SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్‌.. క్లీన్‌స్వీప్‌ చేసిన లంక | SL Vs Afg 3rd ODI: Nissanka's Century Helps Sri Lanka Clean Sweep Over Afghanistan - Sakshi
Sakshi News home page

SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్‌.. క్లీన్‌స్వీప్‌ చేసిన లంక

Published Thu, Feb 15 2024 10:56 AM | Last Updated on Thu, Feb 15 2024 11:14 AM

SL Vs Afg 3rd ODI Nissanka Century Helps Sri Lanka Clean Sweep Series - Sakshi

సెంచరీ హీరో పాతుమ్‌ నిసాంక

Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్‌ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది.

రహ్మత్‌ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్‌ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు.  

నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నబీ... 
ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్స్‌ కొత్త ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్‌ ఆటగాడు మొహమ్మద్‌ నబీ నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ ర్యాంక్‌లో కొనసాగిన షకీబ్‌ అల్‌ హసన్‌ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement