బౌలర్‌ మ్యాజిక్‌ స్పెల్‌.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా | LPL 2021: Bowler Taken 6 Wickets Colombo Stars Beat Kandy Warriors By 58 Runs | Sakshi
Sakshi News home page

LPL 2021: బౌలర్‌ మ్యాజిక్‌ స్పెల్‌.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా

Published Sat, Dec 18 2021 2:04 PM | Last Updated on Sat, Dec 18 2021 2:10 PM

LPL 2021: Bowler Taken 6 Wickets Colombo Stars Beat Kandy Warriors By 58 Runs - Sakshi

Jeffrey Vandersay Magic Bowling Spell(4-1-25-6) LPL 2021.. లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌ 2021)లో కొలంబో స్టార్స్‌ బౌలర్‌ జెఫ్రీ వాండర్‌సే అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6 వికెట్లతో చెలరేగి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా జెఫ్రీ వాండర్‌సే(4-1-25-6) కెరీర్‌ బెస్ట్‌ స్పెల్‌ నమోదు చేశాడు. డిసెంబర్‌ 17(శుక్రవారం) క్యాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో స్టార్స్‌ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబో స్టార్స్‌ 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం.

చదవండి: LPL 2021: బౌలర్‌ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్‌ షాక్‌

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాండీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా (38 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనుంజయ్‌ డిసిల్వా 40 పరుగులు చేయగా.. చివర్లో దినేష్‌ చండీమల్‌ 29 బంతుల్లో 44 పరుగులు నాటౌట్‌ మెరిశాడు.  అనంతరం బ్యాటింగ్‌ చేసిన క్యాండీ వారియర్స్‌ వాండర్‌సే దాటికి 17 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రవి బొపారా 47 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Diego Maradona: వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement