Mohammad Nabi
-
అదే నా కెరీర్లో చివరి టోర్నీ: అఫ్గన్ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే.. అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అఫ్గనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకొంటానని తెలిపాడు. కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన అఫ్గనిస్తాన్.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.హ్యాట్రిక్ విజయాలుతద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా మూడో సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నాటి ఆఖరి వన్డేలో అఫ్గన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.మహ్ముదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.రహమానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (120 బంతుల్లో 101; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ పూర్తి చేసుకోగా... అజ్మతుల్లా (77 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివర్లో మొహమ్మద్ నబీ (34 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో నహీద్ రాణా, ముస్తఫిజుర్ రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మొహమ్మద్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటాఈ నేపథ్యంలో నబీ మాట్లాడుతూ.. ‘‘‘గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా. కానీ మా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. దీంతో ఆ టోర్నీ ఆడాలనుకున్నా. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా’ అంటూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా సుదీర్ఘ కాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 39 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను అభిమానులు అఫ్గన్ క్రికెట్ హీరోగా పిలుచుకుంటారు.ఇక అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 167 వన్డేలు ఆడిన నబీ... 27.48 సగటుతో 3,600 పరుగులు చేయడంతో పాటు 172 వికెట్లు పడగొట్టాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నబీ... 2 సెంచరీలు, 17 అర్ధశతకాలు తన పేరిట రాసుకున్నాడు.గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన అఫ్గనిస్తాన్ జట్టు... ఆరో స్థానంలో నిలవడం ద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు.ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీ కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని నబీ తనకు తనకు తెలియజేసినట్లు నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతడిని నిర్ణయాన్ని బోర్డు కూడా గౌరవించినట్లు నసీబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ టీ20ల్లో మాత్రం అఫ్గాన్‌కు తన సేవలను కొనసాగించనున్నాడు. కాగా ఈ అఫ్గాన్ మాజీ కెప్టెన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు సైతం విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2026 వరకు నబీ పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశముంది.ఒకే ఒక్కడు.. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో మహ్మద్ నబీ అగ్రస్ధానంలో ఉంటాడు. 2009లో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నబీ తన కెరీర్లో 165 వన్డేలు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర.ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకాలని నబీ నిర్ణయించుకున్నాడు. 165 వన్డేల్లో 3,549 పరుగులతో పాటు 171 వికెట్లు నబీ సాధించాడు.చదవండి: WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. జోషఫ్‌కు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్ -
AFG Vs BAN: రాణించిన మొహమ్మద్ నబీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. షార్జా స్టేడియంలో ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఏ స్టేడియం కూడా 300 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బకొట్టారు. షొరీఫుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన నబీ, షాహిది71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షాహీది 92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహమ్మద్ నబీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 5, సెదికుల్లా అటల్ 21, రహ్మత్ షా 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 0, గుల్బదిన్ నైబ్ 22, రషీద్ ఖాన్ 10, ఖరోటే 27 (నాటౌట్), అల్లా ఘజన్ఫర్ 0, ఫజల్ హక్ ఫారూకీ 0 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో నబీ, ఖరోటే వేగంగా ఆడటంతో ఆఫ్ఘన్లు గౌరవప్రదమైన స్కోర్ చేశారు.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. తంజిద్ హసన్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య సర్కార్ 28, నజ్ముల్ హసన్ షాంటో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అల్లా ఘజన్ఫర్కు తంజిద్ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 42 ఓవర్లలో మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. -
సౌతాఫ్రికాపై సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
వన్డే క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ చరిత్ర సృష్టించాడు. 46 దేశాలపై విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో నబీ ఖాతాలో ఈ భారీ రికార్డు చేరింది.నబీ విజయాలు సాధించిన 46 దేశాలు..డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, పపువా న్యూ గినియా, కేమాన్ దీవులు, ఒమన్, చైనా, సింగపూర్, పాకిస్థాన్, ట్రినిడాడ్ మరియు టొబాగో, యూఎస్ఏ, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, కెనడా, కెన్యా, హాంకాంగ్, యూఏఈ, జింబాబ్వే, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాసౌతాఫ్రికాపై తొలి విజయంషార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం.SENA దేశాలపై విజయాలుఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు సాధించినట్లైంది.ఏడాదికాలంగా సంచలనాలు..ఆఫ్ఘనిస్తాన్ జట్టు గతేడాది కాలంగా ఫార్మాట్లకతీతంగా సంచలన విజయాలు సాధిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి జట్లకు షాకిచ్చి ఏకంగా సెమీస్‌కు చేరింది.భారత్ మినహా..ఇటీవలికాలంలో పెద్ద జట్లన్నిటికీ షాక్ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజనఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. చదవండి: శతక్కొట్టిన కమిందు మెండిస్.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా.. -
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మొహమ్మద్ నబీ.. 45 దేశాలపై విజయాలు
టీ20 ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 23) పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. సూపర్-8 గ్రూప్-1లో పటిష్టమైన ఆస్ట్రేలియాను చిన్న జట్టైన ఆఫ్ఘనిస్తాన్ చిత్తు ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెతేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటై, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడి ఆసీస్‌కు జీర్ణించుకోలేని ఓటమి రుచి చూపించారు.ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్ ఉల్ హక్ 3, ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్ (59) ఒంటిరి పోరాటం చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్ (12), స్టోయినిస్ (11)) చేశారు.అంతకుముందు గుర్భాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, జంపా 2, స్టోయినిస్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించలేదు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ నబీఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపులో భాగమైన మొహమ్మద్ నబీ క్రికెట్ చరిత్రలో బహుశా ఏ ఆటగాడు సాధించని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్‌పై గెలుపుతో నబీ 45 దేశాలపై విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ఎనిమిది ఐసీసీ సభ్య దేశాలు (ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఉన్నాయి. నబీ విజయాలు సాధించిన దేశాలు..బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, నేపాల్, యూఏఈ, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, హాంకాంగ్, అర్జెంటీనా, పాపువా న్యూ గినియా, కేమన్ దీవులు, ఒమన్, డెన్మార్క్, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, చైనా, నమీబియా, సింగపూర్, కెనడా, యూఎస్ఏ, కెన్యా, పాకిస్థాన్, ట్రినిడాడ్ & టొబాగో, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బంగ్లాదేశ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా -
IPL 2024: డారిల్ మిచెల్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు డారిల్ మిచెల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టిన మిచెల్.. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2021 సీజన్లో మొహమ్మద్ నబీ (సన్‌రైజర్స్).. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి (ఓ ఇన్నింగ్స్‌లో) ఐదు క్యాచ్‌ల ఘనత సాధించాడు. వికెట్‌కీపర్లలో కుమార సంగక్కర ప్రస్తుతం కనుమరుగైన డెక్కన్ ఛార్జర్స్ తరఫున గతంలో ఈ ఫీట్‌ను సాధించాడు. 2011 సీజన్లో సంగక్కర ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌ల ప్రదర్శన నమోదు చేశాడు. 5 catches in an IPL match:Mohammad Nabi vs MI, Abu Dhabi, 2021Daryl Mitchell vs SRH, Chennai, 2024 pic.twitter.com/2QfcuZt1vl— CricTracker (@Cricketracker) April 28, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ తొలుత బ్యాట్‌తో రాణించి (52), ఆతర్వాత ఫీల్డ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. మిచెల్.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98) కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్‌పై సీఎస్కే 78 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్, డారిల్ మిచెల్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్ దేశ్ పాండే (3-0-27-4), ముస్తాఫిజుర్ (2.5-0-19-2), పతిరణ (2-0-17-2), రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్ ఠాకూర్ (4-0-27-1) సన్‌రైజర్స్ పతనాన్ని శాశించారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15), నితీశ్ రెడ్డి (15), క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: హార్దిక్‌పై గుర్రుగా ఉన్న నబీ.. వైరల్ పోస్ట్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై సొంత జట్టు అభిమానులే కాక సహచర ఆటగాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దిగ్గజాలు కల్పించుకోవడంతో అభిమానులు కాస్త మెత్తపడినా.. సహచరులు మాత్రం హార్దిక్ తీరును ఎండగడుతూనే ఉన్నారు. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్ లాంటి సీనియర్లు గతంలో పలుమార్లు తమ అసంతృప్తిని వెల్లగక్కగా.. తాజాగా మరో సీనియర్ వీరి సరసన చేరాడు. స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) నిన్న పంజాబ్‌తో మ్యాచ్ పూర్తయిన అనంతరం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నబీ అభిమాని పోస్ట్ చేసింది. దాన్నే నబీ తన పోస్ట్‌గా యాడ్ చేశాడు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మీ కెప్టెన్ (ముంబై ఇండియన్స్) తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేటి మ్యాచ్‌లో నబీ బౌలింగ్ చేయలేదు. అయినా గేమ్ ఛేంజర్ అయిన నబీ కీలక సమయంలో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేసి ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడని నబీ అభిమాని హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని వెల్లగక్కాడు. Mohammad Nabi's Instagram story. pic.twitter.com/Rk4qWoIOsl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 ఇదే పోస్ట్‌ను నబీ కూడా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి మద్దతు తెలిపాడు. నబీ.. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయటపెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని వ్యక్త పరిచాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ముంబై ఇండియన్స్‌లో చాలామంది సీనియర్ల లాగే నబీ కూడా అసంతృప్తిగా ఉన్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు నబీకి మద్దతుగా నిలుస్తూ.. హార్దిక్ కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కెప్టెన్సీ చేయడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనలో 19వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చి అప్పటికి కీలకమైన హర్‌ప్రీత్ బ్రార్ వికెట్ పడగొట్టాడు. ఒకవేళ హార్దిక్ ప్రయోగం (బౌలింగ్ చేయడం) బెడిసికొట్టుంటే అతని మెడపై పెద్ద కత్తి వేలాడేది. అంతిమింగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్.. క్లీన్‌స్వీప్ చేసిన లంక
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రహ్మత్ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నబీ... ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్స్ కొత్త ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌లో కొనసాగిన షకీబ్ అల్ హసన్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. -
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
సంచలన శతకం.. సచిన్ రికార్డు బ్రేక్.. కానీ!
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య లంక విధించిన 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 55 పరుగులకే అఫ్గన్ ఐదు వికెట్లు కోల్పోయిన వేళ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఒంటరి పోరాటం చేస్తున్న ఐదో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(149- నాటౌట్)కు తోడైన నబీ.. తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించాడు. ఒమర్జాయ్తో కలిసి అరుదైన రికార్డు ఈ క్రమంలో ఒమర్జాయ్తో కలిసి అరుదైన ఘనత సాధించిన నబీ.. తన అద్భుత శతకంతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డునూ బద్దలు కొట్టాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్- మహ్మద్ నబీ కలిసి 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్తాన్ తరఫున ఆరో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. సచిన్‌కు ఎంతో ప్రత్యేకం ఆ సెంచరీ ఇక మహ్మద్ నబీ 39 ఏళ్ల 39 రోజుల వయసులో ఈ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా.. అత్యధిక వయసులో వన్డేల్లో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ను అధిగమించాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మిర్పూర్ వన్డేలో.. 38 ఏళ్ల 327 రోజుల వయసులో సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్లో అదే వందో శతకం కావడం విశేషం. జాబితాలో ముందున్నది వీళ్లే ఇదిలా ఉంటే.. అత్యధిక వయసులో వన్డే శతకం సాధించిన జాబితాలో ఖుర్రం ఖాన్(132 రన్స్- యూఏఈ- 43 ఏళ్ల 162 రోజులు), సనత్ జయసూర్య(107 రన్స్- శ్రీలంక- 39 ఏళ్ల 212 రోజులు), క్రిస్ గేల్(162 రన్స్- 39 ఏళ్ల 159 రోజులు), ఎడ్ జోయిస్(116 రన్స్- 39 ఏళ్ల 111 రోజులు), జెఫ్రీ బాయ్‌కాట్(105- రన్స్- 39 ఏళ్ల 51 రోజులు) నబీ కంటే ముందున్నారు. కాగా శ్రీలంకతో తొలి వన్డేలో ఒమర్జాయ్, నబీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 42 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. -
టీమిండియాతో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన జద్రాన్ బృందం
టీమిండియాతో తొలి టీ20లో అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టుపై పొట్టి ఫార్మాట్లో తమకున్న రికార్డును జద్రాన్ బృందం తాజాగా బ్రేక్ చేసింది. టీ20 సిరీస్ ఆడేందుకు తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న అఫ్గనిస్తాన్‌కు 22 ఏళ్ల బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఆటకు దూరం కాగా.. అతడి స్థానంలో జద్రాన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా మొదటి టీ20లో టాస్ ఓడిన అఫ్గనిస్తాన్ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 29 పరుగులతో రాణించాడు. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 అరంగేట్ర ప్లేయర్ రహ్మత్ షా(3) విఫలం కాగా.. మహ్మద్ నబీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో నజీబుల్లా 11 బంతుల్లో 19, కరీం జనత్ 5 బంతుల్లో 9 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో అఫ్గన్ 158 పరుగులు స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. శివం దూబే ఒక వికెట్ దక్కించుకున్నాడు. రవి బిష్ణోయి 3 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాపై టీ20లలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా అబుదాబిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తాజాగా జద్రాన్ బృందం ఆ రికార్డును తిరగరాసి చరిత్ర సృష్టించింది. -
అఫ్గానిస్తాన్‌కు బిగ్ షాకిచ్చిన యూఏఈ.. సంచలన విజయం
2023 ఏడాదిని యూఏఈ క్రికెట్ జట్టు సంచలన విజయంతో ముగించింది. ఆదివారం షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 11 పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది. ఓవరాల్‌గా అఫ్గాన్‌పై యూఏఈకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(53), ఆర్యన్ లాక్రా(63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్, క్వైస్ అహ్మద్ తలా రెండు వికట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నబీ చెరో వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో నబీ( 27 బంతుల్లో 47) పోరాడనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. యూఏఈ బౌలర్లలో అలీ నసీర్, జవదుల్లా చెరో 4 వికెట్లతో సత్తాచాటారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 జనవరి 3న షార్జా వేదికగా జరగనుంది. -
WC 2023: అతడు ఎప్పుడూ ఇలాగే.. సెమీస్ చేరుతాం: అఫ్గనిస్తాన్ కెప్టెన్
ICC WC 2023- Afg Vs Ned- Hashmatullah Shahidi: ‘‘ఈరోజు మా బౌలర్లు రాణించారు. బ్యాట్‌తోనూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాం. లక్ష్యాన్ని ఛేదించాం. ఈ టోర్నీలో ఛేజింగ్‌లో విజయవంతం కావడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక మహ్మద్ నబీ గురించి చెప్పేదేముంది. అతడు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. ఎప్పుడూ ఇలాగే.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ పట్టుదలగా నిలబడతాడు. మేమంతా సమిష్టి కృషితో ఇక్కడి దాకా చేరుకున్నాం. ప్రతీ గెలుపును పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒకవేళ మేము గనుక ఆ ఫీట్ సాధిస్తే అంతకంటే పెద్ద విషయం మరొకటి ఉండదు’’ అని అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నాం వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టు సాధిస్తున్న విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నామంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇలాగే ముందుకు సాగి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నామని తెలిపాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో అఫ్గన్ జట్టు నాలుగో గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే మూడు మాజీ చాంపియన్లను ఓడించిన హష్మతుల్లా బృందం శుక్రవారం నాటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్పిన్నర్ల ధాటికి అఫ్గన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కీలక సమయంలో రనౌట్ల కారణంగా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అఫ్గన్ స్పిన్నర్లు మహ్మద్ నబీ మూడు, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒకటి, నూర్ అహ్మద్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గన్‌ను డచ్ బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీం జద్రాన్(20)లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. హష్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(52) అర్ద శతకం సాధించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 56, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి అఫ్గన్‌కు విజయం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ ముగ్గురు రాణించడంతో 31.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించిన అఫ్గనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగపరచుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హష్మతుల్లా మాట్లాడుతూ.. ఈసారి తాము కచ్చితంగా సెమీ ఫైనల్ రేసులో నిలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం మా అమ్మను కోల్పోయాం. మా కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మా దేశానికి చెందిన చాలా మంది శరణార్థులు బతుకుపోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల బాధను మేము అర్థం చేసుకోగలం. ఈ రోజు ఈ విజయాన్ని వాళ్లకు అంకితం చేస్తున్నాం’’ అని హష్మతుల్లా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ -
అతిపెద్ద పొరపాటు.. తప్పని భారీ మూల్యం.. కనీసం సింగిల్ తీసినా..
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అఫ్గన్‌పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది. కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది. అతిపెద్ద పొరపాటు కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్‌తో గాడిన పడింది. ఆ విషయం తెలియదా? అయితే, రన్‌రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r — AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023 -
Asia Cup 2023: మొహమ్మద్ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో నబీ విధ్వంసకర అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఈ రికార్డు ముజీబ్ పేరిట ఉండేది. ముజీబ్ ఇదే ఏడాది పాక్‌పై 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అంతకుముందు రషీద్ ఖాన్ (27 బంతుల్లో), మొహ్మమద్ నబీ (28), షఫీకుల్లా షిన్వారి (28) ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేశారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ట్రాక్ మార్చుకుని గెలుపుబాట పట్టింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (41), అసలంక (36), దునిత్ వెల్లెలెగె (33 నాటౌట్), కరుణరత్నే (32), తీక్షణ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నబీ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకపడటంతో 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్‌ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్‌కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్‌ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్‌కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్‌లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
పాక్ భరతం పట్టిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు.. పేక మేడలా కూలిన బాబర్ సేన
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ల ధాటికి వరల్డ్ నంబర్ 2 టీమ్ పేకమేడలా కూలింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1)లు పాక్ ఆటగాళ్ల భరతం పట్టారు. ఫలితంగా ఆ జట్టు 47.1 ఓవర్లలో కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆరంభంలోనే వణికించారు. ముఖ్యంగా ముజీబ్ పాక్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ముజీబ్ కీలకమైన బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్‌లను (21) ఔట్ చేసి పాక్‌ను ఇరకాటంలో పడేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇమామ్ ఉల్ హాక్ (61).. ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (39)ల సాయంతో పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే మహ్మద్ నబీ.. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఇమామ్‌ల వికెట్లు పడగొట్టి పాక్‌ను భారీ స్కోర్ చేయనీకుండా కట్టడి చేశాడు. కీలక సమయంలో షాదాబ్ ఖాన్ కూడా రనౌట్ కావడంతో పాక్ తక్కువ స్కోర్‌కే పరిమితంకాక తప్పలేదు. రషీద్ ఖాన్ సైతం కీలకమైన అఘా సల్మాన్ (7), షాహీన్ అఫ్రిది (2) వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫకర్ జమాన్ (2) ఔట్ చేసి ఫారూకీ పాక్ పతనానికి నాంది పలకగా.. హరీస్ రౌఫ్ (1)ను ఔట్ చేసి రెహ్మాత్ పాక్ ఇన్నింగ్స్‌ను లాంఛనంగా ముగించాడు. నసీం షా (18 నాటౌట్) పాక్‌ను 200 పరుగుల మార్కును దాటించడంతో సాయపడ్డాడు. -
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్, 26 ఏళ్ల యువ ఓపెనర్ ఉస్మాన్ ఘనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి పాక్షికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డులో అవినీతి నాయకత్వమే తన కఠిన నిర్ణయానికి కారణమని వెల్లడించాడు. మేనేజ్మెంట్, సెలెక్షన్ కమిటీలు మారే వరకు తన నిర్ణయాన్ని మార్చుకోనని, వారు మారాక గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని, అప్పటివరకు ఆటపై పట్టు కోల్పోకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటానని తెలిపాడు. After careful consideration, I have decided to take a break from Afghanistan Cricket. The corrupt leadership in the cricket board has compelled me to step back. I will continue my hard work and eagerly await the right management and selection committee to be put in place. 1/3 pic.twitter.com/lGWQUDdIwJ — Usman Ghani (@IMUsmanGhani87) July 3, 2023 17 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 435 పరుగులు.. 35 టీ20ల్లో 4 అర్ధసెంచరీలతో 786 పరుగులు చేసిన ఉస్మాన్ ఘనీని ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ మేనేజ్మెంట్ జట్టుకు దూరంగా ఉంచింది. అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నా సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోయిన ఘనీ.. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకునేందుకు మేనేజ్మెంట్కు సంప్రదించే ప్రయత్నం చేశాడు. అయితే ఘనీ.. బోర్డు చైర్మన్‌ను, చీఫ్ సెలెక్టర్‌ను ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా వారు ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.దీంతో అతను చేసేదేమీ లేక క్రికెట్ నుంచి పాక్షిక విరామం తీసుకున్నాడు. ఘనీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున కొన్ని మ్యాచ్‌లే ఆడినా, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ క్రికెట్లో ఘనీకి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. -
ఆఫ్గన్ ఆటగాడిపై గుడ్లు ఉరిమి చూశాడు.. ఎవరీ క్రికెటర్?
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టి20 పాకిస్తాన్ గెలిచినప్పటికి తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన ఆఫ్గన్ తొలిసారి పాక్‌పై సిరీస్ విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఆఫ్గన్ విజయంలో సీనియర్ ఆటగాడు మహ్మద్ నబీ కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే మూడో టి20 సందర్భంగా మహ్మద్ నబీని పాకిస్తాన్ క్రికెటర ఒకరు గుడ్డు ఉరిమి చూశాడు. అతని చూపు చూస్తే.. కోపంతో రగిలిపోతూ అవకాశం వస్తే తినేస్తా అన్నట్లుగా ఉంది. మరి ఇంతకీ నబీవైపు కోపంగా చూసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. అజమ్ ఖాన్. సొంత క్రికెటర్ల చేత బాడీ షేమింగ్ అవమానాలు ఎదుర్కొన్నది ఇతనే. అంతేకాదు మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కొడుకు కూడా. జట్టుతో పాటే ఉన్నప్పటికి ఆఫ్గన్‌తో టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయితే రెండో టి20లో మాత్రం రెగ్యులర్ కీపర్ మహ్మద్ హారిస్ స్థానంలో అజమ్ ఖాన్ కొంతసేపు వికెట్ కీపింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో నబీ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా నబీవైపు అజమ్ ఖాన్ కోపంగా చూడడం గమనించిన కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. కాగా అజమ్ ఖాన్ పాకిస్తాన్ తరపున మూడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక సోమవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. pic.twitter.com/knDEtRhZDb — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2023 చదవండి: 'నా దృష్టిలో కోహ్లినే బెటర్.. ఎందుకంటే?' చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే -
చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తటస్థ వేదికలో పాకిస్తాన్‌పై సిరీస్ గెలవడం ఆఫ్గన్‌కు ఇదే తొలిసారి. సోమవారం రాత్రి జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆఫ్గన్ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షాదాబ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాగా.. సిరీస్ ఆద్యంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. Afghanistan put on a remarkable all-round display in the 3-match T20I series to secure a historic 2-1 series win over Pakistan after winning the first two matches of the series. Read More: https://t.co/a8pQYZh5f6 pic.twitter.com/tMg7wgXt8y — Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023 What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
నాశనం చేయకండి: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు
IPL- Sunrisers Hyderabad: ‘‘నేను, రషీద్ 2017లో జట్టులోకి వచ్చినపుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతి మూడేళ్లు టీమ్ కాంబినేషన్లు చక్కగా కుదిరాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు. అందుకు గల కారణాలు ఏమిటో, కారకులు ఎవరో నాకు తెలియదు గానీ.. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆటగాళ్లు ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు విముఖత చూపడం ఆరంభించారు’’ అని అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. నబీతో పాటు అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఐపీఎల్-2016 విజేత సన్‌రైజర్స్ తరఫున గతంలో ఆడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఎస్ఆర్హెచ్తో బంధం లేదు. తరచూ మార్పులు కాగా 2016లో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్ తర్వాత అతడిని రిలీజ్ చేసింది. అదే విధంగా.. జట్టులో కీలక సభ్యుడైన రషీద్ ఖాన్‌ను ఐపీఎల్-2022 వేలానికి ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రషీద్‌ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ బౌలర్... ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు. మరోవైపు.. సన్‌రైజర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ -2023 మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్‌రైజర్స్ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు. నాశనం చేయకండి అంటూ ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ.. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్ఆర్హెచ్కు హితవు పలికాడు. ‘‘జట్టును నాశనం చేయడానికి బదులు.. పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. తరచూ మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రషీద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న రషీద్ ఖాన్.. వాళ్లను వదిలివెళ్లేలా చేసుకున్నారు. రషీద్ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. సన్‌రైజర్స్ ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతోందా?’’ అని ఈ ఆల్‌రౌండర్.. ఎస్ఆర్హెచ్ విధానాల పట్ల విమర్శలు సంధించాడు. కాగా 2021లో మహ్మద్ నబీకి సన్‌రైజర్స్‌తో బంధం తెగిపోయింది. ఇక గతేడాది 14 మ్యాచ్‌లకు గానూ 6 గెలిచిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. -
ఆఫ్గన్ ఓటమి.. కెప్టెన్సీ పదవికి మహ్మద్ నబీ రాజీనామా
టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మహ్మద్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నబీ శుక్రవారం స్వయంగా తన ట్విటర్లో పేర్కొన్నాడు. ''మా టి20 వరల్డ్‌కప్ ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచకప్‌లో మాకు వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా మద్దతు దారులకు కానీ నచ్చలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఒక సంవత్సరం నుంచి మా జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన స్థాయిలో లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే పేజీలో లేము. ఇది జట్టు బ్యాలెన్స్‌పై ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించా. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్కు తెలిపాను.కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి ఒక ఆటగాడిగా మాత్రం కంటిన్యూ అవుతాను. ఇన్నాళ్లు కెప్టెన్‌గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు దెబ్బతిన్నప్పటికి మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లవ్ యూ అఫ్గానిస్తాన్ ''అంటూ ముగించాడు. ఇక మహ్మద్ నబీ కెప్టెన్‌గా ఎంపికయ్యాకా అఫ్గానిస్తాన్ గోల్డెన్ డేస్ చూసింది. అతని హహాంలోనే ఆఫ్గన్ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చింది. 2017లో ఆఫ్గన్ టెస్టు హోదా కూడా పొందింది. మొత్తంగా మహ్మద్ నబీ అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా 28 వన్డేలు, 35 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/oSpzXxMFGB — Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022 -
చెలరేగిన నబీ, నిప్పులు చెరిగిన ఫరూఖీ.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన అఫ్ఘాన్
T20 WC Warm Up Matches: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మూడో వార్మప్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆతిధ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించగా.. రెండో మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో అప్ఘాన్ జట్టు అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగి తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌ను 62 పరుగుల భారీ తేడాతో ఓడించి శభాష్ అనిపించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీమ్ జద్రాన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ నబీ (17 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అహ్మద్, షకీబ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఫజల్ హాక్ ఫారూఖీ (3/9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/5), మహ్మద్ నబీ (1/11) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులకు మాత్రమే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆద్యంతం బంగ్లా బ్యాటింగ్ చెత్తగా సాగింది. -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ
T20 World Cup 2022- Afghanistan Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకై అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును పంపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫ్గన్ బోర్డు గురువారం ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్‌గా నబీ.. వైస్ కెప్టెన్‌గా.. ప్రధాన జట్టుతో పాటు నలుగురు రిజర్వు ప్లేయర్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక వరల్డ్‌కప్‌లో మహ్మద్ నబీ అఫ్గన్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియాకప్- 2022 టోర్నీకి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన యువ బౌలర్ కైస్ అహ్మద్.. ఈసారి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ ఆరంభంలో అదుర్స్.. కానీ ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో అఫ్గనిస్తాన్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన నబీ బృందం.. తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, సూపర్ -4 దశలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు గట్టిపోటీనిచ్చినా చివరికి పరాజయం పాలైంది. టీమిండియాతో చేతిలో ఓడి.. ఓటమితో టోర్నీని ముగించింది. టీ20 ప్రపంచకప్-2022కు అఫ్గనిస్తాన్ ప్రకటించిన జట్టు: మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్. రిజర్వు ప్లేయర్లు: అఫ్సర్ జజాయ్, షరాఫుదీన్ అష్రఫ్, గుల్బదిన్ నాయీబ్, రహ్మత్ షా. చదవండి: T20 WC 2022: అందుకే రసెల్‌ను ఎంపిక చేయలేదు: విండీస్ చీఫ్ సెలక్టర్ 'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉండాల్సింది' 🚨 BREAKING NEWS 🚨 Afghanistan Cricket Board today announced its 15-member squad for the ICC @T20WorldCup 2022, which will be played from 16th October to 13th November in Australia. More: https://t.co/1x7it7hx5w pic.twitter.com/ToTKvyCzM4 — Afghanistan Cricket Board (@ACBofficials) September 15, 2022 -
ఆఫ్గన్‌తో మ్యాచ్.. రోహిత్‌కు రెస్ట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో ఇవాళ(గురువారం) భారత్, అఫ్గనిస్తాన్‌ల మధ్య నామమాత్రపు పోరు జరగనుంది. శ్రీటాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్, హార్దిక్ పాండ్యా, చహల్ స్థానాల్లో దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్‌లు తుది జట్టులోకి వచ్చారు. అఫ్గనిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. లంక, పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన టీమిండియా కనీసం అఫ్గన్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఫ్గనిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ పోరాట పటిమ అందరిని ఆకట్టుకుంది. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్.. ఆఖరి ఓవర్లో చేసిన తప్పిదంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. భారత్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ అఫ్గనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరూఖీ -
Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు
ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా ఆఖరి ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌ను గెలిపించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేసింది 129 పరుగులే అయినప్పటికీ.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa — Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022 అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేశారు. మ్యాచ్ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్ అభిమానులతో కలిసి మ్యాచ్ చూసిన ఆఫ్ఘన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా పేట్రేగిపోయి తాలిబన్లలా అమానవీయంగా వ్యవహరించారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ దెబ్బకు పాక్ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏ క్రీడలోనైనా గెలుపోటములు సహజమని, వాటిని క్రీడా స్పూర్తితో స్వీకరించాలే కానీ ఇలా దాడులకు దిగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో ఇలాంటి చర్యలను సహించకూడదని, ఆఫ్ఘన్ అభిమానులను స్టేడియాల్లోకి రానీయకుండా నిషేధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించడాన్ని మాత్రం భారత అభిమానులు తప్పుపడుతున్నారు. అక్తర్ ఆఫ్ఘన్ అభిమానుల దుశ్చర్యను ఖండిస్తూ, హిత బోధ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అక్తర్ చిలకపలుకులు పలికింది చాలు.. ముందు మీ ఆటగాళ్లను ప్రవర్తన సరిచేసుకోమని చెప్పు అంటూ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘన్ బౌలర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ను ఆసిఫ్ అలీ బ్యాట్‌తో కొట్టబోయాడు. చదవండి: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా -
నామమాత్రపు పోరులో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న భారత్.. ఈ మ్యాచైనా గెలుస్తుందా..?
Asia Cup 2022 IND VS AFG: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్ ఆఖరి పోరుకు ముందే నిష్క్రమణకు సిద్ధమైంది. సూపర్–4లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య నేడు నామమాత్రమైన మ్యాచ్ జరుగుతుంది. రెండేసి విజయాలతో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరడంతో గురువారం జరిగే మ్యాచ్ ఆడి రావడం తప్ప టీమిండియా, అఫ్గానిస్తాన్లకు యూఏఈలో ఇక ఏం మిగల్లేదు. ఒత్తిడిలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఫైనల్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న భారత్ ఒత్తిడిలో కూరుకుపోయింది. గ్రూప్ దశలో బాగున్న పరిస్థితి ‘సూపర్–4’కు వచ్చేసరికి మారిపోయింది. ఓపెనింగ్‌లో రాహుల్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌ల ప్రదర్శన భారత మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై టి20 ప్రపంచకప్ ఆడాల్సిన జట్టు ఇది కాదేమోనన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది. హిట్టర్లుగా ముద్రపడిన రాహుల్, పాండ్యా, పంత్‌లు పాక్, శ్రీలంకలతో జరిగిన పోటీల్లో ఆడినట్లుగా లేదు. అదేదో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లా తేలిగ్గా తీసుకున్నారు. ఇక బౌలింగ్ విభాగం కూడా తీసికట్టుగానే ఉంది. అనుభవజ్ఞుడైన సీమర్ భువనేశ్వర్, స్పిన్నర్లు చహల్, అశ్విన్ ఇలా ఎవరూ మ్యాచ్‌ను మలుపుతిప్పే వికెట్లే తీయలేదు. ఇది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు కూర్పుపై చేస్తున్న కసరత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. -
మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా
సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీకి వందో మ్యాచ్. సాధారణంగా ఒక క్రికెటర్‌కు వందో మ్యాచ్ అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఎలాగైనా ఆ మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి నబీ ప్రతిష్టాత్మక వందో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా నబీ టి20 క్రికెట్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. టి20ల్లో వందో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన తొలి ఆటగాడిగా మహ్మద్ నబీ నిలిచాడు. ఇక నబీ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో నబీ స్కోర్లు 5, 9, 6, 5, 0, 8, 1, 0 ఉన్నాయి. ఇందులో రెండు గోల్డెన్ డక్‌లు ఉండడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ గెలుస్తూనే టీమిండియాకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. -
పాక్‌తో మ్యాచ్.. ఆఫ్గన్ గెలిస్తేనే టీమిండియాకు అవకాశం
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో బుధవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మద్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక అఫ్గానిస్తాన్ గెలుపుపైనే టీమిండియాకు ఆసియా కప్‌లో అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఆఫ్గన్ ఓడిందో ఇక టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే. శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓడిన అఫ్గానిస్తాన్‌కు పాక్‌తో మ్యాచ్ కీలకమని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో నజీబుల్లా జర్దన్, రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్, హజరతుల్లా జజాయ్‌లు, కెప్టెన్ మహ్మద్ నబీ పెద్ద బలం కాగా.. వీరు విఫలమైతే మాత్రం అఫ్గన్‌లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. ఇక బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్‌లు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక టీమిండియాపై విజయంతో జోష్‌లో ఉన్న పాకిస్తాన్.. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతుంది. కెప్టెన్ బాబర్ ఆజం విఫలమైనప్పటికి.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సహా ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, కుష్దిల్ షా, ఇఫ్తికర్ అహ్మద్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తుండడం సానుకూలాంశం. ఇక బౌలింగ్‌లో నసీమ్ షా, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అంచనాలకు మంచి రాణిస్తున్నారు. ఇక రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు టి20ల్లో రెండుసార్లు తపలడగా.. రెండుసార్లు పాక్‌నే విజయం వరించింది. 2013లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత గతేడాది టి20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడగా పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఇక వన్డేల్లో నాలుగుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ పాకిస్తాన్నే విజయం వరించింది. -
ఆఫ్గానిస్తాన్‌పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకోనుందా..?
ఆసియాకప్-2022లో లీగ్ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఆఫ్గానిస్తాన్, శ్రీలంక సూపర్-4లో అడుగు పెట్టాయి. ఇక ఈ మెగా టోర్నీలో సూపర్-4 దశకు శనివారం తెరలేవనుంది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో గ్రూపు-బి నుంచి ఆఫ్గానిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షార్జా వేదికగా శనివారం(సెప్టెంబర్-3) సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 27న శ్రీలంకను ఆఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. ఆఫ్గానిస్తాన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నబీ సేన.. అన్నింటిల్లోనూ విజయం సాధించి గ్రూప్-బి నుంచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్ చేతిలో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిడం ఆ జట్టుకు కాస్త ఊరటను కలిగించింది. హాట్ ఫేవరేట్‌గా ఆఫ్గానిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు నజీబుల్లా జద్రాన్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కాగా ప్రస్తుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా ఆఫ్గానిస్తాన్ కొనసాగిస్తే.. సూనయసంగా విజయం సాధించడం ఖాయం. బౌలర్లు చేలరేగితే! ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిల్లోనూ విఫలమైన లంక, రెండు మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ పరంగా అదరగొట్టింది. అయితే ఆ జట్టులో అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హాసరంగా ఉన్నప్పటికీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు రాణిస్తే ఆఫ్గాన్‌కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, కెప్టెన్ శనక మంచి టచ్‌లో ఉన్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై ఓటమికి లంక బదులు తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. చదవండి: Ind Vs Pak: హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే! -
Asia Cup 2022: బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను చిత్తు చేసి ఆఫ్ఘనిస్థాన్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్ టార్గెట్‌ను 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్ 10వ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మొసద్దెక్ హొసేన్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజాయ్ (23) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/2. ఆచితూచి ఆడుతున్న ఆఫ్ఘాన్ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల ముగిసే సమాయానిఆ జట్టు స్కోర్ 37/1గా ఉంది. హజ్రతుల్లా జజాయ్ (17), ఇబ్రహీమ్ జద్రాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘానిస్తాన్ 128 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘానిస్తాన్ ఐదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో ఓపెనర్ గుర్బాజ్ (11) స్టంప్ అవుటయ్యాడు. 4.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘానిస్తాన్ స్కోర్ 15/1. బంగ్లాను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు బంగ్లాదేశ్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేశారు. ముజీబ్, రషీద్ ఖాన్లు తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. మొసద్దెక్ హొసేన్ (48 నాటౌట్) రాణించడంతో బంగ్లా జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రషీద్ ఖాతాలో మరో వికెట్ ఆఫ్ఘన్ స్పిన్నర్లలో తొలుత ముజీబ్.. ఆతర్వాత రషీద్ ఖాన్ రెచ్చిపోయారు. 16వ ఓవర్లో రషీద్.. మహ్మదుల్లాను (25) ఔట్ చేయడం ద్వారా 3 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 16 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 95/6. 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిలలాడుతుంది. ఆ జట్టు 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను దాదాపు ఆఫ్ఘనిస్తాన్ చేతికి అప్పగించింది. 11వ ఓవర్లో రషీద్ ఖాన్.. అఫీఫ్ హొసేన్‌ను (12) ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ముచ్చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీరిద్దరు బంగ్లా ఆటగాళ్లను కుదురుకోనీయకుండా వరుస క్రమంలో వికెట్లు పడగొడుతున్నారు. తొలుత ముజీబ్ రెచ్చిపోగా.. తాజాగా రషీద్ చెలరేగుతున్నాడు. 7వ ఓవర్లో రషీద్.. అద్భుతమైన గూగ్లీతో ముష్ఫికర్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెచ్చిపోతున్న ముజీబ్.. ఈసారి కెప్టెన్ బలి ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ బంగ్లా ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాను వేసిన మూడు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచాడు. ఆరో ఓవర్లో ముజీబ్.. బంగ్లా కెప్టెన్ షకీబ్ (11)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 28/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (1), అఫీఫ్ హొసేన్ (2) ఉన్నారు. బంగ్లాను మరో దెబ్బకొట్టిన ముజీబ్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మహ్మద్ నయీమ్ (8)ను క్లీన్ బౌల్డ్ చేసిన ముజీబుర్ రెహ్మాన్.. నాలుగో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. ముజీబ్.. అనాముల్ హాక్ (5)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో షకీబ్, ముష్ఫికర్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అనాముల్ హాక్ (1), కెప్టెన్ షకీబ్ ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆసియా కప్ 2022 గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 30) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఫీఫ్ హొసేన్, మహ్మద్ నయీం, అనాముల్ హాక్, మొసద్దెక్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్ -
ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం
Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్ అడైర్ (3/16), జాషువ లిటిల్ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. పాల్ స్టిర్లింగ్ (10 బంతులో 16), లోర్కన్ టక్కర్ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్ (5 బంతుల్లో 9), జార్జ్ డాక్రెల్ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డిసైడర్ దాకా తీసుకువచ్చింది. చదవండి: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ -
Asia Cup 2022: మెగా టోర్నీకి జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్
ఆసియా కప్-2022 టోర్నీకి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది. కాగా ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సారథ్యంలోని అఫ్గనిస్తాన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అక్కడికి వెళ్లిన జట్టులో కేవలం ఒకే ఒక మార్పుతో నబీ బృందం ఆసియా కప్ బరిలోకి దిగనుంది. షరాఫుద్దీన్ ఆష్రఫ్ స్థానంలో ఆల్‌రౌండర్ సమీఉల్లా శిన్వారీ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. అష్రఫ్‌ను రిజర్వు ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా శిన్వారీ 2020 మార్చిలో ఐర్లాండ్‌తో చివరిగా సారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏకంగా మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. అయితే.. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడిని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేసినట్లు అఫ్గనిస్తాన్ చీఫ్ సెలక్టర్ నూర్ మాలిక్జాయ్ తెలిపాడు. ఇక 17 ఏళ్ల లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు కూడా జట్టులో స్థానం దక్కడం విశేషం. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ సాగనుంది. మరోవైపు.. ఆగష్టు 17న ఆఖరి టీ20తో అఫ్గన్ జట్టు ఐర్లాండ్ పర్యటనను ముగించనుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచి 2-2తో సమంగా ఉన్నాయి. ఆసియా కప్-2022కు అఫ్గనిస్తాన్ జట్టు: మహ్మద్ నబీ(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజార్తుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్, హష్మతుల్లా షాహిది, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, అజ్మతుల్లా ఓమర్జాయ్, సమీఉల్లా శిన్వారీ, రషీద్ ఖాన్, ఫాజల్ హక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్. రిజర్వు ప్లేయర్లు: కైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్, నిజత్ మసూద్. చదవండి: Abudhabi Night Riders ILT20: కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్.. Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. తాజా అప్డేట్లు! ACB Name Squad for Asia Cup 2022 Kabul, 16 August 2022: Afghanistan Cricket Board today announced its 17-member squad for the ACC Men's T20 Asia Cup 2022, which will be played from 27th August to 11th September in the United Arab Emirates. Read More: https://t.co/0Py8GqhiK4 pic.twitter.com/B5bK9tn2R4 — Afghanistan Cricket Board (@ACBofficials) August 16, 2022 -
Ire Vs Afg: వరుసగా రెండు ఓటముల తర్వాత ఎట్టకేలకు..
Ireland vs Afghanistan, 3rd T20I : ఐర్లాండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన అఫ్గనిస్తాన్‌కు ఎట్టకేలకు విజయం దక్కింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో మహ్మద్ నబీ బృందం 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. అర్ధ శతకంతో రాణించిన అఫ్గన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్(35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అఫ్గనిస్తాన్.. ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్‌లలో ఐర్లాండ్ వరుసగా 7 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది పర్యాటక జట్టుకు గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో మూడో టీ20లో విజయం సాధించిన అఫ్గనిస్తాన్ సిరీస్ గెలుపు రేసులో నిలిచింది. మ్యాచ్ సాగిందిలా! బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ శుక్రవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అందరూ అదరగొట్టారు.. కెప్టెన్ మాత్రం ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ 39, గుర్బాజ్ 53 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇబ్రహీం 36, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నజీబుల్లా 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మహ్మద్ నబీ(6) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. ఆదిలోనే ఎదురుదెబ్బ! ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ డకౌట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్ చేరాడు. ఓపెనింగ్ జోడీ విఫలం కావడం సహా మిడిలార్డర్ కుప్పకూలడంతో ఐర్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అయితే, జార్జ్ డాక్రెల్ 58 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసినా వృథానే అయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. Keep going, George! SCORE: https://t.co/iHiY0U5y7J STREAM UK & ROI: https://t.co/er67plljbH#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/jFAgBgjQOO — Cricket Ireland (@cricketireland) August 12, 2022 చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్ దిశగా వెస్టిండీస్ -
ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం!
బెల్ఫాస్ట్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఐర్లాండ్ అధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐరీష్ బౌలర్లలో జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 123 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్..19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ 46 పరుగులతో రాణించగా, అఖరిలో డాకెరల్ 25 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో కెప్టెన్ నబీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ముజీబ్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరిచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టీ20 బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! -
Ire Vs Afg: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. ఏడు వికెట్లతో చిత్తు చేసి..
Afghanistan tour of Ireland, 2022- Ireland Vs Afghanistan 1st T20: ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్న ఐర్లాండ్ జట్టు.. అఫ్గనిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. శుభారంభమే అయినా.. ఈ క్రమంలో బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది అఫ్గనిస్తాన్. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్(26), ఉస్మాన్ ఘని(59) శుభారంభం అందించారు. కానీ ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మహ్మద్ నబీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ఇబ్రహీం జద్రాన్ 29 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 168 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్‌కు ఒకటి, బ్యారీ మెకార్తీకి మూడు, గరెత్ డెలనీకి ఒకటి, జార్జ్ డాక్రెల్కు రెండు వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లు ఆది నుంచి దంచికొట్టారు. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(38 బంతుల్లో 51 పరుగులు)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ సైతం హాఫ్ సెంచరీ(32 బంతుల్లో 50 పరుగులు) చేశాడు. 50 partnership up between the two openers! SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/6oVMBS8LU3 — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హ్యారీ టెక్టర్ 15 బంతుల్లో 25, జార్జ్ డాక్రెల్ 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించిన ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. Two half-centuries in three T20I innings for Lorcan Tucker 👏 SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/qcF2DXbses — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హాఫ్ సెంచరీ హీరో, కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లకు ఐర్లాండ్ గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సేనతో రెండో టీ20లో.. కివీస్‌తో మూడో వన్డేలో ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. చదవండి: Nitu Ghanghas: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘బంగారం’తో మెరిసి.. Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
సీఎస్కేతో తొలి మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో మహ్మద్ నబీ
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టీ20 క్రికెట్లో ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నబీ మరో నాలుగు పరుగులు సాధిస్తే.. టీ20ల్లో 5,000 పరుగులు చేసిన క్లబ్లో చేరుతాడు. అయితే టీ20ల్లో 5,000 పరుగులు, 300కి పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డులెక్కుతాడు. అంతకుముందు కీరన్ పొలార్డ్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావోలు ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు తన కెరీర్లో 329 మ్యాచ్‌లు ఆడిన నబీ 4,996 పరుగులతో పాటు, 302 వికెట్లు సాధించాడు. ఇక మార్చి 26 న వాంఖడే వేదికగా కేకేఆర్- సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) - 11,427 పరుగులు, 304 వికెట్లు డ్వేన్ బ్రావో (వెస్టిండీస్) - 6747 పరుగులు,571 వికెట్లు ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) - 6574 పరుగులు; 354 వికెట్లు షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 5872 పరుగులు,416 వికెట్లు చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! -
ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్) ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ పీఎస్ఎల్లో పెషావర్ జాల్మీ తరపున ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కటింగ్.. కరాచీ బౌలర్ మహ్మద్ నబీ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి పక్కకు వెళ్లింది. ఇంతలో వెనకాల వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. బెన్ కటింగ్ తన కాళ్లతో వికెట్లను తాకాడేమోనని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్ చేశారు. చదవండి: Under-19 Worldcup: అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్ ఇదే సమయంలో పీఎస్ఎల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఎరిన్ హాలండ్ ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బెన్ కటింగ్ ఔట్ అయ్యాడని తలకు చేతులు పెట్టి ''ఎంత పని జరిగింది'' అంటూ తెగ ఫీలయిపోయింది. అయితే కటింగ్ ఔట్ కాలేదని తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నవ్వడం మొదలుపెట్టింది. ఏంట్రా ఇది కటింగ్ ఔటైతే యాంకరమ్మ ఎందుకు ఫీలయ్యిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ యాంకర్ ఎవరో కాదు.. స్వయానా బెన్ కటింగ్ అర్థాంగి. ఆమె ఇచ్చిన హావభావాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడం.. అది కాస్త వైరల్‌గా మారిపోవడం జరిగిపోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి బెయిల్స్ పడిపోవడంలో బెన్ కటింగ్ పాత్రేమి లేదు. మహ్మద్ నబీ డెలివరీ వేయగానే.. అది కటింగ్ ప్యాడ్లను తాకి వెనక్కి వెళ్లింది. ఇదే సమయంలో కటింగ్ కాస్త వెనక్కి జరగడం.. వికెట్ కీపర్ మహ్మద్ కమ్రాన్ అక్మల్ కూడా బంతిని అందుకునే ప్రయత్నంలో బెయిల్స్‌కు దగ్గరగా వచ్చాడు. పొరపాటున కమ్రాన్ చేతి బెయిల్స్‌ను తాకాయి. ఇది తెలియని మిగతా ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా.. కమ్రాన్ అసలు విషయం చెప్పాడు. దీంతో జట్టు తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంది. చదవండి: Under-19 World Cup: గ్రౌండ్లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు ఈ మ్యాచ్‌లో బెన్ కటింగ్ 22 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ లో పెషావర్ జాల్మీ 9 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌పై విజయం సాధించింది. పెషావర్‌కు సీజన్లో రెండో విజయం కాగా.. కరాచీ కింగ్స్‌కు వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. It’s alright, Erin 🤗 #HBLPSL7 l #LevelHai l #KKvPZ @erinvholland pic.twitter.com/Rorv0FGVcG — PakistanSuperLeague (@thePSLt20) February 4, 2022 -
బాబర్ అజమ్ నెంబర్‌వన్.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు
No Indian Batter Ranks In Top Five ICC Batting Rankings.. టి20 ప్రపంచకప్ 2021 ముగిసిన అనంతరం ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా లేడు. ఇక బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విభాగంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. చదవండి: Ind Vs Nz 2021: ‘బ్యాటర్’గా విరాట్ కోహ్లి... టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే! బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలాన్ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్ మార్క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ ఒకస్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన వనిందు హసరంగ 797 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్ అల్ హసన్ (260 పాయింట్లు), లియామ్ లివింగ్‌స్టోన్(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Massive gains for star performers of the #T20WorldCup 📈 More on all the changes in the @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 👉 https://t.co/DFstAKi06Y pic.twitter.com/QOsGIMYNUw — ICC (@ICC) November 17, 2021 -
చేతులెత్తేసిన అఫ్గాన్.. టీమిండియా ఇంటికి
New Zeland Enters Semifinal Knock Out AFG And IND.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతులెత్తేసింది. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను ఆలౌట్ చేయడంలో అఫ్గాన్ బౌలర్లు విఫలమయ్యారు. 18.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేధించడంతో అఫ్గానిస్తాన్ ఇంటిబాట పట్టింది. పోతూపోత టీమిండియాను కూడా ఇంటికి తీసుకెళ్లనుంది. ఇక సోమవారం(నవంబర్ 8న) నమీబియాతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు నామమాత్రంగా మారింది. టీమిండియా సెమీస్ ఆశలన్నీ అఫ్గాన్ బౌలర్లపైనే ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జర్దన్ 73 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే అఫ్గాన్ బౌలర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఇక అఫ్గాన్ కివీస్‌ను 81 అంతకంటే తక్కువ పరుగులకు ఆలౌట్ చేస్తే మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు ప్రవేశిస్తుంది. మరి అఫ్గాన్ బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. చదవండి: Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..! -
టీమిండియా మాకో విజయం కావాలి!.. తేడా వస్తే
టి20 ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒక జట్టు భారత్... బలాబలాలు, అనుభవం ప్రకారం టోర్నీలో ఆడుతున్న ఏ టీమ్‌కంటే తక్కువ కాదు... కానీ మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగే సమయానికి భారత్ పరిస్థితి అందరికంటే భిన్నంగా ఉంది. వరల్డ్‌కప్ గెలుచుకోవడం సంగతి తర్వాత... గ్రూప్ దశలోనే నిష్క్రమించకుండా పోరాడాల్సి వస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన ఫలితమిది! అయితే ఇంకా ఏమూలో కాస్త ఆశ మిగిలి ఉంది. మన చేతుల్లో ఉన్న మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆపై ఇతర మ్యాచ్‌ల ఫలితాలు, సమీకరణాలపై ఆధార పడాల్సిందే. ఈ క్రమంలో మొదటి గండం అఫ్గానిస్తాన్ రూపంలో పొంచి ఉంది. మామూలుగానైతే ఇది మనకు ఏకపక్ష విజయం కావాలి. కానీ మన పేలవ ప్రదర్శన, టోర్నీలో అఫ్గాన్ పోరాటపటిమ చూస్తే ఈ మ్యాచ్ అంత సులువు కాబోదు. అన్నింటికి మించి పొరపాటున ఇక్కడా తేడా వచ్చిందంటే ఇక చెప్పేదేమీ ఉండదు! అబుదాబి: వరుసగా రెండు పరాజయాలతో అభిమానుల ఆగ్రహావేశాలను రుచి చూసిన టీమిండియా వాటిని దాటి ఇప్పుడు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. భారత్ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్ టీమ్ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించి గ్రూప్ టాపర్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరగవచ్చు. చదవండి: Rohit Sharma: వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?! మార్పు ఉంటుందా! గత మ్యాచ్‌లో ఆడని సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అతను కోలుకోకపోతే దాదాపు అదే జట్టును టీమిండియా కొనసాగించవచ్చు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో స్వల్ప మార్పు ఖాయం. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా వస్తే ఇషాన్ కిషన్ అతనికి జోడీగా బరిలోకి దిగుతాడు. అప్పుడు రాహుల్‌ను నాలుగో స్థానంలో పంపించే అవకాశం ఉంది. అయితే ఆర్డర్ మారినా బ్యాట్స్‌మెన్ ఆటతీరు మారితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. తొలి రెండు మ్యాచ్‌లను బట్టి టీమ్‌లో ఏ ఒక్కరూ తమ స్థాయికి తగినట్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఆల్‌రౌండర్లు హార్దిక్, జడేజాల పరిస్థితి కూడా అంతే. పేసర్లుగా బుమ్రా, షమీలు ఖాయం. అయితే సీనియర్ అశ్విన్‌ను ఆడిస్తారా లేదా అనేది మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తంగా రెండు మ్యాచ్‌లలో కలిపి మన బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీయగలగడం పరిస్థితి సూచిస్తోంది. కాబట్టి గెలుపు కావాలంటే ప్రతీ ఒక్కరి నుంచి అద్భుత ప్రదర్శన రావాల్సిందే. చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! స్పిన్ బలంతోనే... అఫ్గానిస్తాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ నెగ్గింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టి20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల ‘12 ఓవర్లు’ మ్యాచ్‌ను శాసిస్తాయి. రషీద్ ఖాన్, నబీ, ముజీబ్‌లు సత్తా చాటితే భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. మొత్తంగా ఈ టీమ్ అంటే తేలికభావం చూపించకుండా భారత్ ఆడాల్సి ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్/సూర్యకుమార్,పంత్, హార్దిక్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, వరుణ్. అఫ్గానిస్తాన్: నబీ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్, ముజీబ్, నవీన్, హసన్. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. మంచు ప్రభావం కూడా ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపవచ్చు. -
PAK Vs AFG: ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం.. పాక్ హ్యట్రిక్ విజయం
ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం.. పాక్ హ్యట్రిక్ విజయం; సెమీస్ బెర్త్‌లో ముందంజ సమయం: 23: 08.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతుంది. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. చివర్లో ఆసిఫ్ అలీ( 7 బంతుల్లో 25, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ బాబర్ అజమ్(51, 47 బంతులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ రేసును దాదాపు ఖరారు చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అఫ్గన్ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయిబ్ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో అఫ్గనిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. షోయబ్ మాలిక్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ నవీన్ హుల్ అక్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ ఔట్ కావడంతో పాకిస్తాన్ కీలకదశలో ఐదో వికెట్ కోల్పోయింది. అంతకముందు బాబార్ అజమ్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. బాబర్ అజమ్ ఫిఫ్టీ.. పాకిస్తాన్ 116/3 రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ హఫీజ్(10) ఔటవ్వడంతో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్(30) ఔట్.. 13 ఓవర్లలో పాకిస్తాన్ 89/2 ఫఖర్ జమాన్(30) రూపంలో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ నబీ బౌలింగ్‌లో జమాన్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 42, మహ్మద్ హఫీజ్ 9 పరుగులతో ఆడుతున్నారు. 9 ఓవర్లలో పాకిస్తాన్ 63/1 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(8) తొందరగా ఔటైనప్పటికి ఫఖర్ జమాన్, బాబర్ అజమ్‌లు ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. మహ్మద్ రిజ్వాన్(8) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ సమయం: 21:41.. అఫ్గన్ బౌలర్ ముజిబ్ ఉర్ రెహమాన్ పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చాడు. ఇన్ఫామ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను(8) పెవిలియన్ చేర్చాడు. ముజీబ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి నవీన్ హుల్ హక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 11, ఫఖర్ జమాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అఫ్గన్ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయిబ్ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో అఫ్గనిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. సమయం: 21:00.. 18 ఓవర్లు ముగిసేసరికి అఫ్గనిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 21, గుల్బదిన్ నయీబ్ 27 పరుగులతో ఆడుతున్నారు. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గన్‌ను నబీ, గుల్బదిన్‌లు చక్కదిద్దారు. 15 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 93/6 12.5 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 76/6 10 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 65/5 సమయం: 20:10.. 7 ఓవర్లు ముగిసేసరికి అఫ్గనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కరీమ్ జైన్ 13, నజ్బుల్లా జర్దన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి గుర్బాజ్(10) హసన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అస్గర్ అఫ్గన్(10) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గన్ అస్గర్ అఫ్గన్(10) రూపంలో అఫ్గనిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. హారిస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ మూడో బంతికి అస్గర్ అఫ్గన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. రహమతుల్లా 10, కరీమ్ జనత్ 6 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన అఫ్గన్.. 3 ఓవర్లలో 13/2 సమయం: 19:48.. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గన్ మహ్మద్ షెహజాద్(8) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో షాట్ కొట్టడానికి ప్రయత్నించి బాబర్ అజమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం అఫ్గన్ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 13 పరగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో హజ్రతుల్లా డకౌట్‌గా వెనుదిరిగాడు. దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 గ్రూప్-2లో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక వరుస విజయాలతో పాక్ జోరుమీద కనిపిస్తుండగా.. స్కాట్లాండ్పై అఫ్గన్ భారీ విజయంతో మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఇక ఇరుజట్ల మధ్య 2013లో జరిగిన ఒక టి20 మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఇక టీమిండియా, న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టను ఓడించిన పాకిస్తాన్‌కు అఫ్గన్‌ను ఓడించడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అప్గన్ ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజమ్(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది అఫ్గనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహమాన్ -
Rashid Khan: సంచలన విజయం.. రషీద్ ఖాన్ భావోద్వేగం.. కనీసం ఈ గెలుపైనా..
Rashid Khan Pens Emotional Note for Afghanistan Fans: ‘‘గొప్ప ఆరంభం.. ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా దేశ ప్రజలకు అభినందనలు. ఈ గెలుపు మీ ముఖాలపై చిరునవ్వులు పూసేందుకు.. పండుగ చేసుకునేందుకు కారణమవుతుందని ఆశిస్తున్నా. ఆ దేవుడి దయ వల్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి... దేశాన్ని.. జాతిని తలెత్తుకునేలా చేశాం. అలాగే ముందుకు సాగుతాం. మీ ప్రార్థనలు, మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి’’ అంటూ అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఉద్వేగభరిత పోస్టు చేశాడు. తాలిబన్ల పాలనలో దేశంలో నెలకొన్న అనిశ్చితితో సతమవుతున్న ప్రజలకు తమ గెలుపు కాస్త ఊరట కలిగిస్తుందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ సూపర్-12కు నేరుగా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూపు-2లో ఉన్న అఫ్గన్.. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. 130 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో శుభారంభం చేసింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలంతో అద్వితీయి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పరిస్థితులను తలచుకుని రషీద్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచ వేదికపై తాము సాధించిన విజయం దేశ ప్రజలకు గర్వకారణమంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. స్కాట్లాండ్తో మ్యాచ్ ఆరంభానికి ముందు తమ జాతీయ గీతం వినిపించగానే అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ కన్నీటి పర్యంతమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ వరకు తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అఫ్గనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్.. స్కోర్లు: అఫ్గనిస్తాన్: 190/4 (20) స్కాట్లాండ్: 60 (10.2) చదవండి: T20 WC 2021 IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు Great start congratulations to Everyone and specially to the people back home 🇦🇫.I hope this win have given you something to smile and celebrate. INSHALLAH We will do the best and make the country and nation more proud.Your prayers and support is always🔑🇦🇫 Afghanistan zindabad pic.twitter.com/w53EorFNws — Rashid Khan (@rashidkhan_19) October 25, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ
Mohammad Nabi Took 5 Catches New Record: ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నబీ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... 193 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా మరోసారి ఓటమిని మూటగట్టుకుని... ఆఖరి స్థానంతో లీగ్‌ను ముగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ నిలిచాడు. స్కోర్లు: ముంబై: 235/9 (20) హైదరాబాద్: 93/8 (20) చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల SRH Vs MI: ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు RCB Vs DC: భళా భరత్... చివరి బంతికి సిక్సర్‌తో గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్! -
అఫ్గాన్ టీ20 కెప్టెన్‌గా మహ్మద్ నబీ
కాబుల్: అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్లో జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఆల్లా దయతో టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం’ అని నబీ ట్వీట్ చేశాడు. తనను సంప్రదించకుండా టీ20 ప్రపంచకప్‌లో ఆడే అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ జట్టు: రషీద్‌ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్, కరీమ్ జనత్, హజ్రతుల్లా జాజాయ్, గుల్బాడిన్ నైబ్, ఉస్మాన్ ఘని, నవీన్ ఉల్ హక్, అస్ఘర్ అఫ్గాన్, హమీద్ హసన్, మహ్మద్ నబి, షరాఫుద్దీన్ అష్రాఫ్, నజీబుల్లా జద్రాన్, దావ్లత్ జద్రాన్, హష్మతుల్లా షాహిది, షాపూర్ జద్రాన్, మహ్మద్ షహ్జాద్, కాయిస్ అహ్మద్. చదవండి: అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్ At this critical stage, I admire the decision of ACB for the announcement of leading the National Cricket Team in T20 Format. InshaAllah together we will present a great picture of the Nation in the upcoming T20 World Cup. — Mohammad Nabi (@MohammadNabi007) September 9, 2021 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
Afghanistan: ఏం పర్లేదు.. తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు, మద్దతిస్తారు
కాబుల్: రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్‌లో మరోమారు తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాచరిక పాలన కొనసాగించే తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ భవితవ్యం ఎంటనేది ప్రశ్నర్థకంగా మారింది. ఇక క్రికెట్లో కూడా అఫ్గన్ ఇప్పుడిప్పుడే పటిష్టంగా తయారవుతుంది. అయితే తాలిబన్ల రాకతో అఫ్గన్ క్రికెట్‌కు వచ్చిన ప్రమాదమేమి లేదని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ సీఈవో హమీద్ షిన్వరీ తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో హమీద్ మాట్లాడుతూ.. '' తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు.. వాళ్లు ఆటకు కూడా మద్దతిస్తారు. వాళ్లు మా ఆటకు అభ్యంతరం చెప్పరనే భావిస్తున్నాం. ఇక దేశంలోని క్రికెటర్లకు మా భరోసా పూర్తిగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ జర్దన్‌లు యూకేలో ఉన్నారు. హండ్రెడ్ టోర్నమెంట్లో బిజీగా ఉన్న వాళ్లు తమ కుటుంబసభ్యుల గురించి ఆందోళన పడుతున్నారు. ఈ విషయం గురించి ఆందోళన అవసరం లేదు.. క్రికెటర్ల కుటుంబాలను కాపాడే బాధ్యత మాది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబర్ 1 నుంచి పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల మధ్య జరగనున్న టీ20 సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్‌లో తమ జట్టుకు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు. -
నా తండ్రి ఆటను టీవీలో చూశా.. అప్పడే నిశ్చయించుకున్నా
కాబుల్: తండ్రి క్రికెట్ ఆడుతుండగానే కొడుకు కూడా అదే ఆటలో రాణిస్తుండడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆఫ్గన్ క్రికెటర్ మహ్మద్ నబీకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నబీ అప్ఘనిస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తుండగానే అతని కొడుకు హసన్ ఖాన్ కూడా క్రికెట్లో దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు. ప్రస్తుతం షార్జా అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న 16 ఏళ్ల హసన్ బుఖతీర్ ఎలెవెన్ తరపున మ్యాచ్ ఆడి 30 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు ఉండడం విశేషం. ఇక తన తండ్రి ఆట టీవీలో చూసి తాను క్రికెట్లోకి రావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. అతని అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ పేర్కొన్నాడు. న్యూ నేషనల్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హసన్ మాట్లాడుతూ..'' నా తండ్రి ఒక క్రికెటర్ అని నేనప్పుడు ఒత్తిడికి లోనవ్వలేదు. అతని అడుగుజాడల్లో నడుస్తూ ఒక పెద్ద క్రికెటర్ కావాలనేది నా కోరిక. నా తండ్రి ఆటను ఎప్పుడు మొదటిసారి టీవీలో చూశానో అప్పుడే దేశం తరపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. నేనిప్పుడు షార్జా అకాడమీలో శిక్షణ పొందుతున్నా.. నా తొలి గురువు మాత్రం ఎప్పటికి మా నాన్నే. మా నాన్న ఏది చెబితే అది కచ్చితంగా వింటా. ఉదాహరణకు నా కోచ్ నాకు ఏదైనా సలహా ఇచ్చినా మొదట ఆ విషయాన్ని నా తండ్రికి చెప్పి అది మంచిదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకుంటా. ఒకవేళ అది నీ మంచికే అని నా తండ్రి చెబితే దాన్ని ఫాలో అవుతాను.. మా నాన్న అంటే నాకు అంత గౌరవం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నబీ టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా.. వన్డే, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు నబీ ఆఫ్గన్ తరపున 127 వన్డేల్లో 2817 పరుగులతో పాటు 130 వికెట్లు.. 80 టీ20ల్లో 1394 పరుగులతో పాటు 71 వికెట్లు తీశాడు. ఇక 3 టెస్టులు మాత్రమే ఆడిన నబీ 24 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఇప్పటివరకు 16 మ్యాచ్‌లాడి 177 పరుగులు చేశాడు. చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా -
నేను బ్రతికే ఉన్నా: క్రికెటర్
కాబోల్: గత కొన్ని రోజులుగా తాను చనిపోయానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ స్పష్టం చేశాడు. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలనే రూమర్లు క్రియేట్ చేశారని నబీ వెల్లడించాడు. నబీ గుండె పోటుతో మృతి చెందాడంటూ వార్తలు వ్యాపించాయి. ఈ విషయాన్ని తాజాగా గ్రహించిన నబీ.. తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానంటూ ట్వీటర్లో వివరణ ఇచ్చుకున్నాడు. దీనిలో భాగంగా కబిల్ స్టేడియంలో నబీ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలను సైతం అఫ్గాన్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేసింది. ఇటీవల నబీ అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్న ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ అజేయంగా 84 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 12వసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇది ఓవరాల్‌గా అత్యుత్తమం. కాగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున కోహ్లి 11సార్లు మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు. -
నబీ తర్వాతే కోహ్లి..
మొహాలీ: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ఘనత అఫ్గాన్‌ది. ఒకటి కాదు.. రెండు సార్లు వరుస అత్యధిక విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే తన రికార్డునే తానే బ్రేక్ చేసుకుంది అఫ్గాన్. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో గెలిచిన అఫ్గాన్ కొత్త చరిత్ర లిఖించింది. టీ20ల్లో వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది. 2018 ఫిబ్రవరిలో అంతర్జాతీయ టీ20ల్లో జైత్రయాత్రను ఆరంభించిన అఫ్గాన్ ఇప్పటివరకూ ఒక్క పరాజయాన్ని కూడా చూడలేదు. అంతకుముందు 2016-17 సీజన్లో వరుస 11 టీ20 విజయాల్ని ఖాతాలో వేసుకుంది అఫ్గాన్. దాంతో తన పేరిట ఉన్న రికార్డును సవరించుకుంది. కాగా, అఫ్గాన్ గెలుపులో మహ్మద్ నబీది కీలక పాత్ర. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నబీ అజేయంగా 84 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకూ అఫ్గాన్ తరఫున టీ20ల్లో 12సార్లు నబీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. ఇది ఓవరాల్‌గా అత్యుత్తమం. కాగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున కోహ్లి 11సార్లు మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అజేయంగా 72 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ల అవార్డులను కోహ్లి సమం చేశాడు. అఫ్రిది తన టీ20 కెరీర్లో పాక్ తరఫున 11 సందర్భాల్లో ఈ అవార్డు దక్కించుకున్నాడు. -
క్రికెట్ బోర్డుపై నబీ సంచలన వ్యాఖ్యలు
చాట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ ఘోర ఓటమి పాలు కావడానికి తమ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ ధ్వజమెత్తాడు. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు కొన్ని రోజుల ముందు కెప్టెన్‌గా గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేయడమే అతి పెద్ద తప్పంటూ బోర్డు చర్యను విమర్శించాడు. తాము ఒక జట్టుగా విఫలం కావడానికి పాత కెప్టెన్‌ను మార్చి కొత్తగా నైబ్ నియమించడమే కారణమన్నాడు. ‘వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్సీ మార్పు జట్టుకు తీవ్ర నష్టం చేసింది. మీరు ఎంపిక చేసిన కెప్టెన్‌కు ఎప్పుడూ ఆ బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం లేదు.మరి అటువంటప్పుడు వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు అతన్నే ఎందుకు ఎంపిక చేశారు. మేము భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లపై చాలా మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. అయినా వాటిని కోల్పోయాం. (ఇక్కడ చదవండి: అఫ్గాన్ చరిత్రకెక్కింది) మొత్తం ఆ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో కూడా గెలవలేకపోయాం. ఇది సమిష్టి పరాజయం. కాకపోతే కెప్టెన్సీ ఉన్నపళంగా మార్చడంతో అది సెట్ కాలేదు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ రషీద్ ఖానే సరైన కెప్టెన్. జట్టును ముందుండి నడిపించే లక్షణాలు రషీద్‌లో పుష్కలం. అతన్ని నాతో పాటు మాజీ కెప్టెన్ అస్గార్ కూడా సమర్ధిస్తున్నాడు. యువకులతో కూడిన అఫ్గాన్ జట్టుకు రషీద్ ఖాన్ అవసరం ఎంతో ఉంది. కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు కొనసాగిస్తే జట్టు అద్భుతమైన విజయాలు బాట పడుతుంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకడు’ అని నబీ పేర్కొన్నాడు. ఇటీవల తన టెస్టు కెరీర్‌కు నబీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తో నబీ టెస్టు కెరీర్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 224 పరుగుల తేడాతో గెలవడంతో నబీకి ఘనమైన టెస్టు వీడ్కోలు పలికింది. -
క్రికెటర్ నబీ సంచలన నిర్ణయం
చోట్టాగ్రామ్: అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకడానికి సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నబీ.. ఎర్రబంతి క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత నబీ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత ఇక టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ టీమ్ మేనేజర్ నజీమ్ జర్ అబ్దుర్రాహీమ్ జయ్ స్పష్టం చేశారు. ‘ అవును.. బంగ్లాదేశ్‌తో టెస్టు తర్వాత నబీ రిటైర్ అవుతున్నాడు. నబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టెస్టు ఫార్మాట్ నుంచి నబీ తప్పుకోవడానికి గల కారణాలను మేము అర్థం చేసుకోగలం’ అని నజీమ్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ అఫ్గానిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా సెంచరీ చేయగా, అస్గర్ అఫ్గాన్(92) తృటిలో శతకం కోల్పోయాడు. -
‘ఐపీఎల్‌లోనూ ఆ ఘనత సాధిస్తా’
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనకు అవకాశం ఇస్తే బ్యాట్‌తో కూడా రాణించాలని ఉందని అంటున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ. టీ 20ల్లో అఫ్గానిస్తాన్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కల్గిన నబీ తన బ్యాటింగ్ పవర్‌ను ఐపీఎల్లో కూడా చూపించాలని ఉందన్నాడు. హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్న నబీ.. తాజా సీజన్లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు. ‘ఈ లీగ్‌లో హైదరాబాద్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని మా జట్టు అభిమానుల్ని అలరించడం ఖాయం. నాకు ఆడే అవకాశం లభిస్తే బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణిస్తా. ఐపీఎల్లో కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాలని ఉంది’ అని నబీ తెలిపాడు. తొలుత తన బౌలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్న ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. బ్యాటింగ్‌లో కూడా సత్తా చూపడతానని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ 20లో నబీ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అఫ్గాన్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో లిఖించుకున్నాడు. -
అఫ్గానిస్తాన్ సంచలనం.. టీ20 సిరీస్ సొంతం
క్రికెట్లో పసికూన అఫ్గనిస్తాన్ మరోసంచలనం సృష్టించింది. జింబాంబ్వేను మట్టికరిపించింది. రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి కప్పు ఎగరేసుకెళ్లింది. సన్‌రైజర్స్ తరపున ఆడిన రషీద్ ఖాన్, మహమ్మద్ రఫీలు స్వదేశం తరపున మరోసారి రాణించారు. జింబాంబ్వేతో జరిగిన రెండో టీ20లో అఫ్గానిస్తాన్ సంచలనం నమోదు చేసింది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి సిరీస్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన మహమ్మద్ నబీ 26 బంతుల్లో 45పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాంబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అఫ్గాన్ బౌలర్లు జింబాంబ్వేను నిలువరించారు. ఇందులోను మరో సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ మెరుగైన బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లకు 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అండర్ 19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ సెమీస్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన మరో యువ కెరటం ముజీబ్ జర్దాన్ రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో 5మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్ సైతం గెలిచి క్రికెట్లో ఉనికిని చాటాలని అఫ్గనిస్తాన్ ఆరాటపడుతోంది. ఇక ఇటవలే టెస్టు హోదా సంపాదించుకున్న ఈ క్రికెట్ పసికూన భారత్‌తో తన తొలిటెస్టు ఆడనుంది. జూన్ 14న బెంగుళూరులో ఈ మ్యాచ్ జరగనుంది. -
ట్వంటీ 20: అఫ్గాన్ ప్లేయర్ అరుదైన రికార్డ్
గ్రేటర్ నోయిడా: ట్వంటీ 20 ఫార్మాట్ లో అఫ్గనిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఓ ట్వంటీ20 మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఫీట్ నెలకొల్పాడు నబీ. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో ట్వంటీ 20లో నబీ భారీ హాఫ్ సెంచరీ(30 బంతుల్లో 89: 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించడంతో అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి ప్రత్యర్ది ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆరు లేదా అంతకన్నా దిగువ స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ వైట్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (85 నాటౌట్) రికార్డును అదిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో స్లాట్లాండ్ క్రికెటర్ మామ్సెన్(68 నాటౌట్), జింబాబ్వే ప్లేయర్ వాల్లర్ (68), పాక్ వెటరన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ (66 నాటౌట్) ఉన్నారు. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. 28 పరుగుల తేడాతో అఫ్గాన్ చేతిలో వరుసగా మూడో ట్వంటీ20లోనూ ఓటమిని చవిచూసింది. ఐర్లాండ్ ఓపెనర్లు స్టిర్లింగ్(49), థాంప్సన్(43) తో పాటు కీపర్ విల్సన్ హాఫ్ సెంచరీ(34 బంతుల్లో 59: 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఫలితం దక్కలేదు. ఐర్లాండ్ తన చివరి 5 వికెట్లను కేవలం ఐదు పరుగుల తేడాతో కోల్పోవడం ఆ జట్టు విజయాన్ని అడ్డుకుంది. -
తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా..
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 వేలంలో ఆఫ్ఘానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ నబీని రూ. 30 లక్షల ధరతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు క్రికెటర్లు ఈసారి ఐపీఎల్ వేలం బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో మొహ్మద్ నబీ ఒకడు. అయితే ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్ గా నబీ గుర్తింపు పొందాడు. అతను కనీస ధర రూ.30 లక్షలు కాగా, అదే ధరకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ కావడంతో అతన్ని తీసుకోవాడానికి సన్ రైజర్స్ ఆసక్తి కనబరిచింది. కుడి చేత వాటం ఆటగాడైన నబీ.. ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఆఫ్ఘాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా, 73 వికెట్లు తీశాడు. -
ఈసారి ‘అఫ్గాన్’ కూడా...
351 మందితో ఐపీఎల్ తుది జాబితా ∙20న వేలం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే వేలంలో ఆటగాళ్ల జాబితాను 351 మందికి కుదించారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. ఈనెల 20న జరిగే ఈ వేలంలో ఓవరాల్‌గా 799 మందితో ఈ జాబితాను రూపొందించినా అందులో వడపోత అనంతరం 448 మందిని తప్పించారు. అయితే తొలిసారిగా అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కెప్టెన్ అస్ఘర్ స్టానిక్జాయ్, మొహమ్మద్ నబీ, షెహజాద్, రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్ అందుబాటులో ఉండగా.. వీరిలో షెహజాద్, రషీద్‌లకు అత్యధికంగా కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది. యూఏఈ బ్యాట్స్‌మన్ చిరాగ్ సూరి ఇతర అసోసియేట్ ఆటగాడు. ఇక భారత్ తరఫున ఆడి కూడా తుది జాబితాలో చోటు కోల్పోయిన ఏకైక ఆటగాడు పేసర్ సుదీప్ త్యాగి. మరోవైపు వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఈసారి కూడా వేలంలో రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఉండవచ్చు. ఇషాంత్‌కు అత్యధికంగా రూ.2 కోట్ల కనీస ధర సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సహా ఏడుగురు ఆటగాళ్లకు అత్యధికంగా రూ.2 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్, వన్డే...టి20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌లతో పాటు ఆసీస్ పేసర్లు జాన్సన్, కమ్మిన్స్, శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఈ లిస్టులో ఉన్నారు. ఆ తర్వాత రూ.కోటిన్నర కనీస ధరలో జేసన్ హోల్డర్ (విండీస్), హాడిన్ (ఆసీస్), బెయిర్‌స్టో (ఇంగ్లండ్), లియోన్ (ఆసీస్), అబాట్ (దక్షిణాఫ్రికా), బౌల్ట్ (కివీస్) ఉండగా రూ.కోటి ధరలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్, హేల్స్, కోరీ అండర్సన్ (కివీస్), కౌల్టర్‌నైల్ (ఆసీస్), రబడా (దక్షిణాఫ్రికా), మార్లన్ శామ్యూల్స్ (విండీస్), ఇలియట్ (కివీస్) ఉన్నారు. ఇటీవల జరిగిన టి20 మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచిన మోహిత్ ఆహ్లావత్ రూ.10 లక్షలకు అందుబాటులో ఉన్నాడు. -
అప్ఘానిస్తాన్ జోరు
నాగ్‌పూర్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అప్ఘానిస్తాన్ జట్టు అదరగొట్టే ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గురువారం గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఈ జట్టు హాంకాంగ్‌ను ఓడించింది. దీంతో 12న జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ నాలుగు వికెట్లతో చెలరేగడంతో హాంకాంగ్ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడింది. అన్షుమాన్ రాత్ (31 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్), క్యాంప్‌బెల్ (24 బంతుల్లో 27; 5 ఫోర్లు) టాప్ స్కోరర్లు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 119 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మొహమ్మద్ షెహజాద్ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), నూర్ అలీ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగులు సమకూరాయి. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. క్యాంప్‌బెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.