Jeffrey Vandersay
-
అతడే మా కొంపముంచాడు.. మేము అనుకున్నది జరగలేదు: రోహిత్ శర్మ
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమి చవిచూసింది. మరోసారి స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది.ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది భారత బ్యాటర్లు స్పిన్నర్లకే తమ వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభమిచ్చినప్పటకి.. మిడిలార్డర్ మాత్రం పేక మేడలా కుప్పకూలింది. 241 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో 208 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. లంక బౌలర్లలో స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక ఈ ఓటమి పై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పేలవ బ్యాటింగ్ కారణంగా తాము ఓడిపోయామని రోహిత్ శర్మ అంగీకరించాడు.అతడి వల్లే ఓడిపోయాం: రోహిత్"మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది మనల్ని భాదిస్తుంది. నేను చెబుతున్నది కేవలం ఆఖరి 10 ఓవర్లకు సంబంధించి మాత్రమే కాదు. ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆలానే ఆడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మేము సమిష్టగా విఫలమయ్యాం. ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ క్రికెట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. మనముందు సవాళ్లను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి. స్పిన్నర్లకు లెఫ్ట్-రైట్ కాంబనేషన్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం ఈజీగా ఉంటుందని భావించాము. అందుకే దూబేను ముందుగా బ్యాటింగ్ పంపించాము. కానీ జెఫ్రీ మాత్రం మా వ్యూహాలను దెబ్బతీశాడు. 6 వికెట్ల పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసాడు. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నేను దూకుడుగా ఆడటం వల్లే 65 పరుగులు చేయగలిగాను. నా బ్యాటింగ్‌లో చాలా రిస్క్ షాట్లు ఉంటాయి. ఆ ప్రయత్నంలో తొందరగా వికెట్ కోల్పోతే నిరాశకు లోనవతాను. ఏదమైనప్పటకి పవర్‌ప్లేలో దాటిగా ఆడి పరుగులు రాబట్టడమే నా ఉద్దేశ్యం. ఈ పిచ్ స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్‌పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈ రోజు మేము అది చేయలేకపోయాం. అయితే ఈ ఓటమిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ తీరుపై చర్చించాల్సిన అవసరముందని" పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. -
6 వికెట్లతో భారత్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?
కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విల్లవిల్లాడందో. సేమ్ టూ సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.జెఫ్రీ ఓంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓవరాల్‌గా 6 వికెట్ల పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వాండర్సే.. తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ వాండర్సే అని నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.ఎవరీ వాండర్సే...?భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని వాండర్సే అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే 2015లో న్యూజిలాండ్‌పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో వాండర్సే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.ఆ తర్వాత అతడి వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్‌ల లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు.దేశీవాళీ క్రికెట్లో మూర్స్ ఎసీ, సీదువ రద్దోలువ సీసీ క్లబ్స్‌కు వాండర్సే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వాండర్సే ఇప్పటివరకు ఓవరాల్‌గా 37 మ్యాచ్‌ల్లో శ్రీలంక తరపున ఆడాడు. అందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఉన్నాయి.అదే విధంగా వాండర్సే తన కెరీర్లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లఘించినందుకు వాండర్సే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వార్షిక కాంట్రాక్ట్ ఫీజులో 20% జరిమానా కూడా శ్రీలంక క్రికెట్ విధించింది. -
తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు. సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. -
బౌలర్ మ్యాజిక్ స్పెల్.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా
Jeffrey Vandersay Magic Bowling Spell(4-1-25-6) LPL 2021.. లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో కొలంబో స్టార్స్ బౌలర్ జెఫ్రీ వాండర్సే అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా 6 వికెట్లతో చెలరేగి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా జెఫ్రీ వాండర్సే(4-1-25-6) కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. డిసెంబర్ 17(శుక్రవారం) క్యాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో స్టార్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబో స్టార్స్ 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం. చదవండి: LPL 2021: బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్ ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (38 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనుంజయ్ డిసిల్వా 40 పరుగులు చేయగా.. చివర్లో దినేష్ చండీమల్ 29 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాండీ వారియర్స్ వాండర్సే దాటికి 17 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రవి బొపారా 47 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Diego Maradona: వేలానికి మారడోనా సిగరెట్లు, కార్లు, లగ్జరీ విల్లా It's @Vandersay all the way!#LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #SriLanka #Season2 #T20cricket #LankaPremierLeague #TheFutureisHere @ipg_productions @SatsportNews @OfficialSLC pic.twitter.com/vU428h2ONe — LPL - Lanka Premier League (@LPLT20) December 17, 2021