లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కాండీ వారియర్స్, కొలంబో స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కాండీ వారియర్స్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కొలంబో స్టార్స్ 19.4 ఓవర్లలో చేధించింది. అయితే చివరి 13 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో.. కొలంబో స్టార్స్ ఆటగాడు సీక్కుగే ప్రసన్న అద్భుతం చేసి చూపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన ప్రసన్న.. ఆ తర్వాతి ఓవర్లో రూథర్‌ఫర్డ్ ఒక ఫోర్ కొట్టాడు. అనంతరం సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 18.5 ఓవర్‌లో మరో సిక్స్ బాదడంతో సమీకరణం మారిపోయింది.
చదవండి: BBL 2021: బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం
ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఓవర్ తొలి బంతికి రూథర్‌ఫర్డ్ సింగిల్ తీసి ప్రసన్నకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసన్న వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడడు. అంతకముందు కాండీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కేన్నార్ లూయిస్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Some heroes don’t wear capes! When all seemed lost, #SeekkugePrasanna rose to the occasion. @SLColomboStars @ipg_productions @SatsportNews @OfficialSLC #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #Cricket #WinTogether #LankaPremierLeague #TheFutureisHere pic.twitter.com/zx4wJEmqsC
— LPL - Lanka Premier League (@LPLT20) December 14, 2021
Comments
Please login to add a commentAdd a comment