మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్ ఇలా..
తొలి టీ20- జులై 27
రెండో టీ20- జులై 28
మూడో టీ20- జులై 30
తొలి వన్డే- ఆగస్ట్ 2
రెండో వన్డే- ఆగస్ట్ 4
మూడో వన్డే- ఆగస్ట్ 7
ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.
తొలి టీ20- జులై 6
రెండో టీ20- జులై 7
మూడో టీ20- జులై 10
నాలుగో టీ20- జులై 13
ఐదో టీ20- జులై 14
జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.
Comments
Please login to add a commentAdd a comment