Jay Shah
-
BCCI: కీలక పదవుల భర్తీకి సన్నాహకాలు
బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వెళ్లారు.మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్‌జీఎమ్ నిర్వహించాలి.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్‌జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు. చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
CT 2025: టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్‌లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియామకం
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమించబడ్డాడు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన ప్రత్యేక అధికారాలు వినియోగించి సైకియాను కార్యదర్శిగా ఎంపిక చేశాడు. సైకియా ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అసోంకు చెందిన సైకియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. మాజీ కార్యదర్శి జై షా ఐసీసీ పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో సైకియా నియామకం అనివార్యమైంది. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా జోడు పదవుల్లో కొనసాగలేడు. అందుకే అతను బీసీసీఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. శాశ్వత కార్యదర్శిని ఎప్పుడు నియమిస్తారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పుడే శాశ్వత కార్యదర్శి పదవిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్‌గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. మేమంతా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్‌మ్యాప్‌కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా
ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా ఇవాళ (డిసెంబర్ 1) బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్‌ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు. షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా కొనసాగారు.ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక జై షా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని వెల్లడించారు. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షాకు తొలి టోర్నమెంట్ కావడం విశేషం. -
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్‌లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
ఐసీసీ చైర్మన్‌గా రెండు విడతల్లో కొనసాగనున్న జై షా..!
డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్ బార్క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. బార్క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్‌గా పని చేశాడు. వాస్తవానికి బార్క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్‌గా షా ఎంపికయ్యాడు.మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.జై షా తర్వాత ఎవరు..?ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. -
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో గానీ..: పాక్ క్రికెటర్ విమర్శలు
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్‌కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమనిపించింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారోగత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్‌లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక... కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్‌కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.అందుకే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారుదేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్‌లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్‌లో సహచరులు! వీడియో -
IPL: క్రికెటర్లకు బీసీసీఐ బంపరాఫర్.. ఏకంగా రూ.7.50 లక్షలు?
ఐపీఎల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్-2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు."ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించున్నాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఓ క్రికెటర్ సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. ప్రతీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్‌కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని ఎక్స్‌లో జైషా రాసుకొచ్చారు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది. In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…— Jay Shah (@JayShah) September 28, 2024 -
ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచంఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.నాలుగు టీ20 సెంచరీలుఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా పూర్తిస్థాయి సారథిగాఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టనోడు క్రికెట్‌కు ఇన్చార్జ్ అయ్యాడు..!
త్వరలో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ కార్యదర్శి జై షాపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి క్రికెట్‌కు ఇన్చార్జ్ అయ్యాడని విమర్శలు గుప్పించారు. దేశం మొత్తంలో వ్యాపారాలు ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడుస్తున్నాయని అన్నాడు. सारे बिजनेस देश के 3-4 लोगों को ही मिलते हैं। अमित शाह के बेटे ने कभी क्रिकेट बैट नहीं उठाया, वो क्रिकेट का इंचार्ज बन गया है।: नेता विपक्ष श्री @RahulGandhi 📍 अनंतनाग, जम्मू-कश्मीर pic.twitter.com/wUylZ7QSul— Congress (@INCIndia) September 4, 2024రాహుల్ వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలే చేశాడు. కాగా, జై షా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా షా కుమారుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్లో పాకిస్థాన్ మినహా అందరూ జై షాకు మద్దతు తెలిపారు. షా.. ఈ ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. భారత్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టబోయే ఐదో వ్యక్తి జై షా. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పని చేశారు. -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్‌గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
పాకిస్తాన్‌కు టీమిండియా రావాలి.. ఆ బాధ్యత అతడిదే: యూనిస్ ఖాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే తమ స్టేడియాల పునర్నిర్మాణ పనులను కూడా పీసీబీ ప్రారంభించింది. కాగా 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌కు ఆతిథ్యమివ్వనుంది.పాక్‌లో చివరగా 1996లో ఐసీసీ టోర్నీ(వన్డే వరల్డ్‌కప్) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని పీసీబీ ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఈవెంట్లో పాల్గోనేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. భారత్ ఆడే మ్యాచ్‌లను తాత్కాలిక వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఐసిసి ఛైర్మన్ జై షాపై పడింది.ఆ బాధ్యత అతడిదే..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే బాధ్యతను జైషా తీసుకోవాలని యూనిస్ సూచించాడు. "ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకంతో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వచ్చేవిధంగా జై షా చొరవ తీసుకోవాలి. అతడు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాక్ జట్టు కూడా ఆడేందుకు భారత్‌కు వస్తుంది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు పంపించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.చదవండి: మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా: సఫారీ బౌలర్ -
టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది: పాక్ మాజీ కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీపైనే భారం వేసిన పాక్ బోర్డుఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్‌గా నియమితుడు కావడంతో పాక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్ లతీఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు.సగం ప్రక్రియ పూర్తైంది‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది’’ అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సంచలనానికి తెరతీశాడు. కాగా 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్‌లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు తెరపడింది.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో మొదలై ఐసీసీ పీఠం దాకా..!
35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం నిన్ననే అధికారికంగా వెలువడింది. షా ఐసీసీ బాస్‌గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. షా ఐసీసీలో అత్యున్నత స్థానానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కాడు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. తాజాగా ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. షా ఐసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడు. షా ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.జై షా ప్రస్తానం..2009-2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్2013-2015 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ2015-2019 వరకు బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ2019-2024 వరకు బీసీసీఐ సెక్రెటరీ2024- ఐసీసీ చైర్మన్ -
ఐసీసీ పీఠంపై జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఎకగ్రీవమైంది. 35 ఏళ్లకే అత్యున్నత పదవీ బాధ్యతలు దక్కించుకున్న జై షా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ సభ్యదేశాలతో కలిసి క్రికెట్‌కు మరింత విస్తరించడానికి కృషి చేస్తా’అని జై షా పేర్కొన్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాను పలువరు అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, కుంబ్లే, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలిపారు. ముందున్న సవాళ్లు!ఈ ఏడాది చివర్లో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న జై షా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు రేకెత్తుతుండగా... ఈ అంశంలో జై షా ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది కీలకంగా మారింది. జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్‌ను హైబ్రిడ్ పద్ధతిలో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకలో జరిగే విధంగా షెడ్యూల్లో మార్పులు చేశారు. మరి ఇప్పుడు ఐసీసీ చైర్మన్‌గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ భాగం కావడంతో దానికి తగినంత ప్రచారం నిర్వహించడం... రోజు రోజుకు ప్రభ తగ్గుతున్న టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తేవడం... టి20ల ప్రభావంతో ప్రాధాన్యత కోల్పోతున్న వన్డేలను మరింత రసవత్తరంగా మార్చడం ఇలా పలు సవాళ్లు జై షాకు స్వాగతం పలుకుతున్నాయి. -
ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటన విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆగష్టు 20న ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే రెండు దఫాలుగా చైర్మన్‌గా వ్యవహరించిన గ్రెగ్ బార్క్లే.. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని జై షా భర్తీ చేశారు. ఐసీసీలోని మొత్తం పదహారు మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.సరికొత్త రికార్డుఇక నవంబరు 30న బార్క్లే పదవీకాలం ముగియనుండగా... ఆ మరుసటి రోజు జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల జై షా సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత పిన్న వయసులో ఐసీసీ బాస్‌గా నియమితులైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.కాగా జై షా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన త్వరలోనే బీసీసీఐ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం తనకు దక్కిన గొ ప్ప గౌరవం అని జై షా హర్షం వ్య క్తం చేశారు.జై షాకు హెచ్‌సీఏ శుభాకాంక్షలుఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు జగన్మోహన్ రావు శుభాకాంక్షలుతెలిపారు. జైషా నాయకత్వంలో ప్రపంచ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.చదవండి: లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!Jay Shah has been elected unopposed as the next Independent Chair of the ICC.https://t.co/Len6DO9xlE— ICC (@ICC) August 27, 2024 -
BCCI: బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడే!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కాబోయే చైర్మన్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ఈ పదవిని చేపడితే.. బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.తెర మీదకు కొత్త పేరుఇప్పటికే జై షా వారసులుగా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్లలో ఒకరు జై షా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేసులో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పోటీలో ఉన్నట్లు వార్తా సంస్థ దైనిక్ భాస్కర్ వెల్లడించింది. రోహన్ జైట్లీ మరెవరో కాదు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. రోహన్ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని.. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అతడిని చూడబోతున్నామంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.జై షా ఎన్నిక ఏకగ్రీవమే?మరోవైపు.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం. ఇక కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కాబట్టి.. కొత్తగా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా జై షా ఇంకో మూడు నెలల పాటు బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటిలోగా అతడి వారసుడి ఎంపిక పూర్తి చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
ఆ ముగ్గురి సహకారంతోనే టీ20 వరల్డ్‌కప్ గెలిచాం: రోహిత్
నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్‌కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.తన కెప్టెన్సీ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్‌గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఫంక్షన్లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. -
ఐసీసీ చైర్మన్ రేసులో జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ అటార్నీ అయిన బార్క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
అతడు జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు: జై షా
లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం, ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి మరింత సమయం పట్టనుంది. ఐపీఎల్-2024 సీజన్లో తన పేస్ బౌలింగ్‌తో మయాంక్ అందరని ఆకట్టుకున్నాడు. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్.. 6.99 ఏకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో అవకాశమివ్వాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అతడి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారింది. తరచుగా గాయాల బారిన పడుతుండటంతో మయాంక్ అరంగేట్రం ఎప్పడన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మయాంక్ డెబ్యూపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు. అతడి ఎంపికపై తను ఇప్పుడే ఏమి చెప్పలేను అని జైషా తెలిపాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు."మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే మయాంక్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.కానీ అతడొక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం అతడు ఏన్సీఎలో ఉన్నాడు. మా ఫిజియోల పర్యవేక్షణలో అతడు తన పునరావాసాన్ని కొనసాగిస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్‌గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్‌లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్‌ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్‌కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్‌లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్‌లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్‌కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్‌లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
రోహిత్, కోహ్లి అందుకే ఆడటం లేదు: జై షా
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా యువ క్రికెటర్లందరూ భాగం కాబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తదితరులతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా ఈ దులిప్ ట్రోఫీలో ఆడనున్నారు.ఇందుకు సంబంధించి ఏ,బి,సి,డి జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్లకు వరుసగా శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనకు ముందు.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారనే వార్తలు వినిపించాయి.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఈ నవతరం దిగ్గజాలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్, కోహ్లితో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ టోర్నీకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాత్రమే మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మినహాయింపు ఇవ్వడం గురించి చెబుతూ.. ‘‘వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇందుకు వారందరిని ప్రశంసించాలి. అంతేకాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇది హర్షించదగ్గ పరిణామం.ఇక రోహిత్, కోహ్లి వంటి మేటి ఆటగాళ్లను కూడా దులిప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబట్టడం సమంజసం కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని అంతర్జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరు. బోర్డులు కూడా వారిని ఆడమని బలవంతపెట్టవు. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి కదా!’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.ఇక బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా భారత్‌తో టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇంతవరకు మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారేమో చూడాలి. లేదంటే.. మేమే వాళ్లను సంప్రదిస్తాం. ఎందుకంటే టీమిండియాకు బంగ్లాదేశ్‌తో సిరీస్ అత్యంత ముఖ్యమైనది’’ అని జై షా బదులిచ్చారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలవాలంటే బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ తప్పనిసరి. ఈ రెండింటిలో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. -
గంభీర్ ప్లాన్: బౌలింగ్ కోచ్‌గా అతడే ఎందుకంటే?!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. టీమిండియా మాజీలను కాదనిఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.అతడి నైపుణ్యాల గురించి గంభీర్‌కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్‌గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్‌గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.మూడు దేశాలకు కోచ్‌గా... మోర్కెల్‌కు గంభీర్‌కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్రఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది.