
శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది.
శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు.
అస్సలు ఏం జరిగిందంటే?
వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్‌ఎల్‌సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు.
అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి.
శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్‌లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు.
చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్‌కు అంపైర్‌లు ఖారారు.. లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్
Comments
Please login to add a commentAdd a comment