించాలో తర్వాత ఎలానూ చెబుతారు. అఫ్కోర్స్... భయం ఉంటుంది. కొత్త వ్యక్తిని ఎవర్ని కలిసినా నాలో భయం ఉంటుంది. అయితే సినిమా బాగా రావాలనే స్వార్థమే... ఆ భయాన్ని తీసి పక్కన పడేసింది. (వెంకటేశ్ మధ్యలో కల్పించుకుంటూ) మొదట్లో కొన్ని నా దగ్గర చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ‘మీరు ఫుల్ స్క్రిప్ట్ చదవాలి. అది కూడా షూటింగ్‌కి ముందే మొత్తం చదవాలి. పక్కన ఆర్టిస్టులుంటారు. వాళ్లతో కలసి రిహార్సల్స్ చేయాలి’ అంది. సరే చూద్దామన్నా. చాలాసార్లు రిహార్సల్స్ చేయాలని అడిగింది. నేనెప్పుడూ అలా చేయలేదు. దాంతో ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది. ఇంపార్టెంట్ సీన్స్ ఇంటికి తీసుకువెళ్లి ప్రిపేర్ కావడం కామనే. కానీ, నా లైఫ్‌లో ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడూ చదవలేదు. అసలు నాకు తెలుగు రాదు. ఫుల్ స్క్రిప్ట్ చదవడం, రిహార్సల్స్.. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందని సుధని అడిగితే... ‘ఏం ఫర్వాలేదు’ అంది. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాను. ఎక్కడో కొడుతుందేమో, డేంజర్ అవుతుందేమో అనుకున్నా. కానీ, ఒక్కసారి స్క్రిప్ట్ చదవి, షూటింగ్ మొదలు పెట్టాక ఎంతో ఎనర్జీ వచ్చింది. ఏదో ఐఏయస్, ఐపీయస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినట్లు అనిపించింది. ⇒ భల్లాలదేవ (వెంకీ అన్న సురేశ్‌బాబు కొడుకు)తో మీ రిలేషన్ గురించి? వెంకీ: తను నా కొడుకులాంటివాడే. ‘సాలా ఖడూస్’ గురించి చెప్పి, ‘ఈ సినిమా చూడు’ అన్నాడు. అంతకుముందే సుధ నాకు ఈ సినిమా గురించి చెప్పింది. ‘నేను కూడా ఇదే చేయాలనుకుంటున్నార్రా’ అన్నాను. అన్నయ్య, నేను బాగా డిస్కస్ చేసుకుంటాం. రానా కూడా తన సినిమాల గురించి చెబుతుంటాడు. సుధ: 2010లో ఇదే రూమ్‌లో రానాకి ‘గురు’ కథ చెప్పాను. రానా యంగ్ కాబట్టి, కొంచెం లవ్, రొమాన్స్ యాడ్ చేశాను. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ అప్పట్లో రానాకి ఈ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత రెండేళ్లకు వెంకీకి ఈ కథ చెప్పా. నా ఫ్రెండ్ ఒకరు రమణ మహర్షి డైరీ ప్రతి ఏడాదీ ఇస్తుంటారు. ప్రతి రోజూ ఆ డైరీలో రాసుకుంటాను. వెంకీ దగ్గర కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ డైరీ తీసుకెళ్లాను. రమణ మహర్షి డైరీ ఏంటి? అని అడిగారాయన. ఏదో శక్తి నడిపించినట్లుగానే ముందు రానా దగ్గరకు వచ్చిన కథ... ఆ తర్వాత మూడేళ్లకు వెంకీకి కుదరడం భలే గమ్మత్తుగా అనిపించింది. సుధ: సాధారణంగా వెంకీ ఉదయం తొమ్మిది పదింటికి షూటింగ్ చేయడానికి ఇష్టపడతారు. మేము 7 గంటలకే రమ్మన్నాం. ఆయన 6.45కే వచ్చి... ‘‘నేను ఎలా చేస్తే బాగుంటుంది? నువ్వేం అనుకుంటున్నావ్?’ అనడిగేవారు. యాక్టర్ అలా రెస్పాండ్ కాకపోతే డైరెక్టర్ ఏమీ చేయలేరు. ⇒ హిందీ హీరోల్లా తెలుగు హీరోలు ప్రయోగాలు చేయరంటారు. ‘దంగల్’కి ఆమిర్‌ఖాన్ పొట్ట పెంచినట్లుగా ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరూ చేస్తారా? వెంకీ: అలాంటి కథ వస్తే తప్పకుండా చేస్తాను. రైటర్స్, డైరెక్టర్స్ రావాలి. ఒకప్పుడు నేను చేసిన సినిమాలు తీసుకోండి. ‘చంటి’ ఒప్పుకున్నప్పుడు, ‘నువ్వేమో మ్యాన్లీగా ఉంటావ్. అమాయకుడి పాత్ర వర్కవుట్ కాదని చాలామంది అనుకుంటున్నార్రా. జాగ్రత్త’ అన్నారు నాన్నగారు. ఇండస్ట్రీలో చాలామంది వద్దన్నారు. నాకు సబ్జెక్ట్ నచ్చింది. అప్పట్లో అదో ప్రయోగం. అలాగే, ‘శ్రీను’ సినిమా కూడా. నాకు సబ్జెక్ట్ ముఖ్యం. డిఫరెంట్‌గా యాక్ట్ చేసే స్కోప్ ఉందనిపిస్తే కచ్చితంగా ఒప్పుకుంటా. ‘గురు’ విషయానికొస్తే... అందరూ ప్రశంసిస్తున్నారు. చిరంజీవిగారైతే ‘హ్యాట్సాఫ్ టు యు. ఆ లుక్, నాన్నలాంటి వయసు అనే డైలాగ్ ఒప్పుకోవడం... మామూలు విషయం కాదు. చాలా రిస్క్. నువ్వు ఎప్పుడూ రిస్క్ తీసుకుంటావ్’ అన్నారు. మెగాస్టార్‌కి నా ఛాయిస్ నచ్చింది. హీరోగా నేను తీసుకున్న రిస్క్‌ని ఆయన చాలా అభినందించారు. సుధ: యాక్చువల్లీ చిరంజీవిగారి వైఫ్ (సురేఖ) ఈ సినిమా చూడ్డానికి పెద్ద ఆసక్తి చూపలేదు. ‘బాక్సింగ్ మూవీ కదా, ఏముంటుందిలే’ అనుకున్నారట. సినిమా చూశాక... ‘ఇది బాక్సింగ్ మూవీ కాదు.. మంచి ఎమోషన్’ అంటూ ఏడ్చారు. ఆమెకు అంత బాగా నచ్చింది. ⇒ వెంకీగారూ! ఆ మధ్య దాదాపు ఒకే రకం సినిమాలు చేశారు. అప్పుడు బోర్ అనిపించలేదా? వెంకీ: నాకైతే ‘ఇక చాలు.. రిటైర్ అయిపోతే బెస్ట్’ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేసే నాకూ, చూసే ప్రేక్షకులకూ విసుగు అనిపించే సినిమాలు చేయడం ఎందుకు? కొన్ని సినిమాలు ఆడినా, కిక్ అనిపించలేదు. నన్ను నేను డిఫరెంట్‌గా చూసుకోవాలని ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి. అలా కుదరనప్పుడు ‘ఇక చాలు’ అనుకుంటుంటాను. అలా అనుకున్న ప్రతిసారీ మంచి ఛాన్స్ వస్తుంటుంది. ఆ సినిమా భలే కిక్ ఇస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ చేస్తుంటా. ⇒ 30 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, రిటైర్ అవ్వడం అంత ఈజీయా? వెంకీ: మంచి సినిమాలు రానప్పుడు ఏం చేస్తాం? లైఫ్ ఎలా వెళితే అలా తీసుకోవాలి. పెద్దగా ఆలోచించకూడదు. ⇒ అంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడడంలేదా? వెంకీ: కమర్షియల్ అంటే ఏంటి? ఇప్పుడు ‘గురు’ కమర్షియల్ సినిమానే. క్లాస్, మాస్, కమర్షియల్ అనేది ఎప్పుడో పోయింది. కథలో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అది కమర్షియల్ సినిమానే. ⇒ ఓకే... మీ రియల్ లైఫ్ గురువుల గురించి తెలుసుకోవాలని ఉంది! వెంకీ: మైసూరులో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. హిమాలయాలవీ తిరిగాను కదా. రామకృష్ణ పరమ హంస, వివేకానంద, పరమహంస యోగానంద... వీళ్ల టీచింగ్స్ చదివి, చాలా ఇన్స్పైర్ అయ్యాను. రమణ మహర్షి టీచింగ్స్ చదవడం మొదలుపెట్టాక, అవి నాకు పర్ఫెక్ట్ అనిపించాయి. మహమ్మద్ ప్రవక్త, రూమీ, జీసెస్ల టీచింగ్స్లా ఆయనవి కూడా ఉంటాయి. దేహానికి మించినది ఏదో ఉందని తెలుసుకున్నాను. భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ ఫిజికల్ డ్రామా చేయాల్సిందే. కర్మానుసారం అన్నీ జరుగుతుంటాయి. శ్రీరాముడు–శ్రీకృష్ణుడు రాజ్యాలు ఏలారు. సేమ్ టైమ్ సత్యం తెలుసుకున్నారు. మనిషి ఈ రెండూ చేయాలి. ఇప్పుడు వాళ్ల దారిలో వెళుతూ నేను చేస్తున్నది అదే. శరీరీం–ఆత్మ... ఈ రెండింటి బాధ్యతలనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ⇒ మీ గురువు సుధగారు? సుధ: సాయిబాబా. ప్రతి రోజూ ఆయన పుస్తకంలో ఒక పేజీ చదువుతాను. డిస్ట్రబ్డ్‌గా ఉన్నప్పుడు పుస్తకం తెరిస్తే, సమాధానం దొరుకుతుంది. నా విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. ⇒ క్రికెట్ బాగా ఆడతారు కదా! ఈ మధ్య ఎప్పుడు ఆడారు? వెంకీ: ఈ మధ్య ఎక్కువగా చూడటమే. ఆడటంలేదు. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. దానివల్ల షూటింగ్‌కి ఇబ్బందవుతుందేమో అని పెద్దగా ఆడటంలేదు. ఈ 5న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు నేను ఈ మ్యాచ్‌లు చూస్తూ, బిజీగా ఉంటా. ఆ తర్వాతే సినిమాలు. ⇒ సినిమాల్లో సెంచురీ కొట్టేస్తారా? వెంకీ: అది నా చేతుల్లో లేదు. చేసే పని సిన్సియర్‌గా చేయాలి. ఇప్పుడు ‘గురు’ చేశాను కాబట్టి, నాకోసం కొత్త స్క్రిప్ట్స్ రెడీ చేస్తారని నమ్ముతున్నాను. ⇒ శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు..? వెంకీ: ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ అని రెండు ఉంటాయి. మెలకువ దశలో ఉన్నప్పుడు జరిగినవన్నీ నిద్ర స్థితిలో మరచిపోతాం. ఉదాహరణకు, కోట్లకు కోట్లు అప్పు ఉందనుకోండి. నిద్రపోయేటప్పుడు అది గుర్తుకు రాదు కదా. అలాగే పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మెలకువగా ఉన్నంత వరకూ ఆందోళనపడతాం. నిద్రపోయాక మరచిపోతాం. వేకప్ స్టేట్‌లో జరగాల్సిన డ్రామా జరుగుతూ ఉంటుంది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాకపోతే ‘వేకప్ స్టేట్’, ‘స్లీపింగ్ స్టేట్’ గురించి అర్థం చేసుకున్నవాళ్లు వీటికి తక్కువ రియాక్ట్ అవుతారు. మనిషిగా పుట్టాం కాబట్టి, సమస్యలు తప్పవు. పుట్టేటప్పుడు మన బ్యాగేజ్లో ఏం రాసి ఉందో అవన్నీ అనుభవించాల్సిందే. మనం బలంగా ఉండాలంటే తప్పించలేని వాటి గురించి ఎక్కువగా ఆందోళన పడటం అనసవరం. ⇒ అన్నీ ఉన్న మీలాంటివాళ్లు ఎన్నైనా చెబుతారు.. వెంకీ: (నవ్వుతూ).. ఏదైనా రోగం వస్తే అన్నీ ఉన్నోళ్లు డబ్బూ పేరూ... ఏమీ వద్దు. ఆ రోగం పోతే చాలనుకుంటారు కదా. అసలు మనం రేపు చచ్చిపోతాం అనుకుంటే, ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తాం. రేపు మనం చచ్చిపోతాం అనుకుని బతికితే ఇవాళ వర్రీ అవ్వం. ఎందుకంటే రేపు అనేది ఉండదు. ఇదిగో నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. బిస్కెట్స్ తిన్నాను, మంచినీళ్లు తాగాను, టీ తాగాను. ఈ క్షణం వరకూ అంతా బాగానే ఉంది కదా. రేపటి గురించి ఎందుకు అనుకుంటే,æలైఫ్ లీడ్ చేయడం ఈజీ. ⇒ మీకు ఎక్కువ హిట్లు ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు పెద్దగా హడావిడి చేసినట్లు కనిపించరెందుకు? వెంకీ: ఫ్యాన్స్ వాళ్ల కుటుంబాలతో గడపాలని కోరుకుంటాను. అది రైటో రాంగో తెలియదు కానీ, నేను బాగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్లు చాలా హంగామా చేయాలనుకున్నారు. నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. ‘మీ ఫ్యామిలీస్ చూసుకోండి’ అనేవాణ్ణి. ఫ్యాన్స్ నిరుత్సాహపడేవాళ్లు. ఎలాంటి హడావిడీ చేసేవాళ్లు కాదు. అది అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే... నేను రికార్డ్స్ గురించి అంత పర్టిక్యులర్‌గా ఎప్పుడూ ఆలోచించను. ⇒ మీ ఫ్యాన్స్‌లో ఎక్కువమంది ఆడవాళ్లు ఉన్నారు కదా! వెంకీ: అది కరెక్టే. ఫస్ట్ డే వాళ్లు సినిమా చూడ్డానికి రారు. అందరూ ఇంట్లో ఉంటారు. ప్లస్ హంగామా, హడావిడి చేయరు (నవ్వుతూ). ఒక యాక్టర్ తను చేసే సినిమాల పట్ల తను హ్యాపీగా ఉండాలి. సుధ: మొన్న పబ్లిక్ థియేటర్‌కి వెళితే, ఒక ప్రెగ్నెంట్ లేడీ సినిమా చూడ్డానికి వచ్చింది. కొడుకు పుడితే ‘జూనియర్ వెంకటేశ్’ అని పేరు పెట్టుకుంటా అంది. ఇంకా చాలామంది లేడీస్ సినిమా చూడ్డానికి వచ్చారు. వాళ్లు మాట్లాడుతుంటే, వెంకీకి ఎంత మంచి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమైంది. ⇒ నెక్ట్స్ మీ ప్రాజెక్ట్స్ గురించి? వెంకీ: ఇప్పుడు నేను హాలిడే మూడ్‌లో ఉన్నాను. సురేశ్ ఏవేవో స్రిప్ట్స్ వింటున్నాడు. నేను కొన్నాళ్లు రిలాక్స్ అయ్యాక వాటి మీద దృష్టి పెడతా. సుధ: ఇంకా ఏమీ అనుకోలేదు. అవకాశాలైతే ఉన్నాయి. – డి.జి. భవాని -
‘గురు’తో నేను కొత్త నటుణ్ణి
‘‘30 ఏళ్లుగా నటిస్తున్నా, ఎన్నో చిత్రాలు చేశా. అవార్డులు అందుకున్నా. అయితే, ఎప్పుడూ పూర్తి కథను చదవలేదు. కానీ, ‘గురు’ కథను పూర్తిగా చదవమని సుధ చెప్పారు. సరేనని చదవడం మొదలుపెడితే... నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. ఈ సినిమాతో నేను ఓ కొత్త నటుణ్ణి అనిపించింది’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్ హీరోగా సుధ కొంకర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన సినిమా ‘గురు’. రితికా సింగ్, ముంతాజ్, నాజర్ ముఖ్యతారలు. సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు డెంగీ జ్వరం రావడంతో చేయలేకపోయా. తమిళం, హిందీ భాషల్లో సినిమా తీసిన తర్వాత నాకు కుదిరింది. గత చిత్రాలకంటే ఇందులో బాగా లీనమై నటించా. నా డైలాగ్ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రమే నేను గురు. షూటింగ్లో మాత్రం నా గురు సుధానే. తనకి నేను స్టూడెంట్ అయిపోయా. ఈ సినిమాలో ఓ ట్యూన్ వినగానే చాలా ఎగ్జయిట్‌గా అనిపించి పాట పాడా. సంతోశ్ మంచి పాటలిచ్చారు’’ అన్నారు. సుధ కొంగర మాట్లాడుతూ– ‘‘గురు’ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మణిరత్నంగారిని సంప్రదించా. నాలుగైదేళ్లు బాక్సింగ్‌పై పరిశోధన చేసి, 250 మంది బాక్సర్లను కలిసి కథ రెడీ చేశా. వెంకీగారిని కలిసి బాక్సింగ్ నేపథ్యం అనగానే చాలా ఎక్జైట్ అయ్యారు. ఆయన కమిట్మెంట్, సిన్సియారిటీ నాకు నచ్చింది. ఆయన టైమ్ అంటే టైమే. ఆయనతో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్ ఉంది. బాక్సర్ రితిక 2010 నుంచి నాతో ట్రావెల్ అవుతోంది. ముంతాజ్ కూడా బాక్సర్.. ఇద్దరూ సిస్టర్స్‌గా యాక్ట్ చేశారు. నిర్మాత శశికాంత్ చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో క్వాలిటీ సినిమా వచ్చింది’’ అన్నారు. ‘‘వెంకీ సార్‌ని చూస్తే నా రియల్ గురు గుర్తుకొచ్చారు. ఈ చిత్రం చూశాక చాలా మంది స్ఫూర్తి పొందుతారు’’ అన్నారు రితికా సింగ్. శశికాంత్, ముంతాజ్, సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్, పాటల రచయిత భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ముగ్గురి తర్వాతే నేను - లారెన్స్
-
ఆ ముగ్గురి తర్వాతే నేను - లారెన్స్
‘‘ఈ చిత్రంలో కథే మొదటి హీరో రెండో హీరో రితికా సింగ్ (హీరోయిన్), మూడో హీరో శక్తివాసు. ఆ ముగ్గురి తర్వాతే నేను. నాలుగో హీరో అన్నమాట’’ అన్నారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు, తమిళ చిత్రం ‘శివలింగ’. రితికా సింగ్ హీరోయిన్. తెలుగులో రమేశ్ పి.పిళ్లై, తమిళంలో రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో పాటల్ని, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. లారెన్స్ మాట్లాడుతూ - ‘‘ఇప్పుడు చాలా చిత్రాల్లో ఇంటర్వెల్ దగ్గర అసలు కథ మొదలవుతోంది. కానీ, ఈ చిత్రంలో మొదటి సీన్ దగ్గరే కథ మొదలవుతుంది. రజనీకాంత్‌గారి దర్శకుడితో పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. పి.వాసు మాట్లాడుతూ - ‘‘పదేళ్ల క్రితం నేను కన్నడలో తీసిన ‘ఆప్తమిత్ర’ను తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’గా రీమేక్ చేశా. పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా కన్నడలో నేను తీసిన ‘శివలింగ’కి రీమేక్. నా కుమారుడు శక్తివాసు నటించిన తొలి తెలుగు చిత్రమిది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, నిర్మాతలు రమేశ్ పి.పిళ్లై, రవిచంద్రన్, డీఓపీ సర్వేశ్ మురారి, నటుడు శక్తివాసు పాల్గొన్నారు. -
విజయ్‌సేతుపతితో మళ్లీ రొమాన్స్
సక్సెస్ఫుల్ జంట విజయ్‌సేతుపతి, రితికాసింగ్ మరోసారి కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి ప్రముఖ హీరోయిన్లుగా ఎదిగిన వారి సంఖ్య చిత్రపరిశ్రమలో అధికం. తొలి చిత్రంతోనే కథనంతా తన భుజాన మోసి విజయం సాధించిన హీరోయిన్లు చాలా తక్కువ మందే. అలాంటి వారి సరసన చేరిన నటి రితికాసింగ్. రియల్ లైఫ్‌లో బాక్సింగ్ రాణి అయిన రితికా రీల్ లైఫ్‌లోకీ అదే పాత్రతో ఎంటర్ అయి ఇరుదు చుట్రు అంటూ ఏక కాలంలో తమిళం, హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఆ చిత్రంలో మాధవన్‌తో పోటీ పడి నటించిన రితికాసింగ్ తదుపరి కాక్కా ముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటించే అవకాశాన్ని పొంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో పత్రికా విలేకరిగా వైవిధ్యమైన నటనతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇలా వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న రితికాకు తాజాగా మరో అవకాశం వచ్చింది. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా ముందు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఆమె కాల్షీట్స్ లేకపోవడంతో మరోనటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రెమో చిత్ర విజయంతో కీర్తీసురేశ్ అధిక పారితోషికం డిమాండ్ చేశారనే మరో టాక్ కోడంబాక్కం వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైతేనేం కీర్తీసురేశ్ నటించాల్సిన పాత్ర నటి రితికాసింగ్‌ను వరించింది. దీంతో ఆండవన్ కట్టళై చిత్రం తరువాత విజయ్‌సేతుపతితో మరో సారి రొమాన్స్ చేయడానికి రితిక రెడీ అవుతున్నారన్నమాట. -
ధనుష్‌తో జత కట్టాలని ఆశ
నటుడు ధనుష్‌తో కలిసి నటించాలని ఆశగా ఉందని అంటున్నారు నటి రితిక సింగ్. ముంబైకి చెందిన ఈ బాక్సింగ్ భామ రాను, రాను అంటూనే సినీ రంగ ప్రవేశం చేసి ఇరుదుచుట్రు (చివరి రౌండ్) అంటూ తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని పొందడంతో పాటు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా రితిక సింగ్‌ను పలకరిస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. అవేమిటో ఆ సుందరి మాటల్లోనే...ఆండవన్ కట్టళై చిత్రంలో మహిళా రిపోర్టర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం పలు ఛానళ్లను చూసి రిపోర్టర్ల నడవడికలను క్షుణ్ణంగా గమనించాను. ఇప్పుడు నాకు ప్రశ్నలను అడగడం తెలిసింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక కలుగుతోంది. అయితే ఇంకా తమిళ భాష మాట్లాడటం రాలేదు. ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతున్నాను. షూటింగ్లో నాకొక శిక్షకుడు ఉన్నారు. త్వరలోనే తమిళ భాషను నేర్చుకుంటాను. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు లభించడం అదృష్టంగానే భావిస్తున్నాను. ఇకపై ఎలాంటి పాత్ర అయినా బాగా నటించాలన్న బాధ్యత పెరిగింది. తమిళంలో నటుడు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని ఆశగా ఉంది. జ్యోతిక నా అభిమాన నటి. ఆమె నటన నాకు బాగా నచ్చుతుంది. తమిళ ప్రేక్షకులంటే చాలా గౌరవం. నన్ను ఒక్క చిత్రంతోనే ఎంతగానో అభినందిస్తున్నారు. ముఖంపై గాయాలయితే నటనకు ఇబ్బంది అవుతుందని బాక్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఆండవన్ కట్టళై చిత్రంలో నటించడానికి ఆ చిత్ర హీరో విజయ్ సేతుపతి చాలా సహకరించారు. తదుపరి పీ.వాసు దర్శకత్వంలో లారెన్స్‌కు జంటగా నటిస్తున్నాను. తెలుగులో వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నాను అని ముచ్చటించారు. -
సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య తదుపరి ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి గ్రామీణ యువకుడిగా మారుతున్నారు. ఇంతకు ముందు ముత్తయ్య దర్శకత్వం వహించిన కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తె రకెక్కిన చిత్రాలేనన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రానికి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో తన నవ్వులతోనే వశీకరణం చేసుకుంటున్న నటి కీర్తీ సురేశ్, తొలి చిత్రంతోనే కోలీవుడ్‌ను దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ముంబయి బ్యూటీ రితికాసింగ్ నాయికలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. బిజీగా ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. దీన్ని సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టూడియోగ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య తదుపరి ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి గ్రామీణ యువకుడిగా మారుతున్నారు. ఇంతకు ముందు ముత్తయ్య దర్శకత్వం వహించిన కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తె రకెక్కిన చిత్రాలేనన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రానికి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో తన నవ్వులతోనే వశీకరణం చేసుకుంటున్న నటి కీర్తీ సురేశ్, తొలి చిత్రంతోనే కోలీవుడ్‌ను దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ముంబయి బ్యూటీ రితికాసింగ్ నాయికలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. బిజీగా ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. దీన్ని సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టూడియోగ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
స్పెషల్ డైట్!
వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మాధవన్ హీరోగా తమిళంలో ‘ఇరుది సుట్రు’, హిందీలో ‘సాలా కడూస్’గా విడుదలైన సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 7న మొదలు కానుందని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఒరిజినల్ వెర్షన్లో కథానాయికగా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ నటించనున్నారు. ఒరిజినల్ సినిమాకి స్వరాలందించిన సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణ్ తెలుగు సినిమాకీ బాణీలు అందిస్తున్నారు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రస్తుతం కాస్త కండలు పెంచే పనిలో నిమగ్నమయ్యారు. స్పెషల్ డైట్ తీసుకుంటున్నారాయన. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. -
గేర్ మార్చిన వెంకీ!
ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్ జోరు మీదున్నారు. గత రెండేళ్లూ ఏడాదికి ఓ సినిమా మాత్రమే చేశారు. ఇప్పుడు గేరు మార్చారు. ఈ ఏడాది ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సమయంలోనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి రెడీ చేస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో మాధవన్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారనే విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్గా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ నటించనున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘చల్ చలో..’ పాట తరహాలో ఓ స్ఫూర్తిమంతమైన పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి స్వరకర్త. -
'ఆస్కార్ గెలిచినంత ఆనందంగా ఉంది'
చెన్నై: కిక్ బాక్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సినీనటిగాను నిరూపించుకుంది రితికా సింగ్. తమిళ చిత్రం 'ఇరుధి సుత్రు' (హిందీలో 'సాలా ఖద్దూస్') లో నిజజీవిత పాత్రను అద్భుతంగా పోషించిన రితికా సింగ్‌కు స్పెషల్ మెన్షన్ కేటగిరీ కింద జాతీయ అవార్డు లభించింది. 'నిజంగా నాకు నోట మాట రావడం లేదు. ఆస్కార్ అవార్డు గెలిచినంత ఆనందంగా ఉంది. ఇంతటి గౌరవాన్ని అందించినందుకు 'ఇరుథి సుత్రు' చిత్రయూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్తున్నా. తొలి సినిమాకు ఇలాంటి అవార్డు రావడం అంటే ఎంతో గొప్ప విషయం. మరింత ఉత్తమంగా పనిచేసేందుకు దీనిని ప్రోత్సాహంగా స్వీకరిస్తాను' అని రితికా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. చేపలు పట్టుకునే ఓ యువతి.. మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది.. అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచే కథతో 'ఇరుథి సుత్రు' చిత్రం తెరకెక్కింది. ఇందులో రితిక చేపలు పట్టే అమ్మాయిగా మంచి అభినయాన్ని కనబర్చగా, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్‌గా, కోచ్‌గా మాధవన్ నటించాడు. మన తెలుగు వ్యక్తి అయిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇది 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న తనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్లాంటిందని ఆమె పేర్కొంది. మంగళవారం కంగనా 29వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో తనకు జాతీయ పురస్కారం దక్కడం ఎంతో థ్రిల్ కలిగిస్తున్నదని ఓ ప్రకటనలో తెలిపింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా, తాను ఉత్తమ నటిగా ఒకేసారి పురస్కారాలు అందుకోవడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని పేర్కొంది. కంగనాకు ఇది మూడో జాతీయ చలనచిత్ర పురస్కారం. 'ఫ్యాషన్' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా, 'క్వీన్' సినిమాకు ఉత్తమ నటిగా, ప్రస్తుతం 'తను వెడ్స్ మను రిటర్న్స్'కు మరోసారి ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకుంది.