కాంచనకు మించి... | Raghava Lawrence Ritika Singh starring Shivalinga | Sakshi
Sakshi News home page

కాంచనకు మించి...

Published Thu, Apr 6 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

కాంచనకు మించి...

కాంచనకు మించి...

‘కాంచన, గంగ’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించు కున్నారు లారెన్స్‌. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘శివ లింగ’. రితికా సింగ్‌ కథానాయిక. పి.వాసు దర్శకత్వంలో రమేష్‌ పి.పిళ్ళై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించారు. ఏప్రిల్‌ 14న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో రిలీజ్‌ చేస్తున్న మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శివరాజ్‌కుమార్‌ హీరోగా వాసుగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివలింగ’ ఘనవిజయం సాధించింది.

దీంతో తమిళ్, తెలుగు భాషల్లో రమేష్‌ పిళ్ళై రీమేక్‌ చేశారు. హారర్‌ సినిమాల్లో మరో లెవెల్‌లో ఉండే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్‌ సహా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ఐదు పాటలూ బాగున్నాయి. లారెన్స్‌కు ‘కాంచన’ చిత్రానికి మించి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు రమేష్‌ పిళ్ళై.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement