
కొలంబో : శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) టి20 టోర్నీ నవంబర్ నెలకు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ జరగాల్సింది. కొలంబో, క్యాండీ, గాలె, దంబుల్లా, జాఫ్నా నగరాల్లో మొత్తం 23 మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టే ఆటగాళ్లందరూ... కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. దాంతో ఈ నెలలో ఇలా జరగడం కష్టసాధ్యమేనని భావించి నవంబర్ నెలకు లంక ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేశామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా తెలిపారు. ఐపీఎల్ ముగిశాక నవంబర్ రెండో వారంలో లంక ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment