Shiva Linga
-
నదిలో లక్ష లింగాలు: నిజమేనా?
బెంగళూరు: కర్ణాటకలోని సిర్సి తాలూకాలో దట్టమైన అడవిలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. మార్గమధ్యలో ఓ చోట అనేక బండరాళ్లు దర్శనమిస్తాయి. పరీక్షించి చూస్తే రాళ్లపై శివలింగాలు కనిపిస్తాయి. పదులు, వందలు కాకుండా వేల సంఖ్యలో శివ లింగాలు చెక్కి ఉంటాయి. 2011లో పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యటించడంతో ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ గాలి వార్త తెగ చక్కర్లు కొడుతోంది. "దేశ చరిత్రలోనే తొలిసారిగా లక్ష లింగాల పుణ్యక్షేత్రం బయటపడింది. కర్ణాటకలోని శివకాశీ నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఈ లింగాలు దర్శనమిచ్చాయి. మన సనాతన సంస్కృతికి ఇవే రుజువు. హిందువులారా మేల్కొనండి, హిందువులమని గర్వించడి" అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. (సైకిల్ గర్ల్‌పై అత్యాచారం, హత్య: నిజమెంత?) (ఫొటో: ఏన్సెంట్ పేజెస్) ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం కలగలిసి ఉంది. ఇక్కడ 1000 శివలింగాలున్నాయి కానీ వాట్సాపుల్లో చెప్తున్నట్లుగా లక్ష లింగాలు లేవు. కర్ణాటకలోని షాల్మలా నదీ ప్రాంతంలో ఉన్న ఈ శివలింగాలు పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందాయి. క్రీ.శ. 1678-1718 కాలంలో సిర్సి రాజు అరసప్ప నాయక్ ఈ లింగాలను చెక్కించినట్లు ఉత్తర కన్నడ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అదీగాక తొమ్మిదేళ్ల క్రితమే ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి ప్రతియేటా శివరాత్రికి వేలాదిమంది భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుని శివయ్యను స్మరించుకుంటారు. (‘రావణుడి’పై అసత్య ప్రచారం) నిజం: ఇది కొత్తగా బయటపడ్డ ప్రదేశం కాదు. ఇక్కడ వెయ్యి శివలింగాలు మాత్రమే ఉన్నాయి. -
కాంచనకు మించి...
‘కాంచన, గంగ’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించు కున్నారు లారెన్స్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘శివ లింగ’. రితికా సింగ్ కథానాయిక. పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్ళై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో రిలీజ్ చేస్తున్న మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా వాసుగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివలింగ’ ఘనవిజయం సాధించింది. దీంతో తమిళ్, తెలుగు భాషల్లో రమేష్ పిళ్ళై రీమేక్ చేశారు. హారర్ సినిమాల్లో మరో లెవెల్లో ఉండే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ఐదు పాటలూ బాగున్నాయి. లారెన్స్‌కు ‘కాంచన’ చిత్రానికి మించి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు రమేష్ పిళ్ళై. -
ఫిబ్రవరిలో లారెన్స్ శివలింగా
కొరియెగ్రాఫ్గా మంచి ఫాంలో ఉండగానే దర్శకుడిగా మారి తరువాత హీరోగానూ వరుస సక్సెస్‌లు సాధిస్తున్న నటుడు లారెన్స్. ముని సీరీస్‌తో సూపర్ హిట్ లు సాధించిన లారెన్స్ మరో హర్రర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గత చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డాన్సింగ్ స్టార్ కొత్త సినిమాను ఓ సినీయర్ దర్శకుడితో చేస్తున్నాడు. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన శివలింగా సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న లారెన్స్. ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహా శివలింగానికి అభిషేకాలు
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న మహా శివలింగానికి 108 కిలోల పెరుగుతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు గుండేటి రజినీ కుమార్, మార్త ఓంప్రకాష్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివలింగానికి అన్నాభిషేకం చేశారు. పూజల్లో కార్పొరేటర్ బయ్యస్వామి, ఆలయ కమిటీ ప్రతినిధులు గోనె జగదీశ్వర్, సంతోష్, బోడకుంట్ల వైకుంఠం, ఓరుగంటి కొమురయ్య, రమేష్, సాంబారి ఉప్పలయ్య, భాస్కర్, కృష్ణమూర్తి, మండల శ్రీరాములు, భక్తులు పాల్గొన్నారు. -
బాలయ్యతో కాదు లారెన్స్‌తో..!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా శివలింగ. ఇటీవలే ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోగా ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలకృష్ణ హీరోగా శివలింగ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచన ఉందన్న టాక్ వినిపించింది. అంతేకాదు చిత్ర దర్శకుడు పి వాసు కూడా శివ లింగ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఇప్పట్లో పి వాసుకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే బాలకృష్ణతో అనుకున్న శివలింగ రీమేక్‌ను లారెన్స్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. లారెన్స్ హీరోగా నటిస్తే ఒకేసారి తెలుగు, తమిళలో రిలీజ్ చేయోచ్చేనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. -
చంద్రముఖి మళ్లీ వస్తోంది
రజనీ కాంత్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకున్న సమయంలో మరోసారి సూపర్ స్టార్‌ను సూపర్ డూపర్ ఫాంలోకి తీసుకొచ్చిన సినిమా చంద్రముఖి. ఈ సినిమాతో దర్శకుడు పి.వాసు కూడా స్టార్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఈ సినిమా విజయం తరువాత తన మీద ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకోవటంతో విఫలమయ్యాడు వాసు. చంద్రముఖి సినిమా తరువాత పి వాసు దర్శకత్వంలో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా రాలేదు. ఇటీవల కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా శివలింగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన పి.వాసు, ఆ సక్సెస్‌ను అలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మరోసారి చంద్రముఖినే నమ్ముకుంటున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించి తమిళంలో కూడా సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి రజనీ హీరోగానే ఈ సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. చంద్రముఖి తరువాత అదే కాన్సెప్ట్‌తో నాగవల్లి సినిమా చేసిన పి.వాసు భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈసారి అలాంటి పొరపాట్లేవీ జరగకుండా చంద్రముఖిని మరిపించే స్థాయిలో చంద్రముఖి2ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి చంద్రముఖి, పి.వాసుకు రెండోసారి కూడా స్టార్ స్టేటస్ ఇస్తుందేమో చూడాలి.