కొలొంబో: భారత్‌తో కీలకమైన వన్డే, టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో.. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment