కొలంబో: తనను అర్ధాంతరంగా శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు (రూ. 35 కోట్ల 89 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ జట్టు మాజీ కోచ్ చండిక హతురసింఘ శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం తాను మరో 18 నెలలు కోచ్ పదవిలో కొనసాగాల్సి ఉన్నా... శ్రీలంక క్రికెట్ బోర్డు తనను ముందుగానే తొలగించిందని... వారి చర్య తన కోచింగ్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని గతంలో శ్రీలంక తరఫున 26 టెస్టుల్లో, 35 వన్డేల్లో ఆడిన 51 ఏళ్ల హతురసింఘ తన లేఖలో పేర్కొన్నారు.
అయితే శ్రీలంక క్రికెట్ మాత్రం ఆరు నెలల వేతనాన్ని పరిహారం రూపంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకానొక సందర్భంలో హతురసింఘకు చెల్లిస్తున్న జీతంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో విస్మయం వ్యక్తం చేశారు. ‘నెలకు 60 వేల డాలర్లు జీతంగా తీసుకుంటున్న హతురసింఘ... జట్టును విజయపథంలో మాత్రం నడిపించలేకపోతున్నారు’ అంటూ చండికను ఫెర్నాండో విమర్శించాడు. 2019 ప్రపంచ కప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు దారుణ వైఫల్యం అనంతరం ఆ దేశ క్రికెట్ బోర్డు కోచ్ హతురసింఘను, ఆయన శిక్షణ సహాయక సిబ్బందిని తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment