india tour of srilanka
-
శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే..!
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్ ఇలా..తొలి టీ20- జులై 27రెండో టీ20- జులై 28మూడో టీ20- జులై 30తొలి వన్డే- ఆగస్ట్ 2రెండో వన్డే- ఆగస్ట్ 4మూడో వన్డే- ఆగస్ట్ 7ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.తొలి టీ20- జులై 6రెండో టీ20- జులై 7మూడో టీ20- జులై 10నాలుగో టీ20- జులై 13ఐదో టీ20- జులై 14జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే. -
హార్ధిక్ పాండ్యా పనైపోయింది.. ఆ ఇద్దరికి అవకాశాలివ్వండి..!
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న హార్ధిక్‌ను సన్నీ ఏకి పారేశాడు. కెరీర్ ఆరంభంలో బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయిన హార్ధిక్లో ఇప్పుడు ఆ జోరు కనపడటం లేదని, ఫిట్నెస్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. ఇక హార్ధిక్ పనైపోయిందని, అతని స్థానాన్ని దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్‌లతో రీప్లేస్ చేయాలని సూచించాడు. చాహర్, భువీలకు తగినన్ని అవకాశాలిచ్చి వారిని మేటి ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని బీసీసీఐని అభ్యర్ధించాడు. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్ రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను చాహర్, భువీ అద్భుతమైన బ్యాటింగ్‌తో గట్టెక్కించారని, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్స్‌లా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ 82 బంతుల్లో సిక్స్, 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేయగా, భువీ.. 28 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు స్కోర్ చేశారని, అంతకుముందు బౌలింగ్‌లోనూ వీరిద్దరూ రాణించారని కితాబునిచ్చాడు. కేవలం ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగానే వీరికి మద్దతు తెలపడం లేదని, గతంలో వీరి ఆల్‌రౌండ్ ప్రదర్శనలను బేరీజు వేసుకునే ఈ నిర్ణయానికొచ్చానని, తన అభిప్రాయాన్ని సమర్ధించుకున్నాడు. -
IND Vs SL 3rd ODI: చివరి వన్డేలో శ్రీలంక విజయం
శ్రీలంక విజయం కొలంబో వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై శ్రీలంక జట్టు విజయం సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టులో అవిష్క ఫెర్నాండో 98 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 35 ఓవర్లు 211/5 35 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు విజయం 72 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వా(2) ఔట్ అరంగేట్రం బౌలర్ చేతన్ సకారియా వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ధనంజయ డిసిల్వా(9 బంతుల్లో 2)ను కాట్ అండ్ బౌల్డ్‌గా ఔట్ చేశాడు. 25 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 151/3. లంక గెలవాలంటే 22 ఓవర్లలో 76 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఫెర్నాండో(60), అసలంక(0) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. రాజపక్సే(65) ఔట్ చేతన్ సకారియా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ క్యాచ్ అందుకోవడంతో రాజపక్సే(56 బంతుల్లో 65; 12 ఫోర్లు) వెనుదిరిగాడు. అంతకుముందు బంతికే నితీశ్ రాణా క్యాచ్ డ్రాప్ చేయడంతో లైఫ్ వచ్చినప్పటికీ.. రాజపక్సే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 23 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 144/2. క్రీజ్‌లో ఫెర్నాండో(57), ధనంజయ డిసిల్వా(0) ఉన్నారు. లంక గెలవాలంటే 24 ఓవర్లలో 83 పరగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండటంతో లంక గెలుపు నల్లేరుపై నడకే. రాజపక్సే ఫిఫ్టి.. గెలుపు దిశగా లంకేయులు వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే కెరీర్లో తొలి అర్ధశతకం సాధించాడు. అతను 42 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 20 ఓవర్ల తర్వాత లంక స్కోర్127/1. లంక గెలుపునకు మరో 99 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో రాజపక్సేకు తోడుగా ఫెర్నాండో(55) ఉన్నాడు. నిలకడగా ఆడుతున్న లంక ప్లేయర్లు.. హాఫ్ సెంచరీ చేసిన ఫెర్నాండో ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 6 రన్‌రేట్ తగ్గకుండా లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ క్రమంలో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(53 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్) కెరీర్లో ఐదో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్సే(32 బంతుల్లో 33; 6 ఫోర్లు) సైతం బంతికో పరుగు చొప్పున రాబడుతూ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోర్ 104/1గా ఉంది. లంక తొలి వికెట్ డౌన్.. భానుక(7) ఔట్ 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ భానుక(17 బంతుల్లో 7; ఫోర్)ను కృష్ణప్ప గౌతమ్ బోల్తా కొట్టించాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో స్క్వేర్ లెగ్‌లో ఉన్న సకారియాకు క్యాచ్ అందించి భానుక వెనుదిరిగాడు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 35/1. క్రీజ్‌లో రాజపక్సే(0), అవిష్క ఫెర్నాండో(17 బంతుల్లో 21) ఉన్నారు. 225 పరుగులకు టీమిండియా ఆలౌట్.. లంక టార్గెట్ 226 చమీరా బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండో క్యాచ్ అందుకోవడంతో నవ్‌దీప్ సైనీ(36 బంతుల్లో 15) ఔటయ్యాడు. దీంతో టీమిండియా 43.1 ఓవర్లో 225 పరగులకు ఆలౌటైంది. సకారియా(0) నాటౌట్‌గా మిగిలాడు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ, జయవిక్రమ తలో మూడు వికెట్లు.. చమీరా రెండు వికెట్లు.. షనక, కరుణరత్నే చెరో వికెట్ పడగొట్టారు. రాహుల్ చాహర్ ఔట్(13).. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా కరుణరత్నే బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి రాహుల్ చాహర్(25 బంతుల్లో 13) వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 225/9. క్రీజ్‌లో సైనీ(15), సకారియా(0) ఉన్నారు. కష్టాల్లో టీమిండియా.. ఐదు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు డౌన్ 33వ ఓవర్లో స్పిన్నర్ అఖిల ధనంజయ టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులిచ్చిన అతను.. కీలకమైన నితీశ్ రాణా(14 బంతుల్లో 7), కృష్ణప్ప గౌతమ్(3 బంతుల్లో 2) వికెట్లు పడగొట్టాడు. తొలుత కృష్ణప్ప గౌతమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను.. ఆతరువాత నితీశ రాణాను ఔట్ చేశాడు. వికెట్ కీపర్ భానుక క్యాచ్ అందుకోవడంతో రాణా వెనుదిరగక తప్పలేదు. దీంతో 33 ఓవర్లకే టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ చాహర్(1) నవ్‌దీప్ సైనీ(0) ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్(40) ఔట్ నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 40; 7 ఫోర్లు) ధనంజయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత ధనంజయ అపీల్‌కు ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా, శ్రీలంక జట్టు రివ్యూ కోరింది. ఇందులో సూర్యకుమార్ ఔటైనట్లు రుజువు కావడంతో అతను వెనుదిరగాల్సి వచ్చింది. 31 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 190/6. క్రీజ్‌లో నితీశ్ రాణా(5), కృష్ణప్ప గౌతమ్(0) ఉన్నారు. మరోసారి నిరాశపరిచిన హార్ధిక్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా(11 బంతుల్లో 19; 3 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. కీలక సమయంలో భారీ స్కోర్ సాధిస్తాడని ఆశించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. జయవిక్రమ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటై ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 29 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 184/5. క్రీజ్‌లో సూర్యకుమార్ (38), నితీశ్ రాణా(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. మనీశ్ పాండే(11) ఔట్ వరుణుడు శాంతించడంతో మ్యాచ్ తిరిగి ఫ్రారంభంమైంది. రెయిన్ బ్రేక్ తర్వాత రెండో ఓవర్లోనే మనీశ్ పాండే(19 బంతుల్లో 11) పెవిలియన్ బాట పట్టాడు. జయవిక్రమ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 158/4. క్రీజ్‌లో సూర్యకుమార్(24 బంతుల్లో 31; 6 ఫోర్లు), హార్ధిక్ పాండ్యా(1) ఉన్నారు. శాంతించిన వరుణుడి.. మ్యాచ్ పునఃప్రారంభం, 47 ఓవర్లకు కుదింపు వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ పునఃప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం 6:30PMకు మ్యాచ్ మొదలుకానుంది. అయితే మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా స్కోర్ 23 ఓవర్లలో 147/3గా ఉంది. క్రీజ్‌లో మనీశ్ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్ యాదవ్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) ఉన్నారు. వరుణుడి ఆటంకం, 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 147/3 టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు మనీశ్ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్ యాదవ్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న సందర్భంలో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. చినుకులతో మొదలై క్రమంగా పెద్ద వర్షంగా మారడంతో రిఫరి మ్యాచ్‌ను నిలిపివేశాడు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంక బౌలర్లలో శనక, జయవిక్రమ, చమీర తలో వికెట్ పడగొట్టారు. సామ్సన్(46) ఔట్, 19 ఓవర్ల తర్వాత 120/3 16 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 102 పరుగుల వద్ద పృథ్వీ షా(49) వికెట్‌ను కోల్పోయిన భారత్.. 118 పరుగుల వద్ద అరంగేట్రం ఆటగాడు సామ్సన్(46 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. ఇద్దరు సెట్ బ్యాట్స్‌మెన్ ఇంత తక్కువ పరుగలు వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడినట్లైంది. జయవిక్రమ బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండోకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి సామ్సన్ పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 120/3. క్రీజ్‌లో మనీశ్ పాండే(4), సూర్యకుమార్ యాదవ్(1) ఉన్నారు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న పృథీ షా టీమిండియా ఓపెనర్ పృథీ షా(49 బంతుల్లో 49; 8 ఫోర్లు).. తన తొలి వన్డే హాఫ్ సెంచరీ కోసం మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి స్టార్ట్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన షా.. ఈ మ్యాచ్‌లో జాగ్రత్తగానే ఆడినా కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. లంక కెప్టెన్ శనక బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 102/2. క్రీజ్‌లో సామ్సన్(35 బంతుల్లో 33, 3 ఫోర్లు, సిక్స్), మనీశ్ పాండే ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. ధవన్(13) ఔట్ రెండో ఓవర్లో ధనంజయ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాది జోరును కనబర్చిన టీమిండియా కెప్టెన్ ధవన్(11 బంతుల్లో 13; 3 ఫోర్లు).. ఆ జోరును ఎంతో సేపు కొనసాగించలేకపోయాడు. మూడో ఓవర్లో చమీరా బౌలింగ్‌లో భానుకకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా మరో ఓపెనర్ పృథ్వీషా(4 బంతుల్లో 10; 2 ఫోర్లు) సైతం దూకుడుగానే ఆడుతున్నాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 29/1గా ఉంది. ధవన్ స్థానంలో క్రీజ్‌లోకి సంజూ సామ్సన్ వచ్చాడు. కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగుతున్న ధవన్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు లంక కూడా నామమాత్రపు మ్యాచ్ కావడంతో మూడు మార్పులతో బరిలోకి దిగింది. భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ రాణా, హార్దిక్ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్ జయవిక్రమ -
దీపక్ చహర్ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం
కొలంబో: దీపక్ చహర్ అద్భుతం చేశాడు. ఒంటిచేత్తో టీమిండియాకు పరాభవాన్ని తప్పించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట నేనున్నానంటూ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. భారత్‌కు బ్రేక్ ఇచ్చిన చహల్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (42 బంతుల్లో 36; 6 ఫోర్లు) మరోసారి శుభారంభం చేశారు. ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున సాధించారు. ఈ క్రమంలో కొన్ని చూడచక్కని బౌండరీలు సాధించారు. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 59/0గా నిలిచింది. భారత్‌కు చహల్ బ్రేక్ ఇచ్చాడు. 14వ ఓవర్ వేసిన అతను వరుస బంతుల్లో మినోద్, రాజపక్స (0)లను అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన అవిష్క ఫెర్నాండోను భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు సాధించడంతో శ్రీలంక 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 195/6 గా నిలిచింది. ఈ దశలో క్రీజులో ఉన్న అసలంక, కరుణరత్నే దూకుడుగా ఆడారు. ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. పేలవ ఆరంభం ఛేజింగ్‌ను భారత్ పేలవంగా ఆరంభించింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్ కిషన్ (1), శిఖర్ ధావన్ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్ తీసుకున్నారు. అయితే మనీశ్ పాండేను (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) దురదృష్టం వెంటాడింది. షనక బౌలింగ్‌లో సూర్యకుమార్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడగా... బంతి బౌలర్ చేతిని తాకుతూ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లోని వికెట్లను గిరాటేసింది. అదే సమయంలో పరుగు కోసం పాండే క్రీజును వదిలి ముందుకు రావడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో హార్దిక్ (0) కూడా అవుటవ్వడంతో భారత్ 116 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో సూర్యకుమార్, కృనాల్ ఉండటంతో భారత్ గెలుపుపై ధీమాగానే కనిపించింది. సందకన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన సూర్య వన్డేల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీగా వెనుదిరగాడు. కాసేపటికే కృనాల్ (35; 3 ఫోర్లు) హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. దీపక్ వీరోచిత పోరాటం ఎనిమిదో నంబర్లో వచ్చిన దీపక్ తనలోని బ్యాట్స్‌మన్‌ను పరిచయం చేశాడు. కృనాల్ ఉన్నంతసేపు డిఫెన్స్ ఆడిన దీపక్... అతను అవుటయ్యాక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. భువనేశ్వర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) సాయంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. సందకన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన దీపక్... ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమం లో 64 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కండరాలు పట్టేయడంతో చికిత్స తీసుకున్న దీపక్ నొప్పిని భరిస్తూనే ఫోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అజేయమైన 8వ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి దీపక్ 84 పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 50; భానుక (సి) మనీశ్ (బి) చహల్ 36; రాజపక్స (సి) ఇషాన్ కిషన్ (బి) చహల్ 0; ధనంజయ (సి) ధావన్ (బి) చహర్ 32; చరిత్ అసలంక (సి) (సబ్) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 65; షనక (బి) చహల్ 16; హసరంగ (బి) చహర్ 8; కరుణరత్నే (నాటౌట్) 44; చమీర (సి) (సబ్) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 2; సందకన్ (రనౌట్) 0; కసున్ రజిత (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 275. వికెట్ల పతనం: 1–77, 2–77, 3–124, 4–134, 5–172, 6–194, 7–244, 8–264, 9–266. బౌలింగ్: భువనేశ్వర్ 10–0– 54–3, దీపక్ చహర్ 8–0–53–2, హార్దిక్ 4–0–20–0, చహల్ 10–1–50–3, కుల్దీప్ 10–0–55–1, కృనాల్ 8–0–37–0. భారత ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) హసరంగ 13; ధావన్ (ఎల్బీ) (బి) హసరంగ 29; ఇషాన్ (బి) రజిత 1; పాండే (రనౌట్) 37; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) సందకన్ 53; హార్దిక్ (సి) ధనంజయ (బి) షనక 0; కృనాల్ (బి) హసరంగ 35; దీపక్ చహర్ (నాటౌట్) 69; భువనేశ్వర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో 7 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–28, 2–39, 3–65, 4–115, 5–116, 6–160, 7–193. బౌలింగ్: రజిత 7.1–0–53–1, చమీర 10–0–65–0, హసరంగ 10–0–37–3, సందకన్ 10–0–71–1, కరుణరత్నే 6–1–26–0, షనక 3–0–10–1, ధనంజయ 3–0–10–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చాహర్ ఒంటరి పోరాటం.. భారత్ ఘన విజయం
► చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ అండతో దీపక్ చాహర్ ఒంటరి పోరాటం చేసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో దీపక్ చాహర్ 82 బంతుల్లో 69 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు జట్టుకు విజయాన్నందించాడు. ► 45 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 245/7గా ఉంది. దీపక్ చాహర్ 51, భువనేశ్వర్ కుమార్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►దీపక్ చాహర్ 64 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. భారత్ విజయతీరాలకు చేరడానికి 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కృనాల్(35) క్లీన్‌బౌల్డ్ టీమిండియా తరఫున అఖరి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కృనాల్ పాండ్యా(54 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా ఔటయ్యాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో కృనాల్ క్లీన్ బౌల్డయ్యాడు. 35.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 193/6. భారత్ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో చాహర్(9), భువనేశ్వర్ కుమార్(0) ఉన్నారు. ఓటమి దిశగా టీమిండియా, సూర్యకుమార్ యాదవ్(53) ఔట్ టీమిండియాకు ఆఖరి ఆశాకిరణంలా ఉన్న సూర్యకుమార్ యాదవ్(44 బంతుల్లో 53; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగానే పెవిలియన్ బాటపట్టాడు. సందకన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 160/6. క్రీజ్‌లో కృనాల్(19), చాహర్(0) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా లంక కెప్టెన్ శనక వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి మనీశ్ పాండే రనౌట్ కాగా, అదే ఓవర్లో ఆఖరి బంతికి హార్ధిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందే హార్ధిక్‌కు లైఫ్ లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిడ్ వికెట్లో ఉన్న డిసిల్వాకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 116/5. క్రీజ్‌లో సూర్యకుమార్(30), కృనాల్ పాండ్యా(0) ఉన్నారు. మనీశ్ పాండే(37) రనౌట్.. టీమిండియా నాలుగో వికెట్ డౌన్ మనీశ్ పాండే(31 బంతుల్లో 37; 3 ఫోర్లు)ను దురదృష్టం వెంటాడింది. లంక కెప్టెన్ శనక బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రయిక్ ఎండ్ ఉన్న మనీశ్.. క్రీజ్ వదిలి ముందుకు రావడం, స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ శనక చేతులను తాకుతూ వికెట్లకు తగలడంతో మనీశ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 17.2 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్(30), హార్దిక్(0) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్.. ధవన్(29) ఔట్ శ్రీలంక లెగ్ బ్రేక్ బౌలర్ వనిందు హసరంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా కెప్టెన్ ధవన్(38 బంతుల్లో 29; 6 ఫోర్లు)ను ఎల్బీడబ్యూగా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు మూడు ఓవర్లు వేసిన హసరంగ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన(షా, ధవన్) వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/3. క్రీజ్‌లో మనీశ్ పాండే(17), సూర్యకుమార్ యాదవ్(0) ఉన్నారు. ఇషాన్ కిషన్(1) క్లీన్ బౌల్డ్, 5 ఓవర్ల తర్వాత 39/2 11 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. తొలుత 28 పరుగుల వద్ద పృథ్వీ షా పెవిలియన్‌కు చేరగా, 5వ ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రజిత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధవన్(22)కు తోడుగా మనీవ్ పాండే(0) ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. పృథీ షా(13) ఔట్ హ్యాట్రిక్ ఫోర్లు సాధించి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా(11 బంతుల్లో 13; 3 ఫోర్లు).. హసరంగా వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో ధవన్(7 బంతుల్లో 13; 3 ఫోర్లు), ఇషాన్ కిషన్(0) ఉన్నారు. తొలి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన షా.. శ్రీలంక బౌలర్ కసున్ రజిత వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పృథ్వీషా(6 బంతుల్లో 12; 3 ఫోర్లు) చెలరేగిపోయాడు. ఆఖరి మూడు బంతులను బౌండరీలకు తరలించాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 276 భువీ వేసిన ఆఖరి ఓవర్లో మూడో బంతికి సందకన్(0) రనౌట్ కాగా, చివరి రెండు బంతులను కరణరత్నే(33 బంతుల్లో 44; 5 ఫోర్లు) బౌండరీలకు తరలించడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. కరుణరత్నే అఖరి వరకు క్రీజ్‌లో ఉండి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్ తలో మూడు వికెట్లు, చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు. సేమ్ సీన్ రిపీట్.. చమీరా(2) ఔట్ అంతకుముందు ఓవర్లో అసలంకను ఎలా ఔట్ చేశాడో అచ్చం అలానే మరో స్లో లెంగ్త్ ఆఫ్ కట్టర్ బంతిని సంధించి చమీరా(5 బంతుల్లో 2)ను పెవిలియన్‌కు పంపాడు భువీ. పడిక్కల్ డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ అందుకోవడంతో చమీరా పెవిలియన్ బాట పట్టాడు. 49.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 264/8. క్రీజ్‌లో కరుణరత్నే(35), సందకన్(0) ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అసలంక(65) ఔట్ భువీ వేసిన స్లో లెంగ్త్ ఆఫ్ కట్టర్ బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అసలంక(68 బంతుల్లో 65; 6 ఫోర్లు) ఔటయ్యాడు. సబ్ ఫీల్డర్ పడిక్కల్ డీప్ మిడ్ వికెట్లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. 48 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 252/7. క్రీజ్‌లో కరుణరత్నే(25), చమీరా(1) ఉన్నారు. చాహర్ యార్కర్.. హసరంగ(8) క్లీన్ బౌల్డ్ మూడో స్పెల్ తొలి బంతికే దీపక్ చాహర్ అదరగొట్టాడు. అద్భుతమైన యార్కర్‌తో హసరంగ(11 బంతుల్లో 8; ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 39.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 194/6గా ఉంది. క్రీజ్‌లో అసలంక(43 బంతుల్లో 34), కరుణరత్నే(0) ఉన్నారు. భారత బౌలర్లలో చహల్ 3, చాహర్ 2, భువీ ఓ వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక..శనక(16) క్లీన్ బౌల్డ్ తొలి వన్డేలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చహల్ రెండో వన్డేలో రెచ్చిపోతున్నాడు. తొలి స్పెల్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో స్పెల్‌లోనూ మ్యాజిక్ చేశాడు. లంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శనక(24 బంతుల్లో 16; ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 36 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 178/5. క్రీజ్‌లో అసలంక(34 బంతుల్లో 29), వహిందు హసరంగ(1) ఉన్నారు. డిసిల్వా(32) ఔట్.. 28 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 137/4 దీపక్ చాహర్ వేసిన నకుల్ బంతికి ధనుంజయ డిసిల్వా(45 బంతుల్లో 32; ఫోర్) చిక్కాడు. మిడాఫ్ దిశగా ఆడే క్రమంలో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 28 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 137/4గా ఉంది. క్రీజ్‌లో చరిత్ అసలంక(5), దసున్ శనక(1) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో చహల్ 2, భువీ, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అవిష్క ఫెర్నాండో(50) ఔట్ హాఫ్ సెంచరీ సాధించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(71 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్)ను టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో ఫెర్నాండో.. మిడాన్‌లో ఉన్న కృనాల్ పాండ్యా చేతికి క్యాచ్ అందించి వెనుదిరిగాడు. 25 ఓవర్ల తర్వాత లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(38 బంతుల్లో 26), అసలంక(0) ఉన్నారు. చహల్ మాయాజాలం.. వరుస బంతుల్లో రెండు వికెట్లు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మాయ చేశాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులిచ్చిన చహల్.. ఆతరువాత వరుస బంతుల్లో భానుక(42 బంతుల్లో 36; 6 ఫోర్లు), రాజపక్సా(0)లను పెవిలియన్‌కు పంపాడు. భానుక క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్లో మనీశ్ పాండే అందుకోగా, రాజపక్సా.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13.3 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 77/2. క్రీజ్‌లో ధనుంజయ డిసిల్వా(0), అవిష్క ఫెర్నాండో(41 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నారు. ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. భానుక(23 బంతుల్లో 26; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో(27 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరి ధాటికి 7.4 ఓవర్లలోనే లంక స్కోర్ 50 పరుగులు దాటింది. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 53/0. కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ధవన్ సేన ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, లంక జట్టు ఓ మార్పు చేసింది. ఉదాన స్థానంలో కసున్ రజిత బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే ఆతిధ్య లంక జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా, టీమిండియా మరో విజయంపై ధీమాగా ఉంది. టీమిండియా తుదిజట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక తుదిజట్టు: షనక(కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భానుక రాజపక్సా, మినోద్ భానుకా, దనంజయ డిసిల్వా, చరిత్ ఆసలంకా, వినిందు హసరంగా, చమికా కరుణరత్నే, కసున్ రజిత, దుస్మంతా చమీరా, లక్షణ్ షన్‌దాకన్ -
దారి మళ్లిన లంకేయుల విమానం.. భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయానిస్తున్న ప్రత్యేక విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన లంక జట్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారు ప్రయానిస్తున్న విమానాన్ని ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్‌లో ల్యాండ్ కాగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ పేర్కొన్నారు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని లంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. ఈ క్రమంలోనే వారు ప్రయానిస్తున్న విమానం అనూహ్యంగా భారత్‌లో ల్యాండైంది. ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. -
లంక క్రికెట్లో పెను సంక్షోభం.. రిటైర్మెంట్ యోచనలో స్టార్ క్రికెటర్
కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాశించిన శ్రీలంక క్రికెట్ జటు,ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు జట్టు పూర్తి బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల విభేదాలు.. శ్రీలంక క్రికెట్‌ను కష్టాల్లోకి నెట్టాయి. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు నో అంటున్నారన్న వార్తల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజలో మాథ్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్త సంచలనంగా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని అతను శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, వన్డేలు, టీ20ల నుంచి తనను తప్పించడంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు ఛాన్సిచ్చే పేరుతో లంక సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. అయితే దశాబ్ద కాలంగా శ్రీలంక క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న చాలా తక్కువ మంది క్రికెటర్లలో మాథ్యూస్ ఒకడు. 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని సగటు 63 కాగా, 2018లో 52గా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో లంక జట్టు తరఫున బెస్ట్ బ్యాట్స్‌మన్ కూడా అతడే. అయితే తాజాగా లంక బోర్డు కాంట్రాక్ట్‌ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ప్లేయర్స్‌కు నాయకత్వం వహించిన మాథ్యూస్.. అనూహ్యంగా కాంట్రాక్ట్‌పై సంతకం చేయడానికి అంగీకరించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మాథ్యూస్ లంక తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మొత్తం 13,219 పరుగులు, 218 వికెట్లు పడగొట్టాడు. -
మనీశ్ పాండే పోరాటం వృధా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భువీ సేన విజయం
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకొని, తాజాగా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ల నేతృత్వంలో రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్ ఆడుతున్నారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ధవన్ జట్టు.. అద్భుతంగా రాణించి, నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. High Energy ⚡️ Full🔛 Intensity 💪 A productive day in the field for #TeamIndia during their T20 intra squad game in Colombo 👌 👌#SLvIND pic.twitter.com/YLbUYyTAkf — BCCI (@BCCI) July 5, 2021 The recap with a twist 🔀 Paras Mhambrey takes the 9⃣0⃣-seconds match-rewind ⏪ challenge 😎 😎 Watch NOW ⌛️ 🎥#TeamIndia #SLvIND pic.twitter.com/UTpRH0V9ug — BCCI (@BCCI) July 5, 2021 మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే(45 బంతుల్లో 63) అర్ధశతకంతో రాణించగా, రుతురాజ్ గైక్వాడ్, ధవన్ పర్వాలేదనిపించారు. ప్రత్యర్ధి కెప్టెన్ భువనేశ్వర్ కుమార్(2/23) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, పడిక్కల్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భువీ సేన 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని అద్భుత విజయం సాధించింది. ఇదిలా ఉంటే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో లంకకు బయల్దేరిన టీమిండియా.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 13న జరుగనుంది. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమ్రన్ జీత్ సింగ్ -
అది టీమిండియా- బీ జట్టు కాదు.. మాజీ కెప్టెన్‌కు బోర్డు కౌంటర్!
కొలంబో: మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు సెకండ్ టీం కాదని, అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది మీడియాలో తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వారందరికీ ఇదే సమాధానం. శ్రీలంక టూర్‌కు వచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో పటిష్టమైనది. భారత బృందంలోని ప్రస్తుత 20 మందిలో 14 మంది సభ్యులు ఇప్పటికే టీమిండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్లో, మరికొందరు అన్ని ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఇది ద్వితీయ శ్రేణి జట్టుకాదు’’ అని పరోక్షంగా అర్జున రణతుంగకు కౌంటర్ ఇచ్చింది. అదే విధంగా... ఒకేసారి కోహ్లి, ధావన్ సారథ్యంలోని భారత జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై స్పందిస్తూ... ‘‘క్రికెట్ ప్రపంచంలో ఇదొక సరికొత్త విధానం. ముఖ్యంగా ఐసీసీ సభ్య దేశాలు... తమ అవసరాలకు అనుగుణంగా ఒక్కో ఫార్మాట్‌కు ప్రత్యేక స్వ్యాడ్తో ఆడించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల పోటీతత్వం పెరగడంతో పాటుగా, ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం... వివిధ బోర్డులు తమ మాటను నెరవేర్చుకునే వీలు కలుగుతుంది’’ అని శ్రీలంక క్రికెట్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా శ్రీలంక పర్యటనకు టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని అర్జున రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు మతి లేదని విరుచుకుపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూలై 13 నుంచి భారత్- శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. -
లంక క్రికెట్లో కుదుపు.. కాంట్రాక్ట్‌కు నో చెప్పిన ఐదుగురు క్రికెటర్లు
కొలొంబో: భారత్‌తో కీలకమైన వన్డే, టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. -
ఇండియా బి టీమ్ రావడం శ్రీలంక క్రికెట్‌కు ఘోర అవమానం..
కొలంబో: శ్రీలంక పర్యటనకు భారత్.. బి జట్టును పంపిచడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు అస్సలు బుద్ది లేదని ఆయన మండిపడ్డాడు. టెలివిజన్ మార్కెటింగ్‌లో భాగంగానే ఈ సిరీస్‌కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని ఆరోపించాడు. తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లంక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్.. తమ బలమైన జట్టును ఇంగ్లండ్‌కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించిందని విమర్శించాడు. బీసీసీఐ ఇలా వ్యవహరించడానకి తమ దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణమని ధ్వజమెత్తాడు. లంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్‌లో లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, ఆటతీరు కూడా దారుణంగా ఉందని ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక జట్టు 1996 వన్డే ప్రపంచ కప్ సాధించింది. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ సారథ్యంలో యువ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక పర్యటనకు వెళ్లింది. జూలై 13 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా -
మాట మార్చిన ద్రవిడ్.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..!
ముంబై: జులై 13 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నిమిత్తం భారత బి జట్టు హెడ్ కోచ్‌గా నియమించబడిన భారత దిగ్గజ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. రోజుల వ్యవధిలో మాటమార్చాడు. తాను అండర్ 19 జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో జట్టుకు ఎంపికైన ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించానని, రాబోయే శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల(మూడు వన్డేలు, మూడు టీ20లు) లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్మెంట్ పరిధిలోని విషయమని, తమకు కావాల్సిన జట్టును వారు ఎంపిక చేసుకుంటారని ఆయన వివరించాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని, అయితే వారు సిరీస్ గెలవడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ బెర్తు కోసం అందరూ పోటీపడవచ్చంటూనే, అవకాశం వచ్చిన వాళ్లు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!
బెంగళూరు: అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ సానుభూతిని వ్యక్తం చేశాడు. మనీష్‌కు తగినన్ని అవకాశాలివ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తోక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరు క్రికెటర్లకులా మనీష్‌కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే, ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్, వేగం కలబోసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలో నిలిచిన పాండే 73 బంతుల్లోనే 114 సూపర్ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందాడు. ఆతర్వాత 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్‌కు ఆతర్వాత అవకాశాలు పలచబడ్డాయి. కాగా, మనీష్ ఇప్పటివరకు 26 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 492 పరుగులు చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాల సాయంతో 709 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మనీష్‌కు ఐపీఎల్లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్లో 151 మ్యాచ్‌ల్లో శతకం, 20 అర్ధశతకాలతో సాయంతో 3461 పరుగులు చేశాడు. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను..
న్యూఢిల్లీ: ఓ సిరీస్‌కు ఎంపికై ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, భారత బి జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. చిన్నప్పుడు తనకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని, అందుకే తాను భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా వ్యవహరించినప్పుడు అందరికీ అవకాశాలు ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నాడు. గతంలో తాను పాటించిన సిద్ధాంతాన్నే రాబోయే శ్రీలంక పర్యటనలోనూ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కాగా, వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించే భారత బి జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ద్రవిడ్ మాట్లాడుతూ.. గతంలో తాను కోచ్‌గా పని చేసిన కాలంలో యువ ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించేవాడినని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లందరికీ ముందే చెప్పేవాడినని, ఇలా చేయడం వల్ల సత్ఫలితాలు కూడా రాబట్టానని చెప్పుకొచ్చాడు. జాతీయ జట్టులో స్థానం దక్కినప్పుడు యువ ఆటగాళ్లు తెగ సంబర పడిపోతారని, అలాంటప్పుడు వారికి నిరూపించుకునే అవకాశం రాకపోతే అంతే కుమిలి పోతారని అన్నాడు. అందుకే తాను అండర్-19 జట్టులో ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు చేసేవాడినని వెల్లడించాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా.. -
నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా..
ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగా లంక పర్యటనకు యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే 20 మంది సభ్యులతో కూడిన భారత బి జట్టులో శ్రేయస్ అయ్యర్, నటరాజన్‌ల పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. వారిని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్.. గాయం బారిన పడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయం కావడం వల్ల ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే నట్టూను లంక పర్యటనకు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడ్డాడు. శ్రేయస్ భుజానికి తీవ్ర గాయం కావడంతో అతను లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే శ్రేయస్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని లంక పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, జూలై 13 నుంచి 25 మధ్య భారత బి జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా . చదవండి: WTC FINAL: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ కోహ్లీకి గాయం? -
భారత సీ జట్టు వెళ్లినా సునాయాసంగా గెలుస్తుంది..
కరాచీ: ప్రస్తుతం భారత క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని, ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించి, విజయాలు సాధించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ ఈ స్థాయికి చేరడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవలంబిస్తున్న విధానాలే కారణమని, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ పాక్ మాజీ డాషింగ్ క్రికెటర్ సూచించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లాంటి లీగ్‌లు భారత యువ ఆటగాళ్ల పాలిట వరంలా మారాయని, ఈ తరహా టోర్నీల వల్ల మేటి ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పాక్ మాజీ ఆటగాడు స్పందిస్తూ.. శ్రీలంక పర్యటనకు భారత సీ జట్టు వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడు మార్గనిర్దేశం చేస్తుండటం భారత క్రికెట్ ఉన్నతికి మరో కారణమని ఆయన పేర్కొన్నాడు. ద్రవిడ్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది యువ క్రికెటర్లు లైమ్‌లైట్‌లోకి వచ్చారని, టీమిండియా హెడ్ కోచ్రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడని ప్రశంసించాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడని, విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడని, అతను కూడా గాయపడితే ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. భారత బి జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత జట్టు ఏక కాలంలో రెండు అంతార్జాతీయ జట్లతో రెండు వేర్వేరు సిరీస్‌లలో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. అదే సమయంలో భారత బి జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత బి జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనుండగా, బి జట్టుకు సీనియర్ ఆటగాడు ధవన్ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు -
నేను రెడీగా ఉన్నా, కాల్ రావడమే ఆలస్యం: నితీష్ రాణా
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్లోనూ విశేషంగా రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా.. తన ప్రదర్శనే తనకు జతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు జులైలో శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్న భారత జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ఈ కేకేఆర్ ఓపెనర్.. గత మూడేళ్లుగా తన అటతీరు చాలా మెరుగుపడిందని, అందుకు తన గణాంకాలే నిదర్శమని, ఇవే తన అంతర్జాతీయ అరంగేట్రానికి తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్క ఆటగాడి కల అని, నేను కూడా భారత్ తరఫున రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నానని, సెలెక్షన్ కమిటీ నుంచి కాల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాని పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో లంక పర్యటన తనకు లభించిన సువర్ణావకాశమని ఈ 27 ఏళ్ల డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల ఐపీఎల్ కెరీర్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున 67 మ్యాచ్‌ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 1638 పరుగులు సాధించిన రాణా..38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 40కి పైగా సగటుతో 2266 పరుగులు సాధించాడు. కాగా, భారత టెస్టు జట్టు సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా గడపనున్న నేపథ్యంలో వైట్ బాల్ స్పెషెలిస్ట్‌లను లంక పర్యటనకు పంపాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్, బుమ్రా లాంటి స్టార్ల గైర్హాజరీలో రాణా సహా చాలా మంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ అరంగేట్రంపై ఆశలు పెంచుకున్నారు. చదవండి: భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్.. -
నా చేతిలో ఏముంది?.. బ్యాట్ తప్ప: కోహ్లీ
- కోచ్‌గా రవిశాస్త్రి నియామకంపై తొలిసారి స్పందింన విరాట్ ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి నియామకంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. శ్రీలంక పర్యటన కోసం టీమిండియా బయలుదేరడానికి ముందు కోహ్లీ, రవిశాస్త్రిలు ముంబైలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు విరాట్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. స్టైల్ ఐకాన్‌గా పేరుపొందిన కోహ్లీ.. తెల్లటి కళ్లజోడు ధరించి కొత్త లుక్‌లో కనిపించడం విశేషం. ‘మీరు కోరుకున్న వ్యక్తి(రవిశాస్త్రి) కోచ్‌గా నియమితులయ్యారు. కంగ్రాట్స్..’ అన్న విలేకరుల వ్యాఖ్యలకు కోహ్లీ ఒకింత అమాయకత్వం ప్రదర్శిస్తూ.. ‘నా చేతిలో ఏముంటుందండీ! బ్యాట్ తప్ప!!’ అని చమత్కరించాడు. ‘కొత్త కోచ్ రవిశాస్త్రి గురించి కొత్తగా అర్థం చేసుకోవాల్సిందేమీ లేదు. గతంలో మూడేళ్లపాటు మేం కలిసి పనిచేశాం. ఇప్పటికిప్పుడు మాపై ఒత్తిడంటూ ఏదీ లేదు. ఏ జట్టుకైనా బ్యాడ్‌టైమ్ సహజం. దానిని అధిగమించాలనే కోరుకుంటాం. కెప్టెన్‌గా ఉన్నంత వరకూ జట్టు వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు నేను వెనుకాడను’ అని కోహ్లీ వివరించాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకుగానూ టీమిండియా శ్రీలంక పర్యటనకు బలుదేరింది. జులై 26న గాలేలో తొలి టెస్టు జరగనుంది. అంతకుముందే జులై 21న స్థానిక టీబీసీ జట్టుతో విరాట్‌సేన రెండు రోజుల ప్రాక్టీస్‌మ్యాచ్ ఆడనుంది.