చంద్రముఖి మళ్లీ వస్తోంది | Director p vasu planing for chandhramukhi sequal | Sakshi
Sakshi News home page

చంద్రముఖి మళ్లీ వస్తోంది

Published Thu, Mar 17 2016 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

చంద్రముఖి మళ్లీ వస్తోంది

చంద్రముఖి మళ్లీ వస్తోంది

రజనీ కాంత్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకున్న సమయంలో మరోసారి సూపర్ స్టార్ను సూపర్ డూపర్ ఫాంలోకి తీసుకొచ్చిన సినిమా చంద్రముఖి. ఈ సినిమాతో దర్శకుడు పి.వాసు కూడా స్టార్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఈ సినిమా విజయం తరువాత తన మీద ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకోవటంతో విఫలమయ్యాడు వాసు. చంద్రముఖి సినిమా తరువాత పి వాసు దర్శకత్వంలో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా రాలేదు.

ఇటీవల కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా శివలింగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన పి.వాసు, ఆ సక్సెస్ను అలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మరోసారి చంద్రముఖినే నమ్ముకుంటున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించి తమిళంలో కూడా సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి రజనీ హీరోగానే ఈ సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
 
చంద్రముఖి తరువాత అదే కాన్సెప్ట్తో నాగవల్లి సినిమా చేసిన పి.వాసు భారీ ఫ్లాప్ను మూటగట్టుకున్నాడు. ఈసారి అలాంటి పొరపాట్లేవీ జరగకుండా చంద్రముఖిని మరిపించే స్థాయిలో చంద్రముఖి2ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి చంద్రముఖి, పి.వాసుకు రెండోసారి కూడా స్టార్ స్టేటస్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement