లంక ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్‌ను జాఫ్నా కింగ్స్ ఎగరేసుకుపోయింది. నిన్న (జులై 21) జరిగిన ఫైనల్లో గాలే మార్వెల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకుంది. రిలీ రొస్సో మెరుపు సెంచరీ చేసి జాఫ్నాను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. లంక ప్రీమియర్ లీగ్ ఐదు ఎడిషన్లలో (2020, 2021, 2022, 2023, 2024) జాఫ్నాకు ఇది నాలుగో టైటిల్.
రాజపక్స మెరుపు ఇన్నింగ్స్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గాలే.. భానుక రాజపక్స (34 బంతుల్లో 82; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టిమ్ సీఫర్ట్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, బెహ్రెన్‌డార్ఫ్ 2, అజ్మతుల్లా ఓ వికెట్ పడగొట్టారు.
రిలీ రొస్సో విధ్వంసకర శతకం
185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో విధ్వంసకర శతకంతో (53 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో 15.4 ఓవర్లలోనే విజయతీరాలకు (వికెట్ నష్టానికి) చేరింది. రొస్సోకు జతగా కుశాల్ మెండిస్ (40 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు.
ఫైనల్లో సుడిగాలి శతకంతో రెచ్చిపోవడంతో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రొస్సోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ ఎడిషన్‌లో రొస్సో 11 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 389 పరుగులు చేసి ఎడిషన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment