తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు.
ఏం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు.
సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లి
తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment