LPL
-
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే -
బౌలర్ మ్యాజిక్ స్పెల్.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా
Jeffrey Vandersay Magic Bowling Spell(4-1-25-6) LPL 2021.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో కొలంబో స్టార్స్ బౌలర్ జెఫ్రీ వాండర్సే అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6 వికెట్లతో చెలరేగి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా జెఫ్రీ వాండర్సే(4-1-25-6) కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. డిసెంబర్ 17(శుక్రవారం) క్యాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో స్టార్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబో స్టార్స్ 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం. చదవండి: LPL 2021: బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్ ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (38 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనుంజయ్ డిసిల్వా 40 పరుగులు చేయగా.. చివర్లో దినేష్ చండీమల్ 29 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ వాండర్సే దాటికి 17 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రవి బొపారా 47 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Diego Maradona: వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా It's @Vandersay all the way!#LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere @ipg_productions @SatsportNews @OfficialSLC pic.twitter.com/vU428h2ONe — LPL - Lanka Premier League (@LPLT20) December 17, 2021 -
బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్
Bowler Celebration Became Viral After Getting Wicket.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్, డంబుల్లా జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విషయం పక్కనపెడితే.. కాండీ వారియర్స్ బౌలర్ బినురా ఫెర్నాండో సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డంబుల్లా జెయింట్స్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ సాల్ట్‌ను బినురా ఫెర్నాండో ఒక తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో వికెట్ తీశాననే ఆనందంలో ఫెర్నాండో.. యూట్యూట్‌లో బాగా ఫేమస్ అయిన సాల్ట్ బే సెలబ్రేషన్‌ను తనదైన స్టైల్లో చేశాడు. అయితే ఔటైన బ్యాట్స్‌మన్ ఫిలిప్ సాల్ట్ పేరులో ''సాల్ట్'' ఉండడం విశేషం. చదవండి: PAK Vs WI: ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్ రిపీట్ ఫెర్నాండో సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఫిలిప్ సాల్ట్.. తననేమైనా కామెంట్ చేస్తున్నాడా అన్నట్లు గమనించాడు. కానీ ఫెర్నాండో చివరలో పెవిలియన్ వైపు వెళ్తున్న సాల్ట్ వైపు నవ్వుతూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. అయితే సాల్ట్ బే సెలబ్రేషన్‌కు ఇంత పాపులారిటి రావడానికి కారణం.. ఒక తుర్కీష్ చెఫ్ వంటకాలు తయారు చేసే సమయంలో తనదైన స్టైల్లో స్ప్రింకిల్ చేయడం అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించి పెట్టింది. ఇక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కాండీ వారియర్స్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డంబుల్లా జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆర్ మెండిస్ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జయతిలకే 34 పరుగులు చేశాడు. బినురా ఫెర్నాండో, అల్ అమిన్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రవి బొపారా (59 పరుగులు నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: కోపంతో ఊగిపోయిన బౌలర్.. తన స్టైల్లో ప్రతీకారం pic.twitter.com/yW8KDIiKQM https://t.co/oAs61Adv1Y — Estelle Vasudevan (@Estelle_Vasude1) December 16, 2021 -
6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కాండీ వారియర్స్, కొలంబో స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కాండీ వారియర్స్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కొలంబో స్టార్స్ 19.4 ఓవర్లలో చేధించింది. అయితే చివరి 13 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో.. కొలంబో స్టార్స్ ఆటగాడు సీక్కుగే ప్రసన్న అద్భుతం చేసి చూపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన ప్రసన్న.. ఆ తర్వాతి ఓవర్లో రూథర్‌ఫర్డ్ ఒక ఫోర్ కొట్టాడు. అనంతరం సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 18.5 ఓవర్లో మరో సిక్స్ బాదడంతో సమీకరణం మారిపోయింది. చదవండి: BBL 2021: బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఓవర్ తొలి బంతికి రూథర్‌ఫర్డ్ సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసన్న వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడడు. అంతకముందు కాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కేన్నార్ లూయిస్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Some heroes don’t wear capes! When all seemed lost, #SeekkugePrasanna rose to the occasion. @SLColomboStars @ipg_productions @SatsportNews @OfficialSLC #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/zx4wJEmqsC — LPL - Lanka Premier League (@LPLT20) December 14, 2021 -
సిక్సర్లతో హోరెత్తించాడు.. విజయానికి చేరువగా
Rovman Powell Hitting 61 Runs From 19 Balls In LPL.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భాగంగా కాండీ వారియర్స్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 14 ఓవర్లుకు కుదించారు. తొలుత బ్యాటింత్ చేసిన జఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 181 పరుగులు భారీ స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (23 బంతుల్లో 53, 7 సిక్సర్లు), తిసారా పెరీరా( 21 బంతుల్లో 53 , 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించారు. చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం అనంతరం బ్యాటింగ్ చేసిన కాండీ వారియర్స్‌కు ఓపెనర్లు కెన్నార్ లూయిస్ (41), చరిత్ అసలంక(42) మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత వచ్చిన రోవ్‌మన్ పావెల్ భీకర ఇన్నింగ్స్ ఆడడంతో కాండీ వారియర్స్ 11 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయానికి దగ్గరగా వచ్చింది. అయితే పావెల్ ఔటైన అనంతరం మ్యాచ్ జఫ్నా కింగ్స్ వైపు మళ్లింది. ఇక అక్కడినుంచి జఫ్నా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు 14 ఓవర్లలో 166 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. Powell's dominance from start was a testament to his reputation as a power-hitter! @Ravipowell26 @ipg_productions #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/aiQTDa4pmp — LPL - Lanka Premier League (@LPLT20) December 8, 2021 -
'అతన్ని తిట్టలేదు.. అడ్వైజ్ మాత్రమే ఇచ్చాను'
కొలంబొ : లంక ప్రీమియర్ లీగ్ 2020లో గాలే గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ హుల్ హక్‌ను బహిరంగంగా దూషించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆఫ్రిది మంగళవారం ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ' నేను నవీన్ హుల్ హక్‌ను తిట్టలేదు. షేక్ హ్యాండ్ సందర్భంగా నవీన్ దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్ అయిన మాట వాస్తవమే. మ్యాచ్‌లో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకోకూడదని సూచనలు మాత్రమే ఇచ్చాను. అంతేగాని అతనిపై ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు. నాకు ఆఫ్ఘన్ ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. మనం ఒక జట్టులో ఉన్నామంటే సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడమనేది ఆటలో కనీస ధర్మం. అంటూ వివరణ ఇచ్చాడు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం) కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కాండీ టస్కర్స్ బ్రెండన్ టేలర్, కుషాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆఫ్రిది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్పీఎల్లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. My advise to the young player was simple, play the game and don't indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ — Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020 -
ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం
కొలంబొ : శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో సోమవారం కాండీ టస్కర్స్, గాలే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాండీ టస్కర్స్ 25 పరుగుల తేడాతో గాలే గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రత్యర్థి ఆటగాడిపై తిట్లతో విరుచుకుపడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న మహ్మద్ ఆమిర్, టస్కర్స్ బౌలర్ నవీన్ హుల్ హక్ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. నవీన్ హుల్ హక్ ఆమిర్నుద్దేశించి స్లెడ్జింజ్‌కు పాల్పడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ నవీన్వైపు దూసుకెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి తయారయ్యారు. ఇంతలో మునాఫ్ పటేల్ సహా ఇతర ఆటగాళ్లు వారిద్దరిని అడ్డుకున్నారు. (చదవండి : బంతి పట్టనున్న శ్రీశాంత్.. రైనా శుభాకాంక్షలు) మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్ కెప్టెన్ ఆఫ్రిది అందరితో సరదాగానే చేతులు కలిపాడు. తీరా నవీన్ హుల్ హక్ దగ్గరకు రాగానే ముఖం కోపంగా పెట్టి.. అతనిపై విరుచుకుపడ్డాడు. ఏమైంది నీకు.. ఎందుకు అమిర్‌తో అలా ప్రవర్తించావు. ఒక సీనియర్ బౌలర్‌పై ఈ విధంగా వ్యవహరించడం తప్పు .. అంటూ కోపంతో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కాండీ టస్కర్స్ బ్రెండన్ టేలర్, కుషాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆఫ్రిది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్పీఎల్లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. (చదవండి : సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు టీంలో లేరు..) -
చెలరేగిన షాహిద్ అఫ్రిది
హంబన్‌తోట: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరొకసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) టీ20 ఆరంభపు సీజన్లో గాలే గ్లాడియేటర్స్‌కు సారథ్యం వహిస్తున్న అఫ్రిది బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. జఫ్నా స్టాలియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తన బ్యాటింగ్ పవర్ మరోసారి చూపెట్టాడు.(రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్) అఫ్రిది హాఫ్ సెంచరీలో మూడు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది వచ్చీ రావడంతో బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్లో అఫ్రిది యాభైకి పైగా పరుగులు సాధించడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా హాంప్‌షైర్ తరఫున ఆడిన అఫ్రిది.. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించాడు. అపై ఇదే అఫ్రిదికి టీ20ల్లో పెద్ద స్కోరు. కాగా, ఎల్పీఎల్లో అఫ్రిది దూకుడుతో గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కానీ అఫ్రిది జట్టు గెలవలేదు. జఫ్నా స్టాలియన్స్ ఇంకా మూడు బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అవిష్కా ఫెర్నాండో 63 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షోయబ్ మాలిక్(27 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ జోడి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
లీగ్ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్ కలకలం
కొలంబో: ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు(నవంబర్ 26వ తేదీ) ఆరంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఆరంభం సీజన్‌కు అప్పుడే ఫిక్సింగ్ తాకిడి తగిలింది. మ్యాచ్‌లను తమకు అనుకూలంగా ఫిక్స్ చేయాలని జాతీయ జట్టుకుకు చెందిన మాజీ క్రికెటర్ ఎల్పీఎల్ ఆడే ఒక ప్లేయర్‌ను కలిసిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డులు దీనిపై సీరియస్ దృష్టి సారించాయి. భారీ ఫిక్సింగ్‌కు తెరలేపడానికి చూస్తున్నట్లు స్థానిక పత్రిక లంకా దీప తన కథనంలో పేర్కొంది. దాంతో ఐసీసీతో పాటు ఎస్ఎల్సీలు అలెర్ట్ అయ్యాయి. దీనిపై అప్పుడే ఐసీసీ విచారణకు రంగం సిద్ధం చేయగా, ఈ అంశంపై మాట్లాడటానికి మాత్రం నిరాకరించింది. ఎల్పీఎల్లో ఆడే విదేశీ ఆటగాడినే లక్ష్యంగా చేసుకుని ఫిక్సింగ్‌కు తెరలేపడానికి యత్నించినట్లు తెలుస్తోంది. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఎట్టకేలకు ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కాగా, తొలుతనవంబర్ 14కు వాయిదా పడింది. మళ్లీ నవంబర్ 26వ తేదీకి వాయిదా వేస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇది ఎల్పీఎల్ ఆరంభపు సీజన్ కావడం గమనార్హం. డిసెంబర్ 16వ తేదీ వరకూ జరుగనుంది. అభిమానులు స్టేడియాల్లోకి అనుమతి లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. క్యాండీ టస్కర్స్- కొలంబో కింగ్స్ మధ్య రాత్రి గం.7.30ని.లకు ఆరంభపు మ్యాచ్ జరుగనుంది. (షమీ భార్య జహాన్‌కు వేధింపులు) -
గాలె గ్లాడియేటర్స్ కెప్టెన్‌గా అఫ్రిది
కరాచీ : లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ‘గాలె గ్లాడియేటర్స్’ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి డిసెంబర్ 16 వరకు టి20 ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీలో... సర్ఫరాజ్ అహ్మద్ స్థానాన్ని అఫ్రిది భర్తీ చేయనున్నాడు. తొలుత గాలె గ్లాడియేటర్స్ జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ నియమితుడయ్యాడు. అయితే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన పాకిస్తాన్ జాతీయ జట్టులోకి సర్ఫరాజ్‌కు పిలుపు రావడంతో అతని స్థానంలో అఫ్రిది సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యజమాని, పాకిస్తాన్ పారిశ్రామికవేత్త నదీమ్ ఒమర్ స్పష్టం చేశారు. తొలిసారిగా జరుగనున్న ఈ టోర్నీలో జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్, గాలె గ్లాడియేటర్స్, కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. -
లంక ప్రీమియర్ లీగ్ మళ్లీ వాయిదా
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 క్రికెట్ టోర్నీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఆగస్టు నుంచి నవంబర్ 14కు... అనంతరం 21కు వాయిదా పడ్డ ఎల్పీఎల్... తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్ 27న మొదలు కానుంది. ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. ఇందుకు హంబన్‌తోటను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ 17న ఫైనల్ జరగనుంది. ఆటగాళ్లకు విధించే క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. అయితే జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను çపూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, డు ప్లెసిస్, షాహిద్ అఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి విదేశీ స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
లంక ప్రీమియర్ లీగ్‌లో సొహైల్ ఖాన్ పెట్టుబడి
ముంబై: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నమెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్’ ఫ్రాంచైజీని సొహైల్ ఖాన్, అతని తండ్రి సలీమ్ ఖాన్‌కు చెందిన కన్సార్టియం ‘సొహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్‌పీఎల్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు. జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్ పేర్కొన్నాడు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగనున్న ఈ ఎల్పీఎల్లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్ తలపడనున్నాయి. లీగ్ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్ జట్టు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్‌ను దక్కించుకుంది. గేల్‌తో పాటు ఫ్లంకెట్, వహాబ్ రియాజ్, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్‌లు టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఎల్పీఎల్లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు జాఫ్నా స్టాలియన్స్: షోయబ్ మాలిక్. దంబుల్లా హాక్స్: డేవిడ్ మిల్లర్, కార్లోస్ బ్రాత్‌వైట్. కొలంబో కింగ్స్: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్. గాలె గ్లాడియేటర్స్: లసిత్ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్ ఆమీర్. -
లంక ప్రీమియర్ లీగ్ నవంబర్‌లో...
కొలంబో : శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నీ నవంబర్ నెలకు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ జరగాల్సింది. కొలంబో, క్యాండీ, గాలె, దంబుల్లా, జాఫ్నా నగరాల్లో మొత్తం 23 మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టే ఆటగాళ్లందరూ... కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలి. దాంతో ఈ నెలలో ఇలా జరగడం కష్టసాధ్యమేనని భావించి నవంబర్ నెలకు లంక ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేశామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా తెలిపారు. ఐపీఎల్ ముగిశాక నవంబర్ రెండో వారంలో లంక ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
కోరమాండల్‌లో లిబర్టీ ఫాస్ఫేట్, లిబర్టీ ఉర్వారక్ విలీనం
హైదరాబాద్: అనుబంధ సంస్థలు లిబర్టీ ఫాస్ఫేట్ (ఎల్పీఎల్), లిబర్టీ ఉర్వారక్లను (ఎల్యూఎల్) విలీనం చేసుకునే ప్రతిపాదనకు కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఎల్పీఎల్లో కోరమాండల్, ఎల్యూఎల్లకు 79.62 శాతం వాటాలు ఉన్నాయి. విలీన ప్రతిపాదన ప్రకారం.. షేర్హోల్డర్లకు ప్రతి 8 ఎల్పీఎల్ షేర్లకు 7 కోరమాండల్ షేర్లను కేటాయించనున్నారు. ఎల్పీఎల్ షేర్ ముఖవిలువ రూ. 10 కాగా, కోరమాండల్ షేర్ ముఖవిలువ రూ. 1.