
PC: BCCI/IPL.com
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో కొత్త హిట్టర్ దొరికేశాడు. అతడు యువ ఆటగాడు అనికేత్ వర్మ. ఐపీఎల్-2025లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అనికేత్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనికేత్.. 5 సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ లక్నో ముందు ఫైటింగ్ స్కోర్ ఉంచడంలో అనికేత్‌ది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎవరీ అనికేత్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.
ఎవరీ అనికేత్ వర్మ..?
23 ఏళ్ల అనికేత్ వర్మ.. ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించాడు. కానీ అతడు దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అనికేత్ వర్మ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో తనను తను నిరూపించుకున్నాడు.
ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరపున 44 బంతుల్లో 120 చేసిన వర్మ.. మధ్యప్రదేశ్ లీగ్ (MPL) టీ20 లీగ్‌లో కేవలం 41 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అదేవిధంగా పురుషుల అండర్-23 స్టేట్ A ట్రోఫీలో సైతం ఆజేయ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.
చదవండి: #Ishan Kishan: నిన్న సెంచరీ.. కట్ చేస్తే! నేడు తొలి బంతికే ఔట్