T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మొహమ్మద్‌ నబీ.. 45 దేశాలపై విజయాలు T20 World Cup 2024 AUS VS AFG: Mohammad Nabi Has Won International Matches Against 45 Different Countries | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మొహమ్మద్‌ నబీ.. 45 దేశాలపై విజయాలు

Published Sun, Jun 23 2024 7:42 PM | Last Updated on Sun, Jun 23 2024 9:11 PM

T20 World Cup 2024 AUS VS AFG: Mohammad Nabi Has Won International Matches Against 45 Different Countries

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 23) పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. సూపర్‌-8 గ్రూప్‌-1లో పటిష్టమైన ఆస్ట్రేలియాను చిన్న జట్టైన ఆఫ్ఘనిస్తాన్‌ చిత్తు ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెతే​సిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటై, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడి ఆసీస్‌కు జీర్ణించుకోలేని ఓటమి రుచి చూపించారు.

ఆఫ్ఘన్‌ బౌలర్లలో గుల్బదిన్‌ నైబ్‌ (4-0-24-4) ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. నవీస్‌ ఉల్‌ హక్‌ 3, ఒమర్‌జాయ్‌, మొహమ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌ (59) ఒంటిరి పోరాటం​ చేయగా.. మరో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు (మార్ష్‌ (12), స్టోయినిస్‌ (11)) చేశారు.

అంతకుముందు గుర్భాజ్‌ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 3, జంపా 2, స్టోయినిస్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్‌. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించలేదు.

చరిత్ర సృష్టించిన మొహమ్మద్‌ నబీ
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపులో భాగమైన మొహమ్మద్‌ నబీ క్రికెట్‌ చరిత్రలో బహుశా ఏ ఆటగాడు సాధించని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్‌పై గెలుపుతో నబీ 45 దేశాలపై విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ఎనిమిది ఐసీసీ సభ్య దేశాలు (ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఉన్నాయి.  

నబీ విజయాలు సాధించిన దేశాలు..
బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, నేపాల్, యూఏఈ, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, హాంకాంగ్, అర్జెంటీనా, పాపువా న్యూ గినియా, కేమన్ దీవులు, ఒమన్, డెన్మార్క్, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, చైనా, నమీబియా, సింగపూర్, కెనడా, యూఎస్‌ఏ, కెన్యా, పాకిస్థాన్, ట్రినిడాడ్ & టొబాగో, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బంగ్లాదేశ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement