PC: Twitter
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్స్‌లు), గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.
బంతికి ఫోటో తీసిన ఫ్యాన్
కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో 45 ఓవర్ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి లాంగ్ ఆన్ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు.
అయితే ఆ ఫ్యాన్ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్‌తో భారీ సిక్స్! వీడియో వైరల్
— MINI BUS 2022 (@minibus2022) January 15, 2023
— IPLT20 Fan (@FanIplt20) January 15, 2023
Comments
Please login to add a commentAdd a comment