తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతుండగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్ కాళ్లకు దండం పెట్టాడు.
వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక శ్రీలంకతో ఆఖరి వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో సంచలన సెంచరీతో కోహ్లి చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.
A fan invaded the field and touched Virat Kohli's feet. pic.twitter.com/wualIoFgZ8
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023
చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఏకైక ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment