Avishka Fernando
-
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. కుసాల్, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్‌పై 300 ప్లస్ స్కోర్ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్‌తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో సనత్ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక (12) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జనిత్ లియనాగే క్రీజ్‌లో ఉన్నాడు.కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, ఐష్ సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. -
India vs Sri Lanka: 27 ఏళ్ల తర్వాత... శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
కొలంబో: ఆతిథ్య స్పిన్‌ను ఎదుర్కోలేక బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు సిరీస్‌ను సమం చేసుకోలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన టీమిండియా సిరీస్‌ను 0–2తో శ్రీలంకకు సమరి్పంచుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59; 4 ఫోర్లు) రాణించారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగుల వద్దే కుప్పకూలింది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! తర్వాత టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దునిత్ వెలలగే (5/27) చావుదెబ్బ తీయగా, వాండెర్సే, తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తమకు కలిసొచి్చన స్పిన్ ట్రాక్‌పై పది వికెట్లలో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టేశారు. టాపార్డర్ రాణింపుతో... టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక, అవిష్క ఫెర్నాండో శుభారంభమిచ్చారు. ఓపెనర్లిద్దరు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. స్పిన్నర్లను దించినా యథేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు ఓపెనింగ్ వికెట్‌కు 89 పరుగులు జతయ్యాక నిసాంకను అక్షర్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచి్చన కుశాల్‌తో అవిష్క మరో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాడు. 65 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొని సెంచరీ దిశగా సాగుతున్న అవిష్కను జట్టు స్కోరు 171 వద్ద పరాగ్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అసలంక (10), సమరవిక్రమ (0), జనిత్ (8), వెలలగే (2)లపై భారత బౌలర్లు ప్రభావం చూపారు. 77 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కుశాల్‌ను కుల్దీప్ బోల్తా కొట్టించడంతో లంకను 250 పరుగుల్లోపే కట్టడి చేశారు. ఈసారి వెలలగే వలలో... ఓపెనర్, కెపె్టన్ రోహిత్ ఎప్పట్లాగే తనశైలి దూకుడుతో ఆరంభం నుంచే ధాటిగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. కానీ శుబ్‌మన్ గిల్ (6) సీమర్ అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లోనే క్లీన్»ౌల్డయ్యాడు. కోహ్లి (18 బంతుల్లో 20; 4 ఫోర్లు)తో కలిసి ‘హిట్‌మ్యాన్’ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. కానీ కాసేపటికే వెలలగే స్పిన్ మ్యాజిక్కు రోహిత్ వికెట్ సమరి్పంచుకోవడంతో గత రెండు మ్యాచ్‌ల వైనమే ఇందులోనూ కొనసాగింది. కెప్టెన్ వికెట్ పడగానే షరామామూలుగా రిషభ్ పంత్ (9), కోహ్లి, అక్షర్ పటేల్ (2), శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్‌కు క్యూకట్టడంతో 82 పరుగులకే భారత్ 6 వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. జట్టుస్కోరు 100 పరుగులకు చేరగానే వాండెర్సే... పరాగ్ (15)ను, తదుపరి ఓవర్లో శివమ్ దూబే (9)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ కొద్దిపాటి మెరుపులతో వంద పైచిలుకు స్కోరు చేసిందే తప్ప కనీసం 150 దగ్గరకు వెళ్లలేకపోయింది. సుందర్‌ను తీక్షణ, కుల్దీప్ (6)ను వెలలగే అవుట్ చేయడంతో భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పంత్ (బి) అక్షర్ 45; అవిష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 96; కుశాల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 59; అసలంక (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 10; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; జనిత్ (బి) సుందర్ 8; వెలలగే (బి) పరాగ్ 2; కమిండు (నాటౌట్) 23; తీక్షణ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–89, 2–171, 3–183, 4–184, 5–196, 6–199, 7–235. బౌలింగ్: సిరాజ్ 9–0–78–1, శివమ్ దూబే 4–0–9–0, అక్షర్ 10–1–41–1, సుందర్ 8–1–29–1, కుల్దీప్ 10–0–36–1, రియాన్ పరాగ్ 9–0–54–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కుశాల్ (బి) వెలలగే 35; గిల్ (బి) అసిత ఫెర్నాండో 6; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 20; పంత్ (స్టంప్డ్) కుశాల్ (బి) తీక్షణ 6; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 8; అక్షర్ (బి) వెలలగే 2; పరాగ్ (బి) వాండెర్సే 15; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 9; సుందర్ (సి) వాండెర్సే (బి) తీక్షణ 30; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 6; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (26.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–37, 2–53, 3–63, 4–71, 5–73, 6–82, 7–100, 8–101, 9–138, 10–138. బౌలింగ్: అసిత ఫెర్నాండో 5–0–29–1, తీక్షణ 8–0–45–2, వెలలగే 5.1–0–27–5, వాండెర్సే 5–0–34–2, అసలంక 3–1–2–0. -
SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్.. క్లీన్‌స్వీప్ చేసిన లంక
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రహ్మత్ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నబీ... ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్స్ కొత్త ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌లో కొనసాగిన షకీబ్ అల్ హసన్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. -
సిరాజ్ సూపర్ డెలివరీ.. దెబ్బకు ఎగిరిపోయిన మిడిల్ స్టంప్! వీడియో వైరల్
శ్రీలంకతో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. కోల్‌కతా వేదికగా రెండో వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను సిరాజ్‌ను ఓ సంచలన బంతితో పెవిలియన్‌కు పంపాడు. ఫెర్నాండోను సిరాజ్ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: సహాచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. Timber Strike, the @mdsirajofficial way 👌👌 Relive how he dismissed Avishka Fernando 🔽 Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco — BCCI (@BCCI) January 12, 2023 -
10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జాఫ్నా కింగ్స్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది. చదవండి: ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ -
ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా!
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆదివారం గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను ఆమిర్ వేశాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆమిర్ వేసిన తొలి బంతినే సిక్స్ బాదాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ తన తర్వాతి బంతికి ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకు దెబ్బ తీశాడు. ఈ సమయంలో ఆమిర్ కోపంతో అవిష్క ఫెర్నాండోవైపే చూస్తూ ''గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్'' అంటూ ఇచ్చిన హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆమిర్‌ను ట్రోల్ చేస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''ఆమిర్ ఎక్కడున్నా సరే.. నీ కవ్వింపు చర్యలు అలాగే ఉంటాయి.. ఇక నువ్వు మారవా'' అంటూ పేర్కొన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించిన గాలే గ్లాడియేటర్స్ ఎల్పీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినంతకాలం వివాదాలతో పేరు పొందిన ఆమిర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా అంతే అగ్రెసివ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: BBL 2021: మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?! First ball hit for Six then 👑 Clean bowled with an Inswinger @iamamirofficial Aggression 🔥 pic.twitter.com/6p2LmWyy6r — Mustafa Abid (@mmustafa_abid) December 19, 2021 -
IPL 2022 Auction: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వస్తే!
IPL 2022: Sri Lanka New SIXER KING Avishka Fernando May Break Bank In Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా సమర్పించగా... కారణాలేవైనా డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేశాయి. వీళ్లంతా వేలంలోకి వస్తే కొనడానికి పలు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి కూడా. అదే సమయంలో.. టీ20 వరల్డ్‌కప్-2021 హీరోలు, ఇతర లీగ్ మ్యాచ్‌లలో అదరగొడుతున్న ఆటగాళ్లపై కూడా దృష్టిసారించాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో ఈసారి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటున్నారు క్రీడాభిమానులు. ఇప్పటికే వనిందు హసరంగ, దుష్మంత చమీరా క్యాష్ రిచ్ లీగ్‌లో భాగం కాగా.. 23 ఏళ్ల అవిష్క ఫెర్నాండో కూడా ఐపీఎల్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లంక ప్రీమియర్‌లో అతడి సిక్సర్ల ప్రదర్శన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది మరి! ఈ లీగ్‌లో జఫ్నా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవిష్క.. కాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వరుస సిక్సర్లు బాదాడు. 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 సిక్స్‌లు కొట్టి ఎల్పీఎల్ మ్యాచ్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. అంతేగాక ఇతర మ్యాచ్‌లలోనూ తనదైన శైలిలో హిట్టింగ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి పవర్ఫుల్ హిట్టర్ ఐపీఎల్‌లోనూ ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన అవిష్క 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. టీ20 వరల్డ్‌కప్-2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వనిందు హసరంగ, చరిత్ అసలంక కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! What a show by Avishka Fernando tonight! 🏏💪 53 off 23 balls | 7 sixes 🔥 #LPL2021 #එක්වජයගමු #ஒன்றாகவென்றிடுவோம் #EkwaJayagamu #WinTogether #TheFutureisHere pic.twitter.com/kD7kuD4nXE — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 8, 2021 -
త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది
Avishka Fernando Run Out: శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో అవిష్క ఫెర్నాండో రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్ట్జే మెరుపు వేగంతో వేసిన త్రో దాటికి స్టంప్ బయటికి రావడంతో పాటు స్టంప్ మైక్ కూడా ఊడి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్‌ను రబడ వేశాడు. ఓవర్ ఐదో బంతిని అవిష్క ఫెర్నాండో మిడాన్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న నోర్ట్జే మెరుపువేగంతో బంతిని నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అంతే బులెట్ వేగంతో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను బయటపడేలా చేసింది. దీంతో పాటు మైక్ స్టంప్ కూడా ఊడి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు Dinesh Chandimal's 66* | 1st T20I #SLvSA @chandi_17 Full Highlights➡️ https://t.co/vt7jmJz8AZ pic.twitter.com/ypTwToUaP5 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2021 -
అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం
కొలంబో: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక బోణి కొట్టింది. కొలంబో వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో 14 పరుగులతో సఫారీలపై గెలుపొందింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 118;10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకంతో చెలరేగగా.. ఆల్ రౌండర్ చరిత్ అసలంక అర్ధ సెంచరీతో రాణించాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల చేసింది. అవిష్క, అసలంకలకు తోడు ధనుంజయ డిసిల్వా(44) కూడా రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్, షంసీ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో మార్క్రమ్(90 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. డస్సెన్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో హెన్రీచ్ క్లాసెన్(36), రబడా(13 నాటౌట్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివరి రెండు ఓవర్లలో సఫారీల విజయానికి 32 పరుగులు కావాల్సి ఉండగా.. 49వ ఓవర్లో ఆ జట్టు కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. దాంతో చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో రబడా రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించినా.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 4న ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? -
Ind Vs Sl: కొంతమంది ఇడియట్స్ ఉంటారు: శ్రీలంక కోచ్
కొలంబో: టీమిండియాపై శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండోపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ ప్రశంసలు కురిపించాడు. ఫిట్నెస్ లోపాల కారణంగా వారిద్దరు కొన్ని మ్యాచ్‌లు మిస్పయ్యారని, అయితే ఇప్పుడు గాడిలో పడ్డారని పేర్కొన్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇరువురి ప్రదర్శన తనకెంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. భానుక మంచి కోసమే, కొన్నిసార్లు తన పట్ల కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని మికీ ఆర్థర్ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రపు మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టును ఓడించి ఆతిథ్య శ్రీలంక జట్టు ఓదార్పు విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 10 మ్యాచ్‌ల తర్వాత స్వదేశంలో టీమిండియాపై గెలుపొంది.. వరుస పరాజయాలకు చెక్ పెట్టగలిగింది. ముఖ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మికీ ఆర్థర్ లంక జర్నలిస్టులతో మాట్లాడుతూ... ఎట్టకేలకు భారత్‌పై గెలుపొందడం సంతోషంగా ఉందన్నాడు. ఇక వరుస ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్‌ను ఉద్దేశించి... దయచేసి సామాజిక మాధ్యమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘కొంతమంది ఇడియట్స్ ఉంటారు. వాళ్లకే అంతా తెలుసనని భావిస్తారు. నిజానికి వాళ్లకు అసలేమీ తెలియదు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది’’ అంటూ మికీ ఆర్థర్ వ్యాఖ్యానించాడు. కాగా రెండో వన్డేలో ఓటమి దిశగా పయనిస్తున్నపుడు ఆర్థర్, లంక కెప్టెన్ దసున్ శనక గొడవ పడటం.. అదే విధంగా చివరిదైన మూడో వన్డేలో 23వ ఓవర్లో డీఆర్ఎస్ విషయంలో దసున్ సేన తత్తరపాటుకు గురికావడం వంటి అంశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. -
వెస్టిండీస్‌పై లంక విజయం
-
అవిష్క ఫెర్నాండో అరుదైన ఘనత
చెస్టర్ లీ స్ట్రేట్: శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యంత పిన్నవయసులో సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫెర్నాండో శతకం సాధించాడు. 103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించి శ్రీలంక 338 పరుగుల భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఈ క్రమంలోనే పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో లంక క్రికెటర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల 90 రోజుల వయసులో ఫెర్నాండో వన్డే సెంచరీ సాధించగా, అంతకుముందు చండిమల్(20 ఏళ్ల 199 రోజుల వయసు), ఉపుల్ తరంగా(20 ఏళ్ల 212 రోజుల వయసు)లు పిన్న వయసులో వన్డే సెంచరీలు సాధించిన లంక క్రికెటర్లు. ఇప్పుడు ఆ తర్వాత స్థానాన్ని ఫెర్నాండో ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే, ఇది ఫెర్నాండో తొలి వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక సాధించిన మొదటి సెంచరీ కూడా ఇదే కావడం మరో విశేషం. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇప్పటివరకూ తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన ఫెర్నాండో 328 పరుగులు సాధించాడు.