నా చేతిలో ఏముంది?.. బ్యాట్‌ తప్ప: కోహ్లీ | for the first time virat kohli reacts on ravi shastri appointment | Sakshi
Sakshi News home page

నా చేతిలో ఏముంది?.. బ్యాట్‌ తప్ప: కోహ్లీ

Published Wed, Jul 19 2017 5:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

నా చేతిలో ఏముంది?.. బ్యాట్‌ తప్ప: కోహ్లీ

నా చేతిలో ఏముంది?.. బ్యాట్‌ తప్ప: కోహ్లీ

- కోచ్‌గా రవిశాస్త్రి నియామకంపై తొలిసారి స్పందింన విరాట్‌

ముంబై:
టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి నియామకంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలిసారి స్పందించాడు. శ్రీలంక పర్యటన కోసం టీమిండియా బయలుదేరడానికి ముందు కోహ్లీ, రవిశాస్త్రిలు ముంబైలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు విరాట్‌ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. స్టైల్‌ ఐకాన్‌గా పేరుపొందిన కోహ్లీ.. తెల్లటి కళ్లజోడు ధరించి కొత్త లుక్‌లో కనిపించడం విశేషం.

‘మీరు కోరుకున్న వ్యక్తి(రవిశాస్త్రి) కోచ్‌గా నియమితులయ్యారు. కంగ్రాట్స్‌..’ అన్న విలేకరుల వ్యాఖ్యలకు కోహ్లీ ఒకింత అమాయకత్వం ప్రదర్శిస్తూ.. ‘నా చేతిలో ఏముంటుందండీ! బ్యాట్‌ తప్ప!!’  అని చమత్కరించాడు.

‘కొత్త కోచ్‌ రవిశాస్త్రి గురించి కొత్తగా అర్థం చేసుకోవాల్సిందేమీ లేదు. గతంలో మూడేళ్లపాటు మేం కలిసి పనిచేశాం. ఇప్పటికిప్పుడు మాపై ఒత్తిడంటూ ఏదీ లేదు. ఏ జట్టుకైనా బ్యాడ్‌టైమ్‌ సహజం. దానిని అధిగమించాలనే కోరుకుంటాం. కెప్టెన్‌గా ఉన్నంత వరకూ జట్టు వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు నేను వెనుకాడను’ అని కోహ్లీ వివరించాడు.

మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకుగానూ టీమిండియా శ్రీలంక పర్యటనకు బలుదేరింది. జులై 26న గాలేలో తొలి టెస్టు జరగనుంది. అంతకుముందే జులై 21న స్థానిక టీబీసీ జట్టుతో విరాట్‌సేన రెండు రోజుల ప్రాక్టీస్‌మ్యాచ్‌ ఆడనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement