భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ అబితాబ్ బచ్చన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది.
తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్-2023 గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్ టికెట్‌ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ట్విట్ చేసింది.
"బీసీసీఐ కార్యదర్శి జైషా బంగారు టిక్కెట్‌ను రజినీకాంత్‌కు అందించారు.భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. తలైవా విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని తెలియజేయడానికి సంతోషం ఇస్తున్నామని" బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చింది. కాగా ఈ గోల్డన్ టిక్కెట్ కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్‌లను వీఐపీ స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.
చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment