మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. షార్జా స్టేడియంలో ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఏ స్టేడియం కూడా 300 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బకొట్టారు. షొరీఫుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రాణించిన నబీ, షాహిది
71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షాహీది 92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహమ్మద్ నబీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 5, సెదికుల్లా అటల్ 21, రహ్మత్ షా 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 0, గుల్బదిన్ నైబ్ 22, రషీద్ ఖాన్ 10, ఖరోటే 27 (నాటౌట్), అల్లా ఘజన్‌ఫర్ 0, ఫజల్ హక్ ఫారూకీ 0 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో నబీ, ఖరోటే వేగంగా ఆడటంతో ఆఫ్ఘన్లు గౌరవప్రదమైన స్కోర్ చేశారు.
అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. తంజిద్ హసన్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య సర్కార్ 28, నజ్ముల్ హసన్ షాంటో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అల్లా ఘజన్‌ఫర్‌కు తంజిద్ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 42 ఓవర్లలో మరో 197 పరుగులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment