సనత్‌ జయసూర్యకు కీలక బాధ్యతలు | Sri Lanka Cricket Board Has Appointed Sanath Jayasuriya As Cricket Consultant | Sakshi
Sakshi News home page

సనత్‌ జయసూర్యకు కీలక బాధ్యతలు

Dec 14 2023 7:58 PM | Updated on Dec 14 2023 8:13 PM

Sri Lanka Cricket Board Has Appointed Sanath Jayasuriya As Cricket Consultant - Sakshi

శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఆ దేశ దిగ్గజ ఆటగాడు సనత్‌ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎస్‌ఎల్‌సీ జయసూర్యను ఓ సంవత్సరం పాటు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్‌గా నియమించింది. జయసూర్య ఎంపిక తక్షణమే అమలుల్లోకి వస్తుందని లంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 54 ఏళ్ల జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్‌ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. 19956 వరల్డ్‌కప్‌ తర్వాత జయసూర్య కెరీర్‌ ఓ రేంజ్‌లో సాగింది. జయసూర్య.. సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్‌కు విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. 

కాగా, వన్డే వరల్డ్‌కప్‌ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్‌ వివిధ కారణాల చేత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తాజాగా ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్‌ కమిటీని ​నియమించారు. ఈ కమిటీకి మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపిక కాగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement