
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో భాగంగా కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నబీ మరో నాలుగు పరుగులు సాధిస్తే.. టీ20ల్లో 5,000 పరుగులు చేసిన క్లబ్‌లో చేరుతాడు. అయితే టీ20ల్లో 5,000 పరుగులు, 300కి పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డులెక్కుతాడు.
అంతకుముందు కీరన్ పొలార్డ్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావోలు ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో 329 మ్యాచ్‌లు ఆడిన నబీ 4,996 పరుగులతో పాటు, 302 వికెట్లు సాధించాడు. ఇక మార్చి 26 న వాంఖడే వేదికగా కేకేఆర్- సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది.
ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు
కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) - 11,427 పరుగులు, 304 వికెట్లు
డ్వేన్ బ్రావో (వెస్టిండీస్) - 6747 పరుగులు,571 వికెట్లు
ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్) - 6574 పరుగులు; 354 వికెట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 5872 పరుగులు,416 వికెట్లు
చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!
Comments
Please login to add a commentAdd a comment