భారత్ జట్టును తమ భుజస్కంధాలపై నడిపించిన ఇద్దరు బ్యాటింగ్ అతిరథుల టెస్ట్ క్రికెట్ జీవితానికి త్వరలో తెరపడనుందా? ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
పెర్త్‌లో జగిన తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన 36 ఏళ్ళ కోహ్లి ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు.
వేటు వేయక తప్పదా?
అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ముందుంచి నడిపించించల్సిన ఈ ఇద్దరు అగ్రశేణి ఆటగాళ్లు వరుసగా విఫలమవడం, అదీ ఆస్ట్రేలియా వంటి కీలకమైన సిరీస్‌లో మరీ పేలవంగా ఆడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరగనున్న ఆఖరిదైన ఐదో టెస్టులో వారిద్దరిని జట్టులో కొనసాగించడం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.
నిజానికి... కోహ్లి- రోహిత్(Virat Kohli- Rohit Sharma) దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్‌ను తమ భుజాలపై మోస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు టెస్టుల్లో ఆడటం ఇక కష్టమే అనిపిస్తోంది.
ఇక సోమవారం మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఓటమితో భారత్ వచ్చే ఏడాది లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.
తలకు మించిన భారం
ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం దాదాపులేనట్టే. నాలుగో టెస్టులో ఓటమితో భారత్ అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిలను జట్టులో కొనసాగించడం జట్టు మేనేజ్‌మెంట్‌కు తలకు మించిన భారం కావచ్చు. కనీసం చివరి టెస్టులో విజయం సాధిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి భారత్ కి కొద్దిపాటి అవకాశమన్నా ఉంటుంది.
సిడ్నీ టెస్టుకు దూరం
ఈ పరిస్థితుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్- కోహ్లిలను సిడ్నీ టెస్టుకు దూరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఆటతీరు మరీ పేలవంగా సాగడం అతడిపై వేటుకు కారణం కావొచ్చని తెలుస్తోంది.
మెల్‌బోర్న్‌లో రెండో ఇన్నింగ్స్ లో 40 బంతుల్లో 9 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌పై వేటు తప్పనిసరిగా కనిపిస్తోంది.
కోహ్లికి రవి శాస్త్రి మద్దతు
అయితే, కోహ్లికి కొద్దిగా మినహాయింపు కల్పించవచ్చు. భారత్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఈ విషయాన్నే చెప్పాడు. రవిశాస్త్రి కోహ్లికి మద్దతు తెలియజేశాడు. "విరాట్ కోహ్లీ మరికొంత కాలం టెస్టుల్లో ఆడతాడనే నేను భావిస్తున్నాను" అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. "విరాట్ కొంతకాలం ఆడతాడు, ఈ రోజు అతను అవుట్ అయిన విధానాన్ని త్వరగా మర్చిపోయి సిడ్నీ టెస్టులో రాణిస్తాడని భావిస్తున్నాను" అని శాస్త్రి అన్నాడు.
రోహిత్‌కు కష్టమే.. ఇదే చివరి సిరీస్!
అయితే రోహిత్‌ని మాత్రం శాస్త్రి సమర్ధించలేకపోయాడు. "ఇక రోహిత్ విషయానికి వస్తే, ఇదే బహుశా అతని చివరి టెస్ట్ సిరీస్ కావచ్చు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తున్న రోహిత్ ఫుట్‌వర్క్ ఎలా ఉందో చూసాం. అతను క్రీజులో కాస్త మందకొడిగా కదులుతున్నాడు. దీనివల్ల బహుశా కొన్నిసార్లు రోహిత్ బంతిని ఎదుర్కోవడంలో ఒకింత ఆలస్యం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వంటి బౌలర్లతో ఇది కష్టమే’’ అని శాస్త్రి అన్నాడు.
ఇక సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ కి వచ్చిన రాహుల్ చక్కగా రాణించాడు. వీరిద్దరూ ఆ టెస్ట్ లోని రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా తొలి వికెట్ కి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి దోహదం చేసారు.
రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతో
అయితే, రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతో అతను గబ్బా టెస్టులో మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా విఫలమైన తర్వాత రాహుల్‌ని మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ చర్య రాహుల్ కి మాత్రమే కాక భారత్ జట్టుని కూడా దెబ్బ తీసింది.
దీని కారణంగా అడిలైడ్ లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మెల్‌బోర్న్ టెస్టులో కూడా ఓటమి చవిచూడడంతో రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని.. జస్‌ప్రీత్ బుమ్రాకి జట్టు నాయకత్వం అప్పగిస్తే అది భారత్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి!
Comments
Please login to add a commentAdd a comment