![Fans Troll Mohammad Amir Dismisses Batter Next Ball Gives Him Mouthful - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/21/Amir.jpg.webp?itok=71zwnWEz)
లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్ 2021)లో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆదివారం గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను ఆమిర్ వేశాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆమిర్ వేసిన తొలి బంతినే సిక్స్ బాదాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ తన తర్వాతి బంతికి ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకు దెబ్బ తీశాడు.
ఈ సమయంలో ఆమిర్ కోపంతో అవిష్క ఫెర్నాండోవైపే చూస్తూ ''గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్'' అంటూ ఇచ్చిన హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆమిర్‌ను ట్రోల్ చేస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''ఆమిర్ ఎక్కడున్నా సరే.. నీ కవ్వింపు చర్యలు అలాగే ఉంటాయి.. ఇక నువ్వు మారవా'' అంటూ పేర్కొన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించిన గాలే గ్లాడియేటర్స్ ఎల్‌పీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినంతకాలం వివాదాలతో పేరు పొందిన ఆమిర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా అంతే అగ్రెసివ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు తీశాడు.
చదవండి: BBL 2021: మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?!
First ball hit for Six then 👑 Clean bowled with an Inswinger @iamamirofficial Aggression 🔥 pic.twitter.com/6p2LmWyy6r
— Mustafa Abid (@mmustafa_abid) December 19, 2021
Comments
Please login to add a commentAdd a comment