Sri lanka Cricket board
-
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్‌కప్ తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్ తన హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్‌కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్‌గానూ పనిచేశాడు. ఇక ఫుల్‌టైమ్ హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్‌తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు..
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. లంక ప్రీమియర్ లీగ్-2024(ఎల్పీఎల్) సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అతడిపై వేటు వేసింది.లీగ్‌లో గాలె మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డిక్వెల్లాపై శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. డోపింగ్ పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు తెలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా డిక్‌వాలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో బయో-బబుల్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు డిక్‌వాలా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇక డిక్వెల్లా జాతీయ జట్టు తరఫున 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. -
IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్‌లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్‌లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్‌రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్‌లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా.. హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటుంది. -
శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట
శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్ 10న శ్రీలంక క్రికెట్ బోర్డుపై (ఎస్ఎల్సీ) నిషేధాన్ని విధించింది. లంక క్రికెట్ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్ జనరల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్ఎల్సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్‌కప్ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్ఎల్సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్‌కప్ 2024 సౌతాఫ్రికాకు తరలించబడింది. బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్‌ఎల్‌సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఆ దేశ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎస్ఎల్సీ జయసూర్యను ఓ సంవత్సరం పాటు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్‌గా నియమించింది. జయసూర్య ఎంపిక తక్షణమే అమలుల్లోకి వస్తుందని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 54 ఏళ్ల జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. 19956 వరల్డ్‌కప్ తర్వాత జయసూర్య కెరీర్ ఓ రేంజ్లో సాగింది. జయసూర్య.. సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్‌కు విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. కాగా, వన్డే వరల్డ్‌కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్ వివిధ కారణాల చేత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తాజాగా ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపిక కాగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్‌కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
శ్రీలంక క్రికెట్‌కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్‌ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు. అస్సలు ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్‌లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్‌కు అంపైర్లు ఖారారు.. లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్ -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్‌కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్‌కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్‌ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్‌కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..
దుబాయ్: శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది. భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు. అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్‌కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. -
WC 2023: టీమిండియా చేతిలో చావుదెబ్బ! బాధ్యులు మీరే.. బదులివ్వండి
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్టార్లు దూరం గాయాల కారణంగా కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు. టీమిండియా చేతిలో చావుదెబ్బ దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్‌లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by ICC (@icc) టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. మరో ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ‘సమిష్టి వైఫల్యం’ ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది. షాకింగ్ ఓటములు ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్ స్టాఫ్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు. బాధ్యులు మీరే.. బదులివ్వండి కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. View this post on Instagram A post shared by ICC (@icc) దృష్టి సారించండి ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్ టీమ్ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది. మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి? కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్‌కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్‌గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్‌వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
SL Vs Pak: లంకపై పాక్ విజయం! ప్రైజ్‌మనీ ఎంతంటే! సారీ చెప్పిన బోర్డు..
Sri Lanka vs Pakistan, 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ ఆజం బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాలే వేదికగా జూలై 16న మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సౌద్ షకీల్ సంచలన ఇన్నింగ్స్ ధనంజయ డి సిల్వ సెంచరీ(122) నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగలిగింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన పాకిస్తాన్ 461 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి ఆధిక్యం సాధించింది. సౌద్ షకీల్ అజేయ డబుల్ సెంచరీ(208) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆఖరి రోజు ఆటలో భాగంగా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సౌద్ షకీల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతో! ఈ నేపథ్యంలో ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా మ్యాచ్ విజేత పాకిస్తాన్‌కు ఇచ్చిన చెక్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయానంతరం చెక్ అందుకున్న పాక్ సారథి బాబర్ ఆజం ఫొటో చూసిన నెటిజన్లు అందులో ఉన్న తప్పును కనిపెట్టేశారు. అందులో ప్రైజ్‌మనీగా.. అక్షరాల్లో రెండు వేల యూఎస్ డాలర్లు అని రాసి ఉంది. అయితే, అంకెల్లో మాత్రం 5,000 యూఎస్ డాలర్లు అని ఉంది. క్షమించండి ఈ విషయంపై రచ్చ రచ్చ కాగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. తప్పిదానికి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొలి టెస్టు విజేతకు అందించిన ప్రెజెంటేషన్ చెక్‌లో దొర్లిన తప్పిదానికి చింతిస్తున్నాం. నిజానికి గ్రౌండ్ రైట్స్ హోల్డర్ దీనిని రూపొందించింది. ఏదేమైనా ఇందుకు శ్రీలంక క్రికెట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం’’అని బోర్డు తెలిపింది. కాగా జూలై 24 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రోజుకు 10 కోట్లు! కోహ్లి ఆర్జన వెనుక రోహిత్ శర్మ బావమరిది! సల్మాన్ ఖాన్‌తోనూ.. pic.twitter.com/YZ3CJozoOK — Out Of Context Cricket (@GemsOfCricket) July 20, 2023 -
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే -
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్‌గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్‌ను మీటింగ్‌లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఆసియా కప్‌లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో చర్చించి ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. నిజానికి రెండో రౌండ్లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్‌లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్‌ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్‌లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్‌లో జరిగితే తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్‌కప్ దృశ్యా ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
T20 world cup 2022: గుణతిలకకు బెయిల్ తిరస్కరణ
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో నిందితుడైన 31 ఏళ్ల క్రికెటర్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. తీవ్రమైన క్రిమినల్ నేరానికి పాల్పడిన అతనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని శ్రీలంక క్రీడాశాఖ ఆదేశించింది. ఆస్ట్రేలియా అధికారులకు సహకరిస్తామని ఎస్ఎల్సీ వర్గాలు తెలిపాయి. డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ ముందు వర్చువల్ (వీడియో కాల్) పద్ధతిలో గుణతిలకను ప్రవేశపెట్టారు. అతని తరఫున లాయర్ ఆనంద అమరనాథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీనిపై స్పందించిన లాయర్ ఆనంద అతిత్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు స్వదేశానికి బయల్దేరే ముందు గుణతిలకను అరెస్టు చేయడంతో అతను మినహా మొత్తం జట్టు లంకకు పయనమైంది. -
ఆస్ట్రేలియాలో అరెస్టైన లంక క్రికెటర్‌కు ఎదురుదెబ్బలు! కొత్తేం కాదు
ICC Mens T20 World Cup 2022- Danushka Gunathilaka: అత్యాచార కేసులో అరెస్టైన లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు శ్రీలంక బోర్డు షాకిచ్చిది. ఇకపై ఏ ఫార్మాట్లో కూడా క్రికెట్ ఆడే అవకాశం లేకుండా అతడిపై నిషేధం విధించింది. లంక బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆడేందుకు గుణతిలక ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు 31 ఏళ్ల గుణతిలకను ఆదివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. బెయిల్ నిరాకరణ ఈ ఘటన నేపథ్యంలో సోమవారం అతడిని సిడ్నీ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం గుణతిలకకు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో లంక బోర్డు సైతం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అతడిపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన అతడు దోషిగా తేలితే మరింత కఠినచర్యలు ఉంటాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆస్ట్రేలియా పోలీసులు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తామని, కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించింది. వివాదాస్పద క్రికెటర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుణతిలకకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అనుచిత ప్రవర్తన, సమాచారం ఇవ్వకుండా ట్రెయినింగ్ సెషన్‌కు గైర్హాజరు కావడంతో 2017లో 6 వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. 2018లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరు నెలలు నిషేధం ఎదుర్కొన్నాడు. కరోనా నేపథ్యంలో.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ నుంచి వచ్చి ఏడాది పాటు సస్పెండ్ అయ్యాడు. అయితే, తర్వాత నిషేధాన్ని ఆరు నెలలకు తగ్గించారు. చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! T20 WC 2022: టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..! -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ పేసర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఆసియాకప్‌లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్ మధుషాన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్-2022లో తొలుత క్వాలిఫియింగ్ రౌండ్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌కు లోబడి), లహిరు కుమార(ఫిట్‌నెస్‌కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్ స్టాండ్‌బై ఆటగాళ్లు: అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో Here's your 🇱🇰 squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2022 చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు' -
ఆసియా కప్ హీరోలకు ఘన స్వాగతం.. లంక వీధుల్లో విక్టరీ పెరేడ్
ఆసియా కప్-2022 విజేత శ్రీలంకకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఓ పక్క ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నప్పటికీ ద్వీప దేశ ప్రజలు తమ హీరోలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తమను గర్వంగా తలెత్తుకనేలా చేసిన హీరోలకు బాధలన్నీ దిగమింగి సుస్వాగతం చెప్పారు. కొలొంబోలోని బండారు నాయకే ఎయిర్ పోర్టు నుంచి ఓ రేంజ్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంక ఆటగాళ్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో విజయ దరహాసం చిందిస్తూ ప్రజలకు ఆభివాదం చేస్తున్న దృశ్యాలను లంక క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 📸 Snapshots from the #AsiaCup victory parade #RoaringForGlory pic.twitter.com/ZGIEov8OxL — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022 కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఆతర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్‌లపై వరుస విజయాలు సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అనంతరం తుది పోరులో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భానుక రాజపక్ష (71 నాటౌట్), హసరంగ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్, హసరంగ, కరుణరత్నే చెలరేగడంతో పాక్ 147 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని చవిచూసింది. -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్‌ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్‌ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్‌ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్‌ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్‌ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్‌లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్‌పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్‌ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
హసరంగకు షాకిచ్చిన శ్రీలంక బోర్డు! ఆ లీగ్‌లో ఆడొద్దు! ఎందుకంటే..
The Hundred 2022: ది హండ్రెడ్ లీగ్ సీజన్-2022లో ఆడాలనుకున్న శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగకు చుక్కెదురైంది. ఈ లీగ్‌లో ఆడేందుకు.. శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అతడికి అనుమతినివ్వలేదు. హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీంతో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ టోర్నీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌కు పోటీ అన్నట్లుగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. హండ్రెడ్ లీగ్(ఇన్నింగ్స్‌కు వంద బాల్స్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్ష పౌండ్లు! మొత్తం 8 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో దేశీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. ఇందులో భాగంగా వనిందు హసరంగను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీ లక్ష పౌండ్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తున్న మాంచెస్టర్ ఒరిజినల్స్ ఆగష్టు 5న నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. ఈ క్రమంలో హసరంగ వంటి కీలక ప్లేయర్ దూరం కావడం ఈ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే. కాగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో హసరంగ జట్టుకు దూరమవుతాడని మాంచెస్టర్ ముందే ఫిక్సయిపోయినా.. ఆ టోర్నీ వాయిదా పడటంతో ఊపిరి పీల్చుకుంది. ఆడటానికి వీల్లేదు.. కారణమిదే! ఈ నేపథ్యంలో హండ్రెడ్ లీగ్‌లో ఆడాలని వనిందు హసరంగ భావించగా.. శ్రీలంక బోర్డు అడ్డుచెప్పింది. ఈ విషయం గురించి ఎస్ఎల్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డి సిల్వ ఈఎస్పీన్క్రిక్ఇన్పోతో మాట్లాడుతూ.. ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. వరుసగా మెగా ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో హసరంగకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిపాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్, అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ది హండ్రెడ్ లీగ్ తాజా సీజన్ ఆగష్టు 3న ఆరంభమైంది. సెప్టెంబరు 3న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే... హసరంగ స్థానాన్ని మాంచెస్టర్ దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్‌తో భర్తీ చేసుకుంది. ఇక స్పిన్ మాస్ట్రో హసరంగ ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: వరల్డ్ నెం.1 బౌలర్‌గా ఎదుగుతాడు! ప్లీజ్ చేతన్ అతడిని సెలక్ట్ చేయవా!