షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మెహిది హసన్ మీరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు), మహ్మదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
మహ్మదుల్లా ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటై సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ 19, సౌమ్య సర్కార్ 24, జకీర్ హసన్ 4, తౌహిద్ హృదోయ్ 7, జాకెర్ అలీ 1, నసుమ్ అహ్మద్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ నాలుగు వికెట్లు తీసి 37 పరుగులిచ్చాడు. ఇవి అతని వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణంకాలు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment