ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం.. పాక్ హ్యట్రిక్ విజయం; సెమీస్ బెర్త్‌లో ముందంజ
సమయం: 23: 08.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతుంది. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. చివర్లో ఆసిఫ్ అలీ( 7 బంతుల్లో 25, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ బాబర్ అజమ్(51, 47 బంతులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ రేసును దాదాపు ఖరారు చేసుకుంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అఫ్గన్ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయిబ్ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో అఫ్గనిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
షోయబ్ మాలిక్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
నవీన్ హుల్ అక్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ ఔట్ కావడంతో పాకిస్తాన్ కీలకదశలో ఐదో వికెట్ కోల్పోయింది. అంతకముందు బాబార్ అజమ్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
బాబర్ అజమ్ ఫిఫ్టీ.. పాకిస్తాన్ 116/3
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ హఫీజ్(10) ఔటవ్వడంతో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
ఫఖర్ జమాన్(30) ఔట్.. 13 ఓవర్లలో పాకిస్తాన్ 89/2
ఫఖర్ జమాన్(30) రూపంలో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ నబీ బౌలింగ్‌లో జమాన్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 42, మహ్మద్ హఫీజ్ 9 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లలో పాకిస్తాన్ 63/1
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(8) తొందరగా ఔటైనప్పటికి ఫఖర్ జమాన్, బాబర్ అజమ్‌లు ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు.
మహ్మద్ రిజ్వాన్(8) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
సమయం: 21:41.. అఫ్గన్ బౌలర్ ముజిబ్ ఉర్ రెహమాన్ పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను(8) పెవిలియన్ చేర్చాడు. ముజీబ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి నవీన్ హుల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 11, ఫఖర్ జమాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన అఫ్గన్ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయిబ్ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో అఫ్గనిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
సమయం: 21:00.. 18 ఓవర్లు ముగిసేసరికి అఫ్గనిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 21, గుల్బదిన్ నయీబ్ 27 పరుగులతో ఆడుతున్నారు. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గన్‌ను నబీ, గుల్బదిన్‌లు చక్కదిద్దారు.
15 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 93/6
12.5 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 76/6
10 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 65/5
సమయం: 20:10.. 7 ఓవర్లు ముగిసేసరికి అఫ్గనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కరీమ్ జైన్ 13, నజ్బుల్లా జర్దన్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి గుర్బాజ్(10) హసన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
అస్గర్ అఫ్గన్(10) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గన్
అస్గర్ అఫ్గన్(10) రూపంలో అఫ్గనిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. హారిస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ మూడో బంతికి అస్గర్ అఫ్గన్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. రహమతుల్లా 10, కరీమ్ జనత్ 6 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన అఫ్గన్.. 3 ఓవర్లలో 13/2
సమయం: 19:48.. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గన్ మహ్మద్ షెహజాద్(8) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో షాట్ కొట్టడానికి ప్రయత్నించి బాబర్ అజమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం అఫ్గన్ 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 13 పరగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో హజ్రతుల్లా డకౌట్‌గా వెనుదిరిగాడు.
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 గ్రూప్-2లో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక వరుస విజయాలతో పాక్ జోరుమీద కనిపిస్తుండగా.. స్కాట్లాండ్‌పై అఫ్గన్ భారీ విజయంతో మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఇక ఇరుజట్ల మధ్య 2013లో జరిగిన ఒక టి20 మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఇక టీమిండియా, న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టను ఓడించిన పాకిస్తాన్‌కు అఫ్గన్‌ను ఓడించడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అప్గన్ ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయి.
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజమ్(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది
అఫ్గనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment